News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Top 10 Headlines Today: గులాబీ తోటలో అసంతృప్తు రాగం- అభ్యర్థులు మారతారా? ఢిల్లీలో చంద్రబాబు చేసిందేంటీ? ఏపీలో ఏం జరగనుంది?

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

FOLLOW US: 
Share:

Top 10 Headlines Today:

గులాబీ తోటలో అసంతృప్తు రాగం  

భారత రాష్ట్ర సమితిలో అసంతృప్త స్వరాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. జాబితా ప్రకటించిన రోజు నుంచి సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడిప్పుడే బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. తమ నిర్ణయం తాము చేస్తామంటున్నారు. టిక్కెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాదు ... టిక్కెట్ ఆశించిన వారు కూడా అదే తరహా ప్రకటనలు చేస్తున్నారు. అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కుల సంఘాలతో మద్దతుగా ప్రకటనలు చేయిస్తున్నారు. దీనంతటికి కారణం కొన్ని  మార్పులుంటాయని కేసీఆర్ చెప్పడమేనని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. బల ప్రదర్శన చేసి టిక్కెట్లు పొందాలనుకుంటున్నారని అంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఏపీ రాజకీయాలపై ఢిల్లీ రూట్ ఎఫెక్ట్ ఉంటుందా?

దేశ నిర్మాణంలో భాగం కావాలనుకుంటున్నానని అది ఏ రూపంలో అన్నది కాలమే నిర్ణయిస్తుందని ఢిల్లీలో మీడియాతో నిర్వహించి  చిట్‌ చాట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేరుగా ఆయన  ప్రకన చేయలేదు కానీ.. దేశ నిర్మాణం గురించి మాట్లాడారంటే..అది జాతీయ రాజకీయాలే కావొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు ఇప్పటి వరకూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు కానీ నేరుగా ఎప్పుడూ ఢిల్లీ స్థాయిలో పదవులు  చేపట్టలేదు. ఏపీ వరకే ఆయన రాజకీయ  పదవులు ఉండేవి.కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారా అన్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కాంగ్రెస్‌లో మొదలైన లొల్లి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కుటుంబానికి రెండు సీట్ల వ్యవహారం దుమారం రేపుతోంది.  పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్...పీఈసీ సమావేశంలో రెండు సీట్ల అంశంపై సీరియస్ గా మాట్లాడినట్లు తెలుస్తోంది. పది రోజుల్లో సీట్ల ప్రక్రియ పూర్తయ్యే కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఉద్యోగ సంఘాలతో చర్చలు

ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం పూర్తి అయింది. జీపీఎస్‌ విధానాలపై ఉద్యోగ సంఘాలతో ఈ కమిటీ చర్చలు జరిపింది. భేటీ ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని అన్నారు. మరికొన్ని అంశాలు చేర్చాలని ఉ‍ద్యోగ సంఘాలు అడిగాయని.. అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పామని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వాన జాడ లేనట్టే

ఈ రోజు అవర్తనం తూర్పు మధ్య బంగాళాఖాతం & పరిసర ప్రాంతాల్లో ఏర్పడి సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిమీ నుంచి 7.8 కిమీ మధ్య కొనసాగుతుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం (ఆగస్టు 29) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ /వాయువ్య  దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకి వీస్తున్నాయని అన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తూర్పు, ఈశాన్య జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

చంద్రుడిపై ఆక్షిజన్ 

చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమ ఖాతాలో మరో అద్భుతమైన విజయాన్ని సాధించుకున్నాయి. చంద్రుడిపై సౌత్ పోల్ పై తిరుగుతూ పరిశోధనలు చేస్తున్న ప్రజ్ఞాన్ రోవర్... చంద్రుడి పొరల్లో ఉన్న కెమికల్ ఎలిమెంట్స్, ఖనిజాలను కనుగొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఆసియా కప్‌ తొలి మ్యాచ్ నేడే

నేటి నుంచి  ప్రారంభం కాబోయే  ఆసియా కప్ - 2023లో  తొలి మ్యాచ్ ఆతిథ్య పాకిస్తాన్ - నేపాల్ మధ్య జరుగనుంది.  పాక్‌లోని ముల్తాన్  క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది.  2018లో ఐసీసీ వన్డే హోదా పొంది.. ఇప్పుడిప్పుడే  అంతర్జాతీయ క్రికెట్‌లో బుడిబుడి అడుగులు వేస్తున్న నేపాల్‌కు ఒక అగ్రశ్రేణి జట్టుతో తలపడటం ఇదే తొలిసారి. స్వదేశంలో ఆసియా కప్‌ను ఘనంగా ఆరంభించి  భారత్‌తో మ్యాచ్‌కు సిద్ధం కావాలని   బాబర్ గ్యాంగ్ భావిస్తున్నది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

పాకిస్థాన్, భారత్ మ్యాచ్‌ టికెట్లు హాట్‌ కేకులు 

దాయాది దేశాల క్రికెట్ సమరం అంటే ఉండే క్రేజే వేరు. అదీ  వరల్డ్ కప్ వంటి హై ఓల్టేజ్ టోర్నమెంట్‌లో అయితే  అది  నెక్స్ట్ లెవల్‌కు వెళ్తుంది. క్రికెట్ అంటే పడిచచ్చే  భారత్, పాకిస్తాన్‌లలో  అభిమానులు ఈ  ఇరు జట్ల మధ్య   ఐసీసీ టోర్నీలలో మ్యాచ్ కోసం   ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారన్న విషయం మరోసారి రుజువైంది. ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో  భారత్ - పాకిస్తాన్ మధ్య  జరగాల్సి ఉన్న  మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు.  ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకానికి పెట్టిన నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

సిలబస్‌లో మార్పు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 28న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే గ్రూప్-2 రాత పరీక్షకు సంబంధించిన కొత్త సిలబస్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకుగాను రెండు దశల రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొదటి దశలో 150 మార్కులకు ప్రాథమిక (స్క్రీనింగ్) పరీక్ష, రెండో దశలో 300 మార్కులకు  ప్రధాన పరీక్ష (మెయిన్స్‌) నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

సమంత రియల్‌ లైఫ్‌తో ఖుషీ పోలిక 

'నిన్ను కోరి' సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమైన శివ నిర్వాణ.. డెబ్యూతోనే సూపర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత 'మజిలీ' మూవీతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇదే క్రమంలో ఆయన రూపొందించిన 'టక్ జగదీశ్' సినిమా డైరెక్ట్ ఓటీటీ వేదికగా విడుదలై, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ను తనదైన ఎమోషన్స్ జత చేసి తెరపై చూపిస్తూ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు దర్శకుడు శివ. ఈ క్రమంలో ఇప్పుడు 'ఖుషి' అనే రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ను అలరించడానికి వస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

Published at : 30 Aug 2023 08:54 AM (IST) Tags: Breaking News AP news today Andhra Pradesh News Todays latest news Top 10 headlines today Todays Top news Telugu Top News Website Top 10 Telugu News

ఇవి కూడా చూడండి

Jaishankar: కెనడాకు ఝలక్, అమెరికా, భారత్ మధ్య చర్చకు రాని నిజ్జర్ హత్య వివాదం

Jaishankar: కెనడాకు ఝలక్, అమెరికా, భారత్ మధ్య చర్చకు రాని నిజ్జర్ హత్య వివాదం

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్

ODI World Cup 2023 : నేటి నుంచి వరల్డ్ కప్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు- మరి భారత్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో తలపడుతుంది?

ODI World Cup 2023 : నేటి నుంచి వరల్డ్ కప్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు- మరి భారత్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో తలపడుతుంది?

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !