ODI WC 2023 Tickets: ఆరు గంటలు వెయిట్ చేస్తే నిమిషాల్లోనే ఖతం - హాట్ కేకుల్లా భారత్, పాక్ మ్యాచ్ టికెట్లు
భారత్ - పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లోనే అయిపోయాయి.
ODI WC 2023 Tickets: దాయాది దేశాల క్రికెట్ సమరం అంటే ఉండే క్రేజే వేరు. అదీ వరల్డ్ కప్ వంటి హై ఓల్టేజ్ టోర్నమెంట్‌లో అయితే అది నెక్స్ట్ లెవల్‌కు వెళ్తుంది. క్రికెట్ అంటే పడిచచ్చే భారత్, పాకిస్తాన్‌లలో అభిమానులు ఈ ఇరు జట్ల మధ్య ఐసీసీ టోర్నీలలో మ్యాచ్ కోసం ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారన్న విషయం మరోసారి రుజువైంది. ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో భారత్ - పాకిస్తాన్ మధ్య జరగాల్సి ఉన్న మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకానికి పెట్టిన నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.
మంగళవారం తొలి విడతగా భారత్ - పాక్ మ్యాచ్ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. ప్రముఖ యాప్ బుక్ మై షో (Book My Show) లో వీటి అమ్మక ప్రక్రియ జరిగింది. అయితే భారత అభిమానులు టికెట్ల కోసం ఆరు గంటల ముందు నుంచే వేయిట్ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు టికెట్ల అమ్మకం ప్రారంభమవుతుందని తెలపగా క్రికెట్ ఫ్యాన్స్ యాప్ ఓపెన్ చేయడంతో అది కొంతసేపు క్రాష్ అయింది. సాయంత్రం ఆరు గంటలకు ఓపెన్ అయిన టికెట్ల అమ్మకాలు కొన్ని నిమిషాల్లోనే అయిపోయాయి. బుక్ మై షో లో టికెట్ల అమ్మకం ప్రారంభమైన గంట లోపే ‘సోల్డ్ ఔట్’ అని కనిపించింది.
ఫ్యాన్స్ ఓపికకు పరీక్ష..
హై డిమాండ్‌తో యాప్ కొంతసేపు క్రష్ అయి తిరిగి సెట్ అయినా.. టికెట్ల కోసం వచ్చిన నెటిజన్ల ఓపికను అది పరీక్షించింది. ‘మీరు క్యూలో యాడ్ అయ్యారు. మీకు టికెట్ కన్ఫమ్ కావాలంటే కనీసం గంట కంటే ఎక్కువసేపు వెయిట్ చేయండి..’ అన్న సందేశం అభిమానులకు విసుగు తెప్పించింది. ఆ గంట సమయం కాస్తా మూడు, నాలుగు, ఐదు, ఆరు గంటలకు చేరింది. కొంతమందికి మాత్రం ‘మీ టైమ్ రాగానే స్క్రీన్ పై సీట్ల వరుస కనబడుతుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నందున మీరు త్వరగా బుక్ చేసుకోండి.. వేచి ఉంటున్నందుకు ధన్యవాదాలు’ అని చావు కబురు చల్లగా చెప్పారు. క్రికెట్ ఫ్యాన్స్ ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను ట్వీట్స్ చేస్తూ బుక్ మై షో సర్వీసులపై దుమ్మెత్తిపోస్తున్నారు. టికెట్లు బుక్ చేసుకోవడానికి బీసీసీఐ, ఐసీసీ ఇకనైనా మంచి టికెట్ బుకింగ్ యాప్‌లను ఎంపిక చేస్తే బెటర్ అని సూచిస్తున్నారు.
Come on @bookmyshow, you knew the demand, you knew there’ll be lot of people will be trying to book, pretty appalling load handling on your platform. Indian cricket fans deserve a better ticket booking experience. Asking to wait on the same screen for hours 🙏🏻🙏🏻 #ICCWorldCup2023 pic.twitter.com/jiryhcPiFa
— Debaditya Sarkar (@debasarkar22) August 29, 2023
Continuous 2 hours waiting in queue 😶 and still not able to book 2 tickets 🎫 #INDvPAK
— Keshav Kashyap🚀 (@Keshav_killer) August 29, 2023
Life is really tough 😔 #ICCWorldCup2023 pic.twitter.com/E70fZ9WmEM
మరోసారి టికెట్ల అమ్మకం..
నిన్న టికెట్లు బుక్ చేసుకోనివారు, టికెట్లు దొరకని ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సెప్టెంబర్ 3న మరో విడత విక్రయం ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అహ్మదాబాద్‌లో జరుగబోయే ఇండియా మ్యాచ్‌తో పాటు ఇతర మ్యాచ్‌లకు టికెట్ల తేదీని కూడా ఐసీసీ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
People who missed out on World Cup tickets today, there is another opportunity coming in the next 5 days for India games. pic.twitter.com/ARBz5e2klG
— Johns. (@CricCrazyJohns) August 29, 2023
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial