Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..
Todays Top 10 headlines:
తెలంగాణ పాటిస్తుంది- దేశం అనుసరిస్తుంది
సిరిసిల్లలో జరిగిన తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రగతిలో జిల్లా పాత్ర ప్రత్యేకమైనదని కితాబు ఇచ్చారు. తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మరో పది నెలల తర్వాత ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ ఫేజ్ మేనిఫెస్టో అంటూ ఆరు హామీల్ని ప్రకటించింది. ఆ తర్వాత వాటి గురించి ప్రజల్లో విస్తృత చర్చ జరపడానికి కింది స్థాయి యంత్రాంగానికి బాధ్యతలప్పగిచింది. ప్రెస్ మీట్లు...బహిరంగసభల్లో చెప్పుకోవడం వేరు... పార్టీ క్యాడర్ నేరుగా వెళ్లి ప్రజలకు చెప్పడం వేరనే పాయింట్ ను గుర్తించి ఆ దిశగా కార్యాచరణ చేస్తోంది. అయితే అనూహ్యంగా వైఎస్ఆర్‌సీపీ నుంచి ఈ మేనిఫెస్టోపై తీవ్రమైన స్పందన వస్తోంది. దీంతో మరింత ప్రచారం వస్తోంది. ప్రత్యర్థి నేతలు ఎలాగూ పొగడరు కానీ.. వారు ఆ మేనిఫెస్టోపై విమర్శలు చేయడం వల్ల ప్రజల్లోకి వెళ్లిపోతోంది. చివరికి సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా మేనిఫెస్టోను ప్రస్తావించారు. దీంతో వైసీపీనే .. ఎక్కువగా టీడీపీ మేనిఫెస్టోకు ప్రచారం కల్పిస్తోందా అన్న అభిప్రాయానికి ఇతర పార్టీల నేతలు వస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మారుగుతున్న జై తెలంగాణ నినాదం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నేటితో పదేళ్లు అవుతోంది. ఈ సందర్భంగానే అన్ని రాజకీయ పార్టీలు ఘనంగా వేడుకలు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అటు పార్టీ తరఫున, ఇటు ప్రభుత్వం తరఫున పండుగ చేస్తుంటే... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గోల్కొండ కోటలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా తెలంగాణను ఇచ్చింది తామేనంటూ ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు అనేక కార్యక్రమాలు చేస్తోంది. వామపక్షాలతో పాటు మిగతా పార్టీలు కూడా వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నాయి. మరికొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న క్రమంలో.. ప్రజలకు దగ్గరయ్యేందుకు రాజకీయ పార్టీలన్నీ దూకుడుగా ముందుకు వెళ్తుండడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వడ దడ
నిన్న పశ్చిమ విదర్భ నుండి ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి ఈ రోజు బలహీన పడిందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం (జూన్ 1) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు కింది స్థాయిలోని గాలులు వాయువ్య మరియు నైరుతి దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. రాగల 3 రోజులు రాష్ట్రంలో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ మరియు చుట్టూ ప్రక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుండి 42 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పేదలకు శుభవార్త
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2023 విద్యా సంవత్సరం ఇంటర్ చదువుతున్న 120 మంది పేద విద్యార్థులకు ‘విద్యాధన్’ స్కాలర్‌షిప్‌లు విద్యాధన్ పేరిట సరోజిని దామోదరన్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు అందజేస్తోంది. 90 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో కాస్త ఘాటు పెంచారు. ప్రస్తుతం ప్రొద్దుటూరులో యువగళం పాదయాత్ర జరుగుతుండగా, నేటి (జూన్ 1) యాత్రలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు లక్ష్యంగా గళం విప్పారు. ‘హూ కిల్డ్ బాబాయ్’ అని రాసి ఉండి, వివేకా, వైఎస్ అవినాష్, జగన్ ఫోటోలు ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఆయనతో పాటు తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆ ప్లకార్డులను చేతపట్టుకొని యాత్ర సాగించారు. ప్రజలకి ఆ ప్లకార్డులను చూపించి ‘బాబాయ్ ని లేపేసింది ఎవరు’ అంటూ అడుగుతూ లోకేష్ ముందుకు సాగారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నడిసంద్రంలో 32 కిలోల గోల్డ్ సీజ్
తమిళనాడులో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. గుర్తు తెలియని వ్యక్తులు రెండు పడవల్లో శ్రీలంక నుంచి భారత్ కు సముద్ర మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా.. పక్కా సమాచారంతో అధికారులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఓ పడవలోని స్మగ్లర్లు తమ వద్ద ఉన్న 11 కిలోల బంగారాన్ని సముద్రంలో పడేశారు. భారత కోస్ట్ గార్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ సిబ్బంది కలిసి రెండు రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించి ఆ పసిడిని స్వాధీనం చేసుకున్నారు. మరో పడవలో 21.2 కిలోల బంగారం గుర్తించి పట్టుకున్నారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం రూ.20 కోట్లకుపైగా విలువైన 32.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కొంతమంది స్మగ్లర్లు పెద్ద ఎత్తున బంగారాన్ని శ్రీలంక నుంచి భారత్ కు అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులకు సమాచారం వచ్చింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ధోని మోకాలికి శస్త్ర చికిత్స విజయవంతం
భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు టైటిల్స్ అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని మోకాలికి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసింది. మోకాలి గాయంతోనే ఐపీఎల్-16 లో పాల్గొన్న ధోని.. మూడు రోజుల క్రితం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ముగిసిన ఫైనల్ తర్వాత బుధవారం ముంబైకి చేరాడు. ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ఆస్పత్రిలో ధోనికి సర్జరీ జరిగింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఐరన్ లోపంతో మానసిక సమస్యలు వస్తాయా?
శరీరంలో ఐరన్ లోపం అంటే సరిపడిన మొత్తంలో ఐరన్ లేకపోవడాన్ని సూచిస్తుంది. ఐరన్ శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో చాలా ముఖ్యమైంది. ఐరన్ లోపం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని కొత్త పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి. ఐరన్ లోపం ఏర్పడితే డిప్రెషన్, యాంక్జైటీ, స్ర్కీజోఫినియా వంటి మానసిక సమస్యలు తీవ్రమవుతాయట. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
‘గుంటూరు కారం’ ఫలితం ఎలా ఉంటుందో?
సినీ ఇండస్ట్రీలో 'సెంటిమెంట్స్' ను బలంగా నమ్మేవారి శాతం ఎక్కువగా ఉంటుంది. మన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా అందుకు మినహాయింపు కాదు. సినిమా మొదలు పెట్టడం దగ్గర నుంచి, రిలీజ్ వరకూ అన్నీ సెంటిమెంట్స్ ప్రకారమే జరుగుతుంటాయి. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల టైటిల్స్ విషయంలోనూ గత కొంతకాలంగా ఓ సెంటిమెంట్ ఉంది. అదేంటంటే.. అతను ఏ హీరోతో మూవీ చేసినా, టైటిల్ మాత్రం 'అ' అనే అక్షరంతోనే మొదలవుతుంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.