అన్వేషించండి

Nara Lokesh: నారా లోకేశ్ పాదయాత్రలో వివేకా హత్యపై ప్లకార్డులు, ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ నినాదాలు

తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్లకార్డులను చేతపట్టుకొని యాత్ర సాగించారు. ప్రజలకి ఆ ప్లకార్డులను చూపించి ‘బాబాయ్ ని లేపేసింది ఎవరు’ అంటూ అడుగుతూ లోకేష్ ముందుకు సాగారు.

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో కాస్త ఘాటు పెంచారు. ప్రస్తుతం ప్రొద్దుటూరులో యువగళం పాదయాత్ర జరుగుతుండగా, నేటి (జూన్ 1) యాత్రలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు లక్ష్యంగా గళం విప్పారు. ‘హూ కిల్డ్ బాబాయ్’ అని రాసి ఉండి, వివేకా, వైఎస్ అవినాష్, జగన్ ఫోటోలు ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఆయనతో పాటు తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆ ప్లకార్డులను చేతపట్టుకొని యాత్ర సాగించారు. ప్రజలకి ఆ ప్లకార్డులను చూపించి ‘బాబాయ్ ని లేపేసింది ఎవరు’ అంటూ అడుగుతూ లోకేష్ ముందుకు సాగారు.

వివేకానంద రెడ్డిని మర్డర్ చేసింది అవినాష్, జగన్ అంటూ నినాదాలు చేశారు. దాంతో పార్టీ కార్యకర్తలు సహా స్థానిక జనం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో వారికి డీఎస్పీ నాగరాజు అడ్డు తగిలారు. ప్లకార్డులు ప్రదర్శించకూడదు అంటూ టీడీపీ కార్యకర్తలను డీఎస్పీ నాగరాజు వారించారు. తమకు అన్నీ అనుమతులు ఉన్నాయని, దానికి తగ్గట్లే తాము పాదయాత్ర చేస్తున్నామని లోకేశ్ పోలీసులకు తెగేసి చెప్పారు. తమను రెచ్చగొట్టేలా వైసిపి వాళ్లు ఫ్లెక్సీలు పెట్టినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అంటూ డీఎస్పీని లోకేశ్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ ఫ్లెక్సీల గురించి లోకేష్ ప్రస్తావించగానే, పోలీసులు వెనక్కి తగ్గారు. ముందు వెళ్లి వైఎస్ఆర్ సీపీ నేతల ఫ్లెక్సీలు తొలగించండి అని డిమాండ్ చేశారు. కాసేపటికి పోలీసులు అక్కడి నుండి వెనుదిరిగి వెళ్లిపోయారు.

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని నారా లోకేశ్ మండిపడ్డారు. స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టించడంతో మున్సిపాలిటీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధులు లేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పట్టణాల్లో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించి, చెత్త పన్నులాంటి అడ్డగోలు పన్నుల విధానాన్ని రివ్యూ చేస్తామని తెలిపారు. అభయ హస్తం పథకంలోని డ్వాక్రా మహిళల సొమ్ము రూ.2,200 కోట్లను వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం దొంగిలించిందని విమర్శించారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని అన్నారు. డీలర్ల ద్వారా రేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని లోకేశ్‌ మాట్లాడారు.

నారా లోకేష్ యువగళం పాదయాత్రం 113వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం 1446 కిలో మీటర్ల దూరం నడిచారు. నేడు 10.3 కిలో మీటర్ల దూరం నడవనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా)లో పర్యటిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Embed widget