Telangana Formation Day: దిక్కులు పిక్కటిల్లేలా జై తెలంగాణ నినాదం- రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
Telangana Formation Day: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అన్ని రాజకీయ పార్టీలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. బీఆర్ఎస్ 22 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంటే, బీజేపీ గోల్కొండ కోటలో నిర్వహిస్తోంది.
Telangana Formation Day: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నేటితో పదేళ్లు అవుతోంది. ఈ సందర్భంగానే అన్ని రాజకీయ పార్టీలు ఘనంగా వేడుకలు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అటు పార్టీ తరఫున, ఇటు ప్రభుత్వం తరఫున పండుగ చేస్తుంటే... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గోల్కొండ కోటలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా తెలంగాణను ఇచ్చింది తామేనంటూ ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు అనేక కార్యక్రమాలు చేస్తోంది. వామపక్షాలతో పాటు మిగతా పార్టీలు కూడా వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నాయి. మరికొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న క్రమంలో.. ప్రజలకు దగ్గరయ్యేందుకు రాజకీయ పార్టీలన్నీ దూకుడుగా ముందుకు వెళ్తుండడం చర్చనీయాంశంగా మారింది.
నూతన సచివాలయంలో బీఆర్ఎస్ వేడుకలు
నూతన సచివాలయం వేదికగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ అవతరణ వేడుకలను నిర్వహిస్తోంది. శుక్రవారం సీఎం కేసీఆర్ సచివాలయంలో జాతీయ జెండాను ఎగుర వేసి.. గత తొమ్మిదేళ్ల ప్రగతి వివరించనున్నారు. అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ముఖ్య ప్రజాప్రతినిధులు జాతీయ పతకాలు ఆవిష్కరిస్తారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
— BRS Party (@BRSparty) June 2, 2023
జూన్ 2 నుంచి 22 దాకా..
హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు ఈ వేడుకలను ప్రారంభిస్తారు. సచివాలయ ప్రాంగణంలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించి జాతికి సందేశం ఇస్తారు.#TelanganaFormationDay… pic.twitter.com/pMSx3XvdCM
గోల్కొండ కోటలో బీజేపీ వేడుకలు
కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను గోల్కొండ కోటలో అధికారికంగా నిర్వహిస్తోంది. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో గోల్కొండ కోటపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. గతేడాది ఢిల్లీలో ఈ వేడుకలను నిర్వహించిన కేంద్రం తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తోంది. ఎంతో మంది అమరవీరుల బలిదానాలు, మరెందరో పోరాటాల ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. ఈ పోరాటాలు, త్యాగాలను అంతా కలిసి స్మరించుకుందాం, వేడుకలు చేస్తామని కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించడం గమనార్హం.
Live: Telangana Formation Day, Flag Hoisting, Golconda Fort, Hyderabad https://t.co/J18pd3NtwG
— G Kishan Reddy (@kishanreddybjp) June 2, 2023
ఘనమైన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేస్తూ ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
— G Kishan Reddy (@kishanreddybjp) June 1, 2023
మీరూ పాల్గొనండి! చరిత్రను తెలియజేసే ఎగ్జిబిషన్ తో పాటు మైమరిపించే సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలను ఆస్వాదించండి!!
📍 గోల్కొండ కోట, హైదరాబాద్
📅 2 జూన్, 2023 pic.twitter.com/UZdGbVi9kx
గాంధీభవన్ లో కాంగ్రెస్ వేడుకలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో నిర్వహిస్తోంది. అయితే బిల్లు పాస్ అయిన సమయంలో లోక్ సభ స్పీకర్ గా ఉన్న మీరాకుమార్ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొనడానికి వస్తున్నారు. కేవలం గాంధీ భవన్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించేందుకు టీపీసీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా ప్రజల్లోకి వెళ్లేలా పలు కార్యక్రమాలను రూపొందించింది.
రాష్ట్ర ప్రజలకు మరియు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలంగాణ వాసులకు
— Telangana Congress (@INCTelangana) June 2, 2023
"తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ"
శుభాకాంక్షలు.
జై తెలంగాణ..! జై జై తెలంగాణ..!!#TelanganaFormationDay pic.twitter.com/OASxpZIQAb
రాజ్ భవన్ లోనూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాష్ట్ర ప్రథమ పౌరురాలి హోదాలో రాజ్ భవన్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి అవతరణ వేడుకలను నిర్వహించబోతున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహణలో ప్రజలతో.. వారి సమస్యల గురించి చర్చించనున్నారు. రాజ్ భవన్ వేడుకల్లో గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉండనుందో చూడాలి మరి.