అన్వేషించండి

Morning Top News: పెన్షన్ దారులకు ఏపీప్రభుత్వ గుడ్ న్యూస్, బీఆర్ఎస్‌కు విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ వంటి టాప్ న్యూస్

Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.

Morning Top News:

 బీజేపీపై బీఆర్ఎస్ విమర్శలు, విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ 

అదానీ అంశాన్ని బీఆర్ఎస్ బీజేపీతో ముడిపెట్టడంపై బీజేపీ మండిపడుతోంది. ఆరోపణలు చేసే ముందు గత చరిత్ర గుర్తు చేసుకోవాలని సలహా ఇచ్చింది. ఈ అంశంపై కవిత ట్వీట్‌కు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా రిప్లై ఇచ్చారు. లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన కవితకు న్యాయం, నైతికపై మాట్లాడుతున్నారని విమర్శించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

పెన్షన్‌దారులకు ఏపీ ప్రభుత్వం  గుడ్ న్యూస్ చెప్పింది. పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు  విడుదల చేసింది. వరుసగా 2 నెలలు పింఛన్ తీసుకోకున్నా మూడో నెలలో ముందు నెలల పింఛన్‌తో కలిపి మొత్తం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల నుంచే ఈ గైడ్ లైన్స్ అమల్లోకి వస్తాయి.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

ఏపీకి కొనసాగుతున్న భారీ పెట్టుబడులు 
 ఏపీలో మరో సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు పెట్టేందుకు ఎన్టీపీసీ సిద్ధమైంది. ఈ మేరకు రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కూటమి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.20,620 కోట్ల ఆదాయం రానుంది. దాదాపు 1.06 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు NGEL - NREDCAP మధ్య సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, గొట్టిపాటి రవి సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
పోసాని సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ మాజీ ఫిల్మ్  డెలవప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ నేత.. దూకుడుగా మాట్లాడే లీడర్, సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన ఇక తన పూర్తి సమయం కుటుంబానికి కేటాయిస్తానని బతికున్నంత కాలం రాజకీయాల  గురించి మాట్లాడబోనన్నారు.  ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని  వైసీపీనే కాదు ఇప్పటి వరకు ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదన్నారు. ఏ పార్టీని పొగడను.. మాట్లాడను.. విమర్శించను.. నన్ను ఎవరూ ఏమనలేదని తెలిపారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను అధికారులు విడుదల చేశారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఉంచారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి ఫిబ్రవరి కోటాను సైతం విడుదల చేశారు.  రాజకీయ నేతల సిఫారసు లేఖలు అవసరం లేకుండానే శ్రీవారి పథకం ద్వారా వీఐపీ దర్శన టిక్కెట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఎయిర్ పోర్టునూ ఈ ఫెసిలిటీ ఉంది.   పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 
బంగాళఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు
అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుండగా.. దీని ప్రభావంతో ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందన్న అంచనాలు ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరో 2 రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా ఈ నెల 24 నుంచి అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు, కేరళలో విస్తారంగా.. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అ..క్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
బంగారం తీసుకుందంటూ కూతురు ఇంటి ముందు తల్లి ధర్నా
తమ కూతురు బంగారం తీసుకుని తమను మోసగించిందంటూ తల్లిదండ్రులు ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో  జరిగింది. మల్కాజిగిరి వాణీనగర్‌లో శివమ్మ, మల్లయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. కుమార్తె బాలామణి సైతం వారి ఇంటికి సమీపంలోనే ఉంటోంది. రెండేళ్ల క్రితం ఊరెళ్తూ తాము తమ బిడ్డ వద్ద 30 తులాల బంగారం దాచి పెట్టామని దంపతులు తెలిపారురు. తర్వాత తిరిగి ఇమ్మని అడిగితే తనకు ఇవ్వలేదని అబద్ధం చెబుతోందని.. ఇచ్చినట్లు ఆధారాలు చూపాలని అడుగుతోందని వాపోయారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
అగ్రరాజ్య ఆరోపణలన్నీ అవాస్తవమన్న ఆదానీ గ్రూప్
  అమెరికా కోర్టులో నమోదైన కేసుపై అదానీ గ్రూపు స్పందించింది. యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ ఆరోపణలన్నీ నిరాధారం వాటిని తిరస్కరిస్తున్నామని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రూపు తరపున అధికారిక ప్రకటన విడుదల చేశారు. "నిరూపణ అయ్యే వరకూ నేరారోపణలు చేసిన వ్యక్తి నేరస్తుడు కాదని, స్వచ్చమైన వ్యక్తేనని" అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ చెబుతున్న విషయాన్ని అదానీ గ్రూప్ గుర్తు చేసింది. ఈ విషయంలో న్యాయపరంగా చేపట్టాల్సిన చర్యలను తీసుకుంటామని అదానీ గ్రూపు తెలిపింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
 
తెలుగు సినిమాలో హీరోయిన్ గా క్రికెటర్ భార్య
యూట్యూబర్, ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నెటిజన్లకు బాగా పరిచయమైన డాన్సర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ త్వరలో తెలుగు వెండితెరకు పరిచయం కానున్నారు. భారత క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ భార్యగా మరింత క్రేజ్ ను సంపాదించుకున్న ఆవిడ... త్వరలో ‘దిల్’ రాజు బ్యానర్ నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారని తెలిసింది. కొరియోగ్రాఫర్ యశ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. ‘సబా నాయగన్’, ‘సీ.ఐ.ఏ‘ ఫేమ్ మలయాళ నటి కార్తీక మురశీధరన్ లీడ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంతోనే ధనశ్రీ వర్మను మరో హీరోయిన్ పాత్రకు చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 

ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్‌

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ 2024 తొలి పోరు ఆరంభమైంది. భారత్‌, ఆతిథ్య ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మొదలైంది. రోహిత్ శర్మ గైర్హాజరుతో ఈ టెస్టుకు జస్పిత్ బుమ్రా నాయకత్వం వహిస్తున్నాడు. ఆస్ట్రేలియాపై టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేశాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget