అన్వేషించండి

Top 10 Headlines Today: కేసీఆర్‌ రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నట్టు? ఏపీలోకి బండి ఎంట్రీ?

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today:

రెండు చోట్ల పోటీ దేనికి?

కేసీఆర్  ఏం చేసినా ఓ లెక్కుంటుంది. ఆయనకు లక్కు కూడా ఉంటుంది అంటుంటారు అందరూ.. ఆయనకు లెక్కే కాదు.. లెక్కలేని తనం కూడా ఎక్కువే అంటారు కొందరు. ఎవరేమనుకున్నా.. కేసీఆర్ మాత్రం ఆయన అనుకున్నదే చేస్తారు. మరిప్పుడేం చేశారంటే..  ఎన్నికలకు మూడునెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు. అంతే కాదు అందరికీ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే.. ఈసారి ఆయన రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

టీడీపీలోకి యార్లగడ్డ

విజయవాడ శివారు గన్నవరానికి చెందిన వైఎస్ఆర్ సీపీ నేత, కృష్ణా డిస్ట్రిక్ కో ఆపరేటివ్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. యువగళం పాదయాత్రలో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెంకట్రావుకు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

తేలికపాటి వర్షాలు

ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య /పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం (ఆగస్టు 21) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు కొన్ని చోట్ల  రేపు, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తూర్పు, ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

115 నియోజకవర్గాల్లో కేసీఆరే అభ్యర్థా!

భారత రాష్ట్ర సమితి తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాలో మెరుపులేం లేవు. కానీ మరకలు పడిన నేతలందరికీ జాబితాలో చోటు దొరికింది.  ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఐ ప్యాక్ టీం సర్వేలు చేసినప్పుడు పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పుకున్నారు.  యాభై మందిని మారుస్తారని లీకులు వచ్చాయి.  చివరికి ఏడుగురి విషయంలోనే నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ ఏడుగురు కూడా తిరగబడేవారు కాదు.. కనీసం బలమైన వాళ్లు కాదు. వారిని మార్చినా మార్చపోయినా పోయేదేం లేదు. మరి కేసీఆర్ తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు కఠిన  నిర్ణయాలు తీసుకోలేకపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఏపీలో బండి 

అవినీతి, అప్పులు, అరాచకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

హాయ్‌ బడ్డీ

యావత్ ప్రపంచం ఆగస్టు 23 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రుడి రహస్యాలను ఛేదించేందుకు ప్రయోగించిన 'చంద్రయాన్‌-3' ప్రయోగం ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. చంద్రుడిపై అడుగుపెట్టే ఘడియలు దగ్గరపడుతున్నా కొద్దీ మరింత ఆసక్తి పెరగుతోంది. చంద్రుడిపై నమూనాలను సేకరించేందుకు ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ కావాలని అంతా కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా రష్యా ప్రయోగించిన 'లూనా-25' ప్రయోగం విఫలం కావడంతో చంద్రయాన్‌-3పై అందరి దృష్టిపడింది. ల్యాండింగ్‌ కనుక విజయవంతమైతే అంతరిక్ష చరిత్రలో భారత్‌ సరికొత్త రికార్డు నిలిపిన దేశంగా మారనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

అతిగా ఆలోచించొద్దు- గంగూలీ

టీమ్‌ఇండియాలో నాలుగో పొజిషన్‌పై అతిగా ఆలోచించొద్దని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) అంటున్నాడు. ఆ స్థానంలో ఆడేందుకు విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్ అయ్యర్‌ ఉన్నారని పేర్కొన్నాడు. ఎవరు ఏ పొజిషన్లో బ్యాటింగ్‌ చేయాలన్న దానిపై ఎలాంటి నిబంధనలు లేవన్నాడు. జట్టు అవసరాలను బట్టి ఆటగాళ్లు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలని సూచించాడు. భారత్‌లో ఎక్కువ మంది ప్రతిభావంతులు ఉన్నారని, అదే పెద్ద సమస్యని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

సిట్రోయెన్ టాప్ స్పెక్ ట్రిమ్‌ 

ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ దాని eC3 మోడల్‌తో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. కంపెనీ భారతీయ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక ఈవీ ఇదే. ఈ కారు కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే కంపెనీ దీంతో సంతృప్తి చెందలేదు. సిట్రోయెన్ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారులో కొత్త టాప్ స్పెక్ ట్రిమ్‌ను ఇండోనేషియాలో విడుదల చేసింది. దీనికి "షైన్" అని పేరు పెట్టారు. ఇందులో మరింత అద్భుతమైన డ్రైవింగ్ అనుభవం లభించనుంది పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

చిరంజీవిని మెగాస్టార్‌ చేసిన సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి గత నాలుగు దశాబ్దాలుగా సినీ ప్రియులను అలరిస్తున్నారు. ఇప్పటి వరకూ అన్ని భాషల్లో కలిపి 155 సినిమాల్లో నటించిన చిరు.. ఈ క్రమంలో ఎన్నో హిట్లు ఫ్లాప్స్ అందుకున్నారు. అయితే ఆయన కెరీర్ లో రిజల్ట్ తో సంబంధం లేకుండా, ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. వీటిలో చిరంజీవి చేసిన పాత్రలు కూడా ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అలాంటి పాత్రలు చిరంజీవి మాత్రమే చేయగలరని, మరే హీరోను ఊహించుకోలేమని.. ఇప్పటికీ ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. నేడు 'బిగ్ బాస్' బర్త్ డే సందర్భంగా ఆయన సినీ ప్రయాణంలో ప్రత్యేకంగా నిలిచిపోయిన చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

60ల్లో హిట్‌లు

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ సూపర్ సీనియర్ హీరోలందరూ ప్రస్తుతం ఫుల్ బిజీగా వున్నారు. ఆరు పదులు దాటిన వయసులోనూ రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు.. బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. కొందరు బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతుంటే, మరికొందరు సరికొత్త ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. గత రెండేళ్లలో సక్సెస్ ట్రాక్ లో పయనిస్తున్న షష్టిపూర్తి 60+ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Embed widget