అన్వేషించండి

Chandrayaan-3: చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌తో చంద్రయాన్-3 ల్యాండర్‌ అనుసంధానం -'Welcome Buddy' అంటూ సందేశం

ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్.. చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి.

యావత్ ప్రపంచం ఆగస్టు 23 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రుడి రహస్యాలను ఛేదించేందుకు ప్రయోగించిన 'చంద్రయాన్‌-3' ప్రయోగం ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. చంద్రుడిపై అడుగుపెట్టే ఘడియలు దగ్గరపడుతున్నా కొద్దీ మరింత ఆసక్తి పెరగుతోంది. చంద్రుడిపై నమూనాలను సేకరించేందుకు ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ కావాలని అంతా కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా రష్యా ప్రయోగించిన 'లూనా-25' ప్రయోగం విఫలం కావడంతో చంద్రయాన్‌-3పై అందరి దృష్టిపడింది. ల్యాండింగ్‌ కనుక విజయవంతమైతే అంతరిక్ష చరిత్రలో భారత్‌ సరికొత్త రికార్డు నిలిపిన దేశంగా మారనుంది.

ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్.. చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఇప్పటికే విడిపోయిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం.. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో ఇస్రో సోమవారం (ఆగస్టు 21) కీలక ప్రకటన చేసింది. 2019 జూలై 22న ఇస్రో చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్బిటర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తోన్నంది. ఈ ఆర్బిటర్‌తో చంద్రయాన్-3కి చెందిన ల్యాండర్ మాడ్యుల్‌ను విజయవంతంగా అనుసంధానించినట్లు ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్‌కు చంద్రయాన్ 2 ఆర్బిటర్ స్వాగతం పలికిందన్నది ఆ ట్వీట్ సారాంశం.

స్వాగతం.. మిత్రమా! చంద్రయాన్-2 ఆర్బిటర్.. చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యుల్‌ను స్వాగతిస్తోంది. ప్రస్తుతం ఈ రెండింటి మధ్య పరస్పర సమాచార మార్పిడి జరుగుతోంది. డేటాను ఎక్స్ఛేంజ్ చేసుకుంటున్నాయి. ల్యాండర్ మాడ్యుల్‌ను చేరుకునేందుకు బెంగళూరులోని ఇస్ట్రాక్ కేంద్రానికి ఇప్పుడు మరిన్ని దారులు ఉన్నాయి.. అని ఇస్రో ట్వీట్ చేసింది.

ALSO READ:

Russia Luna 25 Crash Live : రష్యన్ లూనా 25 కూలిపోయింది - ఇస్రో శాస్త్రవేత్తల్లో పెరిగిన టెన్షన్!
ఆగమేఘాల మీద రష్యా లూనా ప్రయోగించింది. దాంతో రష్యా ప్రయోగించిన లూనా 25 చంద్రుడిపై కూలిపోయింది. దాంతో ప్రపంచం దృష్టి చంద్రయాన్ 3 పై మళ్లింది. ఆచితూచి చంద్రుడి కక్ష్యను చేరుకున్న చంద్రయాన్ 3. సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలమనే ధీమాతో ఇస్రో సైంటిస్టులు ఉన్నారు. రష్యా చంద్రుడిపైకి పంపించిన లూనా 25 చంద్రుడిపైన కుప్పకూలి పోవటంతో మన ఇస్రో శాస్త్రవేత్తల్లోనూ టెన్షన్ మొదలైంది. వాస్తవానికి చంద్రయాన్ 3 ని కేవలం 600 కోట్ల రూపాయల బడ్జెట్ లో తయారు చేసి పంపించిది ఇస్రో. అది కూడా స్లింగ్ షాట్ పద్ధతిలో భూమి చుట్టూ గురుత్వాకర్షణ నుంచి బయటపడి.. చంద్రుడిని చేరుకుని అక్కడా ఇలానే కక్ష్యను తగ్గించుకుంటూ చంద్రుడి దక్షిణ ధృవంపై దిగేందుకు ప్లాన్ చేసింది. రష్యా అలా చేయలేదు. 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆగస్టు 11న రాకెట్ ను ప్రయోగించింది. ఆగస్టు 21న అంటే కేవలం పదంటే పదిరోజుల్లో చంద్రుడి సౌత్ పోల్ మీద ల్యాండర్ ను సేఫ్ గా జాబిల్లిపై దించాలని భావించింది. కానీ బ్యాడ్ లక్. అతి తక్కువ సమయంలో ప్రయోగం సక్సెస్ చేయాలనుకోవడమో, లేక భారత్ కంటే ముందుగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి తొలి దేశంగా అరుదైన ఘనత సాధించాలనుకోవడం రష్యా శాస్త్రవేత్తలు చేసిన తప్పిదంగా కనిపిస్తోంది. లూనా 25 సాంకేతిక సమస్యలతో చంద్రుడిపై ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టి క్రాష్ అయిపోయింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
ABP Desam Top 10, 25 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 25 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి  

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి  
Embed widget