అన్వేషించండి

60+ Heroes: బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్న షష్టిపూర్తి హీరోలు!

60 ఏళ్ళు దాటిన ఓల్డ్ హీరోలంతా వరుస సినిమాలతో యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకుంటున్నారు.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ సూపర్ సీనియర్ హీరోలందరూ ప్రస్తుతం ఫుల్ బిజీగా వున్నారు. ఆరు పదులు దాటిన వయసులోనూ రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు.. బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. కొందరు బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతుంటే, మరికొందరు సరికొత్త ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. గత రెండేళ్లలో సక్సెస్ ట్రాక్ లో పయనిస్తున్న షష్టిపూర్తి 60+ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం.

రజినీకాంత్ (72):
సూపర్ స్టార్ రజినీ కాంత్ 72 ఏళ్ల వయస్సులో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత 'జైలర్' సినిమాతో సాలిడ్ హిట్ కొట్టారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లోనే 550 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్ సీస్ లోనే 20 మిలియన్ డాలర్లు సాధించి, రజినీ స్టార్ పవర్ ఏంటో మరోసారి చూపించింది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే 69 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్ళు ఖాయంగా కనిపిస్తోంది. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ సినిమాలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు.

సన్నీ డియోల్ (65):
సీనియర్ నటుడు సన్నీ డియోల్ 65 ఏళ్ల వయసులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. 'గదర్ 2' సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఈ మూవీ ₹ 375.10 కోట్ల వసూళ్లతో నార్త్ లో దూసుకుపోతోంది. ఇది 2001లో వచ్చిన 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది. ఇందులో సన్నీతో పాటుగా అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అనిల్ శర్మ ఈ యాక్షన్ డ్రామాకి దర్శకత్వం వహించారు.

చిరంజీవి (68): 
రేపటితో 68 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య' సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేశారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, ప్రపంచ వ్యాప్తంగా ₹225.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. 46 కోట్ల లాభాలతో 2023లో మోస్ట్ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ గా నిలిచింది. కొల్లు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ మరో కథానాయకుడిగా నటించారు. అయితే చిరు ఇటీవల 'భోళా శంకర్' సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నారు. అయినప్పటికీ తన నెక్స్ట్ మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. బర్త్ డే సందర్భంగా Mega157 కాన్సెప్ట్ పోస్టర్ రాబోతోంది.

బాలకృష్ణ (63): 
నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో మునుపెన్నడూ లేనంత ఫార్మ్ లో వున్నారు. 'అఖండ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీర సింహా రెడ్డి' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడితో కలసి 'భగవంత్ కేసరి' మూవీతో హ్యాట్రిక్ హిట్ హిట్టు కొట్టడానికి రెడీ అవుతున్నారు. అలానే బాబీ డైరెక్షన్ లో తన తదుపరి సినిమాని ప్రారంభించారు.

కమల్ హసన్ (68):
విశ్వనటుడు కమల్ హాసన్ గతేడాది 'విక్రమ్' సినిమాతో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ సేతుపతి, ఫహాద్ పాజిల్ కీలక పాత్రలు పోషించారు. త్వరలో 'ఇండియన్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'కల్కి 2898AD' మూవీలో స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. ఆలోపు తమిళ 'బిగ్ బాస్' రియాలిటీ షోతో పలకరించబోతున్నారు. 

అమితాబ్ బచ్చన్ (80): 
బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 80 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. గతేడాది 'ఉంచై' వంటి అడ్వెంచర్ డ్రామాతో మంచి విజయాన్ని సాధించారు. ప్రస్తుతం 'కల్కి 2898AD' సినిమాతో పాటుగా 'గణపత్', 'బటర్ ఫ్లై' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.

నాగార్జున (63): 
60+ లోనూ మన్మథుడిగా పిలవబడుతున్న కింగ్ అక్కినేని నాగార్జున.. గతేడాది తనయుడు నాగచైతన్యతో కలిసి 'బంగార్రాజు' సినిమాతో హిట్టు కొట్టాడు. 'బ్రహ్మాస్త్రం: పార్ట్ 1' వంటి బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీలో భాగం అయ్యారు. అయితే సోలోగా చేసిన 'ది ఘోస్ట్' సినిమా ఘోర పరాజయం చవిచూసింది. దీంతో ఇప్పుడు కింగ్ తన నెక్స్ట్ మూవీతో కమ్ బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆగస్టు 29 బర్త్ డే స్పెషల్ గా Nag99 అనౌన్స్ మెంట్ తో పాటుగా టైటిల్ టీజర్ ను రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు. మరోవైపు 'బిగ్ బాస్' కొత్త సీజన్ ను హోస్ట్ చేయడానికి సిద్దమవుతున్నారు.

వెంకటేశ్ (62):
విక్టరీ వెంకటేష్ లాస్ట్ ఇయర్ మల్టీస్టారర్ మూవీ 'ఎఫ్ 3' తో సక్సెస్ సాధించారు. ఈ ఏడాది రానా నాయుడు' వెబ్ సిరీస్ తో ఓటీటీలో అడుగుపెట్టి, విమర్శలతో పాటుగా ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు శైలేష్ కొలను దర్శకత్వంలో 'సైందవ్' సినిమాతో సోలోగా హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు.

మమ్ముట్టి (71):
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గతేడాది 'భీష్మ పర్వం' సినిమాతో ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఇదే క్రమంలో వచ్చిన 'పుజు' 'రోర్స్చాచ్' చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. ప్రస్తుతం 'కడుగన్నవా ఒరు యాత్ర' 'కథల్ ది కోర్' 'కన్నూర్ స్క్వాడ్' సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవలే 'బజుకా' అనే పాన్ ఇండియా చిత్రాన్ని ప్రారంభించారు.

శివ రాజ్ కుమార్ (61):
కన్నడ హీరో శివ రాజ్ కుమార్ కూడా వరుస విజయాలు అందుకుంటున్నారు. భజరంగి 2, బైరాగీ, వేద చిత్రాలు కమర్షియల్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు 'జైలర్' వంటి బ్లాక్ బస్టర్ మూవీలో చిన్న పాత్రలో మెరిశారు. దసరాకి 'ఘోస్ట్' చిత్రంతో పలకరించడానికి రెడీ అయ్యారు.

మోహన్ లాల్ (62):
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఇటీవల కాలంలో ఓటీటీలో సక్సెస్ అయ్యారు కానీ, థియేట్రికల్ గా హిట్టు కొట్టకలేకపోయారు. ప్రస్తుతం ఆరు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. 'మలైకోట్టై వాలిబన్' 'బరోజ్' 'నేరు' 'రామ్: పార్ట్ 1' 'వృశుభ' 'ఎంపురాన్' వంటి సినిమాలు సెట్స్ మీదున్నాయి. త్వరలో 'లూసిఫర్ 2' కూడా ప్రారంభం కానుంది.ఇలా 60+ సూపర్ సీనియర్ హీరోలు యేడాది పొడవునా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. యంగ్ హీరోలలో పోటీగా బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతూ 'లెజెండ్స్ ఫర్ ఎవర్' అని నిరూపిస్తున్నారు. 

Also Read: చిన్న సినిమాలకు శాపంగా మారుతున్న రీ రిలీజులు?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Aishwarya Pisse Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
Illu Illalu Pillalu Serial Today October 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భర్త, అత్తమామల మీద గృహహింస కేసు పెట్టిన వల్లీ! పెళ్లి రోజు వేడుకలో షాక్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భర్త, అత్తమామల మీద గృహహింస కేసు పెట్టిన వల్లీ! పెళ్లి రోజు వేడుకలో షాక్!
Meghasandesam Serial Today October 13th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని ఆవహించిన గగన్‌ ఆత్మ – ఆకాష్‌ అసలు రూంప కనిపెట్టిన అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని ఆవహించిన గగన్‌ ఆత్మ – ఆకాష్‌ అసలు రూంప కనిపెట్టిన అపూర్వ
The Dirty Picture 2: విద్యా బాలన్ కాదు... తమన్నా - 'ది డర్టీ పిక్చర్ సీక్వెల్‌లో మిల్కీ బ్యూటీ?
విద్యా బాలన్ కాదు... తమన్నా - 'ది డర్టీ పిక్చర్ సీక్వెల్‌లో మిల్కీ బ్యూటీ?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget