Citroën eC3 Shine: ఈసీ3 ఎలక్ట్రిక్‌లో కొత్త వేరియంట్ లాంచ్ చేసిన సిట్రోయెన్ - ఎక్కడ లాంచ్ అయింది? ధర ఎంత?
ప్రముఖ కార్ల బ్రాండ్ సిట్రోయెన్ తన ఈసీ3లో కొత్త వేరియంట్‌ను ఇండోనేషియాలో లాంచ్ చేసింది.
Citroën eC3 Shine: ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ దాని eC3 మోడల్‌తో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. కంపెనీ భారతీయ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక ఈవీ ఇదే. ఈ కారు కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే కంపెనీ దీంతో సంతృప్తి చెందలేదు. సిట్రోయెన్ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారులో కొత్త టాప్ స్పెక్ ట్రిమ్‌ను ఇండోనేషియాలో విడుదల చేసింది. దీనికి "షైన్" అని పేరు పెట్టారు. ఇందులో మరింత అద్భుతమైన డ్రైవింగ్ అనుభవం లభించనుంది.
భారతదేశంలో ఈసీ3 పేరుతో...
ఇది ఇప్పటికే ఈసీ3 పేరుతో మనదేశంలో అందుబాటులో ఉంది. దీంట్లో 10.2 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో అందుబాటులో ఉంది. అయితే కొత్త షైన్ ట్రిమ్ కొన్ని తదుపరి స్థాయి అంశాలను పొందుతుంది. షైన్ ట్రిమ్ ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ మరియు మాన్యువల్‌గా డిమ్మబుల్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్. ఈ ఓఆర్వీఎంలు ఆటోమేటిక్‌గా ఫోల్డ్ అవ్వవు కానీ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు కంఫర్ట్‌ను జోడిస్తాయి. దీంతో పాటు వెనుక డీఫాగర్, వాషర్, వైపర్ కూడా అందుబాటులో ఉన్నాయి.
షైన్ వేరియంట్ ధర ఎంత?
సిట్రోయెన్ ఈసీ3 షైన్ వేరియంట్ 15 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై 195 సెగ్మెంట్ టైర్స్‌ను కలిగి ఉంది. ఇది దాని పనితీరును, ఆకర్షణను పెంచుతుంది. సిట్రోయెన్ ఈసీ3 షైన్ ట్రిమ్ ఇండోనేషియాలో 395 మిలియన్ల ఇండోనేషియా రూపాయల (మనదేశ కరెన్సీలో సుమారు రూ. 21.4 లక్షలు) ధరతో లాంచ్ అయింది. ఆసక్తికరంగా ఈ కారు భారతదేశంలో తయారు అవుతుంది. ఇక్కడి నుంచి ఇండోనేషియాకు ఎక్స్‌పోర్ట్ చేస్తారు.
ఇంజిన్ ఎలా ఉంది?
సిట్రోయెన్ ఈC3 షైన్ ట్రిమ్ పవర్‌ట్రెయిన్ భారతీయ వేరియంట్ మాదిరిగానే ఉంది. ఇందులో కంపెనీ 29.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. అలాగే ఇది 320 కిలో మీటర్ల రేంజ్‌ను అందించనుందని సిట్రోయెన్ ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ కారులో ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌ను కంపెనీ అందించింది. కారు ముందు చక్రానికి గరిష్టంగా 57 బీహెచ్‌పీ పవర్, 143 ఎన్ఎం పీక్ టార్క్ ఇస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ స్పీడ్ గంటకు 107 కిలో మీటర్లుగా ఉంది. ఇది కాకుండా ఛార్జింగ్ చేయడానికి మరో రెండు ఛార్జింగ్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మొదటి 15ఏ ఛార్జింగ్ సాకెట్. దీని ద్వారా ఈ కారును పూర్తిగా ఛార్జ్ చేయడానికి 10 గంటల 30 నిమిషాలు పడుతుంది. రెండోది డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్. దీని ద్వారా ఈ కారు కేవలం 57 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ అవ్వగలదు.
ఇంటీరీయర్ ఫీచర్లు
ఈ కారులో అందించిన ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో మాన్యువల్ ఏసీ ఉండనుంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, కీలెస్ ఎంట్రీ, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, పవర్ విండోస్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ద్వారా కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 10 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందించారు.
పోటీ వీటితోనే?
భారతదేశంలో ఈ ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీ పోటీపడుతుంది. ఇది 19 కేడబ్ల్యూహెచ్, 24 కేడబ్ల్యూహెచ్ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను కలిగి ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.69 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial