Top 10 Headlines Today: హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందడి - నేటి టాప్ 10 న్యూస్
తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..
ఎన్టీఆర్ అంటే శక్తి, ఆయనకు భారతరత్న ఇవ్వాలి - చంద్రబాబు డిమాండ్
ఎన్టీఆర్ అంటే ఓ వ్యక్తి కాదు, ఓ శక్తి, తెలుగు జాతి స్ఫూర్తి. తెలుగు జాతి ఉన్నంత వరకు వారి గుండెల్లో శాశ్వతంగా ఉంటారు’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ పై అభిమానంతో హైదరాబాద్ లో ఇంత మంది రావడం ఓ చరిత్ర అన్నారు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చంద్రబాబు పాల్గొన్నారు. తెలుగుజాతి పరిస్థితి ఎన్టీఆర్ కు ముందు, ఎన్టీఆర్ తరువాత అని చెప్పుకోవాలన్నారు. ఇంకా చదవండి
ఏ నేతకు సాధ్యంకాని పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు, ఆయన మహనీయుడు - బాలకృష్ణ
తన తండ్రి ఎన్టీఆర్ కారణజన్ముడు, తనకు గురువు, దైవం అన్నారు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. హైదరాబాద్ కూకట్ పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందర్నీ మహానుభావులు అనరు. అలా అనిపించుకోవాలంటే మహోన్నత భావాలు ఉండాలి, మహోన్నత ఆచరణ చేసిన వాళ్లే మహానుభావులు అవుతారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని నిల్చున్న వ్యక్తి ఎన్టీఆర్. ఏ నేతకు సాధ్యంకాని పథకాలను ఆయన ప్రవేశపెట్టారు. ఎన్నో గొప్ప పాత్రలు ఆయన పోషించారని గుర్తుచేశారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా జీవించారని తన తండ్రి ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఇంకా చదవండి
అవినాష్ రెడ్డి సీబీఐని రెచ్చగొడుతున్నారా?
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో అవినాష్ రెడ్డి కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు రోజూ సంచలనం అవుతున్నాయి. అవినాష్ రెడ్డి విచారణకు ఉద్దేశపూర్వకంగా డుమ్మా కొడుతున్నారని సీబీఐనే రెచ్చగొడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని సీబీఐ కోర్టుకు చెప్పింది కానీ ఎప్పుడు చేస్తామన్నది చెప్పలేదు. ఇప్పటికే అరెస్ట్ కోసం ప్రయత్నాలు చేయలేదు. ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తోంది. ఈ విచారణను వీలైనంత వరకూ తప్పించుకుంటున్నారు అవినాష్ రెడ్డి. ఇంకా చదవండి
వరంగల్ మెడికో ప్రీతి సోదరికి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ ర్యాగింగ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. చనిపోయిన మెడికో ప్రీతి సోదరి పూజకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ప్రీతి ఆత్మహత్య అనంతరం ఆమె కుటుంబ సభ్యులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరామర్శించారు. సీఎం కేసీఆర్ ప్రీతి కుటుంబానికి అండగా ఉంటారని ఆ సమయంలో ఎర్రబెల్లి ధైర్యం చెప్పారు. ఇంకా చదవండి
నిజామాబాద్ ఐటీ హబ్ కి 8 కంపెనీలతో మంత్రి కేటీఆర్ ఒప్పందం
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకువెళ్లాలని సంకల్పంతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముందుకు వెళ్తున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా జరిగిన సమావేశంలో 100 కంపెనీల సీఈఓ లతో మంత్రి కీటీఆర్ భేటీ అయ్యారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.... తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలలోనూ విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించడంతో పాటు ఇక్కడ ఉన్న అనుకూలతలు, తాము కల్పించిన మౌలిక వసతులపై మాట్లాడారు. ఇంకా చదవండి
రాధను హత్య చేసింది ఎవరు? భర్తపై పోలీసుల అనుమానం
ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన రాధ అనే వివాహిత హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ హత్యకు సంబంధం ఉందని రాధ స్నేహితుడు కాశిరెడ్డికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అదే సమయంలో రాధ భర్త మోహన్ రెడ్డిపై కూడా పోలీసులకు అనుమానం పెరిగింది. అందుకే ఆయన్ను కూడా పోలీస్ స్టేషన్ కి తరలించి విచారణ చేపట్టారు. కూపీ లాగుతున్నారు. ఇంకా చదవండి
పీక తెగ్గోసుకుంటాను కానీ అవినీతికి పాల్పడను - మంత్రి అమర్నాథ్!
రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను ప్రతిపక్ష నేత చంద్రబాబు దెబ్బతీస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో అమరావతి రాజధానిగా ఉండాలని జనంతో చంద్రబాబు చెప్పించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడుకి విశాఖపట్నంపై ఎంత ద్వేషం ఉందో అర్థమవుతుందని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిపై ఎప్పుడూ పక్కన పెట్టలేదని, దానిని కూడా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారని స్పష్టం చేశారు. ప్రజలు త్యాగాలు చేస్తే.. యోగాలు, భోగాలు అనుభవించే చంద్రబాబు నాయుడు రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిని ఎప్పుడూ కోరుకోలేదని గడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఇంకా చదవండి
రోజూ గుప్పెడు బాదం తిన్నారంటే ఈ ప్రయోజనాలన్నీ పొందుతారు
చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేది బాదం పప్పు. పోషకాల పవర్ హౌస్. ఈ నట్స్ రెగ్యులర్ గా డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక విటమిన్లు, శరీరానికి అవసరమైన ఖనిజాలు అందుతాయి. కొన్ని బాదం పప్పులు రాత్రంతా నానబెట్టి పొద్దునే తొక్క తీసేసి తింటే పోషకాలు అందుతాయి. ఇందులో విటమిన్ ఇ, బి6 పుష్కలంగా ఉన్నాయి. మెదడు కణాలలో ప్రోటీన్లను గ్రహించడంలో సహాయపడతాయి. అంతే కాదు ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. ఇంకా చదవండి
ఫారిన్‌లో కార్డ్ పేమెంట్స్‌పై మరింత ఊరట - కొత్త ప్రకటన చేసిన కేంద్రం
అంతర్జాతీయ క్రెడిట్/డెబిట్ కార్డ్‌ను ఉపయోగించి విదేశాల్లో చేసే ఖర్చుపై విధించే 20 శాతం TCSపై (tax collection at source లేదా మూలం వద్ద పన్ను సేకరణ) ప్రజల్లో సంశయాలు, ఆందోళనలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరొకమారు స్పష్టతనిచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి చేసే వ్యయాల్లో రూ. 7 లక్షల వరకు TCS వర్తించదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జులై 1, 2023 తర్వాత డెబిట్/క్రెడిట్ కార్డ్‌తో ఖర్చు చేసినా, రూ. 7 లక్షల లోపు వ్యయాలకు TCS నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇంకా చదవండి
బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు భారీగా డిమాండ్ చేసిన తమన్నా
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమా (NBK 108 Movie) తెరకెక్కిస్తున్నారు. విజయ దశమికి సినిమా విడుదల కానుంది. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయిక. బాలకృష్ణతో ఆమెకు తొలి చిత్రమిది. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అయితే... ఇందులో మరో అందాల భామ తమన్నా కూడా ఉన్నారని ప్రచారం మొదలైంది. ఇంకా చదవండి
రింకూ పోరాటం సరిపోలేదు - ఒక్క పరుగులో కోల్‌కతాపై లక్నో విజయం - ప్లేఆఫ్స్‌కు కూడా!
ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన థ్రిల్లర్ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న లక్నో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆడనుంది. లక్నో సూపర్ జెయింట్స్ ప్రత్యర్థి ఎవరనేది రేపు క్లారిటీ వస్తుంది. ఇంకా చదవండి