Top 10 Headlines Today: బీజేపీ, కాంగ్రెస్ కూటముల మెయిన్ థీమ్ ఏంటీ ? నాటి వలసలే నేడు బీఆర్‌ఎస్‌కు మైనస్సా?
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
భారత్ Vs ఇండియా
బీజేపీ వాళ్లు మొదటి నుంచి ఇండియా అన్న పేరును భారత్ అని ప్రొజెక్టు చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇండియా అనే పేరును వెనక్కు తీసుకువెళ్లడానికి వాళ్లకి ఇప్పుడు మరో కారణం దొరికింది. ఇదే I.N.D.I.A ఈ ఇండియా వేరు... ఇది ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్. బెంగళూరులో 26 పక్షాలు సమావేశం అయ్యి.. తమ అలయెన్స్ పేరు ఇండియా అని మధ్యాహ్నం తర్వాత ప్రకటించగానే.. సాయంత్రానికి 38పార్టీల ఎన్డీఏ సమావేశంలో మోదీ మాట్లాడారు. తన ప్రసంగంలో ఇండియా అనే పేరు రాకుండా చూసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
జనసేన కీలక చర్చలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఎన్డీఏ కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన... ఆ సమావేశం తర్వాత బీజేపీ కీలక నేతలతో చర్చలు జరిపారు. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్‌తో పాటు మరికొంత మంది కీలక నేత్లల్ని కలిసి చర్చలు జరిపారు. సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సమావేశమయ్యారు. ఏపీ రాజకీయాలపై కీలక అంశాలను వీరు చర్చించినట్లుగా తెలుస్తోంది. గురువారం కూడా పవన్ కల్యాణ్ ఢిల్లీలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కొంత మంది కీలక నేతలతో చర్చలు జరిపనున్నట్లుగా చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు
ఈ రోజు ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లాలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం - దక్షిణ ఒడిశా తీరంలో ఉండి, సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిమి ఎత్తువరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది. ఈ ఆవర్తన ప్రభావం వల్ల నేడు వాయువ్య, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
స్టేజ్-2 షెడ్యూలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థులకు స్టేజ్-2 దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు వెలువడింది. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ)లకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాలని ఏపీ పోలీసు నియామక మండలి జులై 19న వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వలసలతో బెడద
బీఆర్ఎస్ నేతలు ఎంతగా ఎదురుదాడి చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మాత్రం ఆగడం లేదు. బలమైన నేతలుగా పేరున్న వారే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల తర్వాత పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి సహా పలువురు ప్రముఖ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరంతా సీటు గ్యారంటీ లేకపోవడంతోనే వెళ్లిపోతున్నారు. ఇలా సీటు గ్యారంటీ ఇవ్వకపోవడానికి కేసీఆర్ అవసరం లేకపోయినా కాంగ్రెస్ నుంచి ప్రోత్సహించిన ఫిరాయింపులే కారణం. బీఆర్ఎస్ అధినేత వ్యూహాత్మక తప్పిదం కారణంగా ఎన్నికలకు ముందు పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తెలంగాణ హైకోర్టుకు కొత్త జడ్జీలు
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జీలు నియమితులయ్యారు. రాష్ట్రానికి కొత్త సీజే నియామకం జరిగింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే నియమితులయ్యారు. జస్టిస్ అలోక్ అరాధే ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు జడ్జిగా కొనసాగుతున్నారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు జడ్జిగా సేవలు అందిస్తున్న మరో జడ్జి జస్టిస్ సామ్ కొశాయ్ తెలంగాణ హైకోర్టు జడ్జిగా ట్రాన్స్ ఫర్ అయ్యారు. పలువురు జడ్జిల బదిలీలకు సుప్రీంకోర్టు కొలీజియం జులై 5న సిఫారసు చేయడం తెలిసిందే. మొత్తం ఐదుగురు జడ్జిల బదిలీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఈటలపై బీజేపీ అధిష్ఠానం సీరియస్
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పైన బీజేపీ అధిష్ఠానం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. నేడు (జూలై 19) ఆయన ఎమ్మెల్యే రాజాసింగ్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ విషయమే అధిష్ఠానానికి నచ్చలేదని సమాచారం. రాజాసింగ్ ను కొద్ది నెలల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలా సస్పెండ్ అయిన రాజాసింగ్ ఇంటికి వెళ్ళి కలవడం సరికాదంటూ ఈటలకు అధిష్ఠానం హితవు పలికినట్లుగా వార్తలు వస్తు్న్నాయి. ఒక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినందుకు గానూ గత ఆగస్టులో రాజాసింగ్ సస్పెన్షన్ కు గురయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
'హిడింబ' ఎలా ఉందంటే?
'రాజు గారి గది' సిరీస్ సినిమాలతో విజయాలు అందుకున్న హీరో అశ్విన్ బాబు. ఆయన హీరోగా నటించిన 'హిడింబ' ఈ నెల 20న థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా ఎలా ఉందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
టీమిండియా కుర్రాళ్లు అదరగొట్టారు.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వర్యంలో కొలంబో (శ్రీలంక) వేదికగా జరుగుతున్న ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్- 2023 టోర్నీలో భాగంగా భారత్ ‘ఎ’ - పాకిస్తాన్ ‘ఎ’ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కుర్రాళ్లు అదరగొట్టారు. పాకిస్తాన్‌ను తొలుత బ్యాటింగ్‌లో నిలువరించడమే గాక.. ఆ జట్టు నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించారు. భారత యువ పేసర్ రాజ్‌వర్ధన్ హంగర్గేకర్.. ఐదు వికెట్లతో చెలరేగి పాక్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. భారత్ ఏ తరఫున సాయి సుదర్శన్ (110 బంతుల్లో 104 నాటౌట్, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో భారత్‌కు ఘనవిజయాన్ని అందించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కొత్త ప్రయోగం
గృహరుణాల్లో వృద్ధి కోసం ప్రైవేటు సెక్టార్ బ్యాంక్ ఇండస్‌ఇండ్ (IndusInd Bank) సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇంటి రుణాల పోర్టుఫోలియోను పెంచుకొనేందుకు నేరుగా రియల్ ఎస్టేట్ డెవలపర్లతోనే భాగస్వామ్యాలు కుదుర్చుకుంటోంది. జూన్ త్రైమాసికం ఫలితాలు విడుదల చేసిన తర్వాత బ్యాంకు ఎండీ, సీఈవో సుమంత్ కట్‌పలియా ఈ వివరాలను మీడియాకు తెలిపారు. 'మేం నిర్మాణదారులు, స్థిరాస్తి కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే వారితో చర్చలు కొనసాగిస్తున్నాం' అని ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి