అన్వేషించండి

వరద బాధితులకు ఏపీ సీయం ప్రత్యేక ప్యాకేజీ , ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ దే -మార్నింగ్ టాప్ న్యూస్

Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.

Top 10 Headlines Today: 
1. వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. విజయవాడ వరద బాధితులకు భారీగా ఆర్థిక సాయం ప్రకటించారు. వరద ధాటికి ప్రభావితమైన ప్రతి ఇంటికి రూ.25 వేలు సాయం చేస్తామన్నారు. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండేవారికి రూ.10 వేలు, ఇళ్లలోకి నీరు వచ్చిన వారికి రూ.10 వేలు ఇస్తామని తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
2. చిరు వ్యాపారులకు  సాయం
చంద్రబాబు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో చిరు వ్యాపారులకు కూడా లబ్ధి చేకూరనుంది. చిరు వ్యాపారులకు రూ.25 వేల చొప్పున పరిహారం అందిస్తామని చంద్రబాబు చెప్పారు. బైక్స్ దెబ్బతిన్న వారికి రూ.3 వేలు, ఆటోలకు రూ.10 వేలు చొప్పున ఇస్తామని అన్నారు. చేనేత కార్మికులకు రూ.15 వేలు, MSMEలకు రూ.లక్ష  నుంచి రూ.1.5 లక్షలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
3.వాళ్లు రెచ్చగొడితే.. నేను రెచ్చిపోతానా...
విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైసీపీ రెచ్చగొట్టాలని చూస్తోందని, వారు రెచ్చగొడితే తాను రెచ్చిపోనని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంటుకు సరైన యాజమాన్యాన్ని నియమించుకొని, దాన్ని శాశ్వతంగా లాభాల బాట పట్టేలా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు రాష్ట్రానికి చాలా సెంటిమెంట్ అని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
4. ఏపీలో బీసీలకు ;చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు!
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ముందుకెళ్తోంది. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా పయనిస్తోంది. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ప్రణాళిక రచిస్తోంది. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల అంశంపై నేడు మంత్రి వర్గ సమావేశంలో చర్చిస్తారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
5. ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం
తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. హైదరాబాద్‌లో గణనాథుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. పక్కా ప్రణాళికతో అధికారులు, పోలీసులు నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
6. రాజీవ్‌గాంధీ విగ్రహం తరలించి తీరుతాం
సచివాలయం ముందు ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీభవన్‌కు తరలించి తీరుతామని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి.. ఇకనైనా పాలనపై ఫోకస్ చేయాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో పారిశుధ్యం పడకేసిందని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
7. వరద బాధితులకు అమరరాజ సాయం
ముంపు బాధితులను ఆదుకునేందుకు అమరరాజ గ్రూప్‌ భారీ ఆర్థిక సాయం అందజేసింది. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్లు, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ. కోటీ అందజేసింది. చంద్రబాబు, రేవంత్‌ను కలిసి చెక్కులు అందజేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
8. ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు మంత్రివర్గ ఉప సంఘం శుభవార్త చెప్పింది. ఎక్సైజ్ పాలసీపై చర్చించేందుకు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ.. ఇక నుంచి తక్కువ ధరలకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. అక్టోబర్‌ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం అమలు చేస్తామని తెలిపింది. 6 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించామని.. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు కేటాయిస్తామని పేర్కొంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
9.ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
భారత హాకీ జట్టు అయిదోసారి మెన్స్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చైనాపై 1-0తో విజయం సాధించింది. భారత్-చైనా జట్లు హోరాహోరాగి తలపడడంతో చివరి క్వార్టర్ వరకూ ఎలాంటి గోల్స్ నమోదు కాలేదు. చివరి క్వార్టర్ లో జుగ్ రాజ్ సింగ్ గోల్ చేయడంతో భారత్ విజయం సాధించింది. ఈ టోర్నమెంట్లో భారత్ ఒక్క మ్యాచు కూడా ఓడిపోకుండా కప్పు కైవసం చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
10. ఇక పురుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్ మనీ
మహిళల టీ 20 ప్రపంచకప్ అక్టోబరు 3న ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్లలో పురుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వచ్చే నెలలో జరిగే టీ 20 ప్రపంచకప్ నుంచే దీన్ని అమలు చేస్తామని వెల్లడించింది. ఇప్పటివరకు టీమిండియా ఒక్కసారి కూడా మహిళల పొట్టి ప్రపంచకప్‌ను దక్కించుకోలేదు. భారత్ రెండుసార్లు సెమీస్‌కు, ఒకసారి ఫైనల్‌కు చేరింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget