(Source: ECI/ABP News/ABP Majha)
Top 10 Headlines Today: వలసలతో కారు ఉక్కిరిబిక్కిరి అవుతుందా? ఎన్డీఏలోకి రాకుండా టీడీపీని అడ్డుపడుతున్నదేంటీ?
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
కాంగ్రెస్ సీనియర్ల వలస
రాజకీయాల్లో తాము బలపడటం కన్నా ఒక్కో సారి ప్రత్యర్థిని బలహీనపర్చడం గొప్ప వ్యూహం అవుతుంది. కానీ ప్రత్యర్థిపై ఇలాంటి ప్లాన్ అమలు చేసే ముందుకు తమకు ఎఫెక్ట్ అవుతుందేమో పరిశీలించకపోతే... తమ వ్యూహం తమకే బూమరాంగ్ అవుతుంది. పార్టీల్లో చేరికల ద్వారా ఇతర పార్టీల్ని బలహీనం చేయాలని అన్ని పార్టీలు అనుకుంటాయి. కానీ ఆ చేరికలు తమ పార్టీలో కలకలం రేపుతాయని ఆలోచించరు. అలాంటి పరిస్థితి ఎన్నికలకు ముందు తీవ్రం అవుతుంది . ప్రస్తుతం బీఆర్ఎస్ గతంలో జరిగిన చేరికలతో ఇబ్బంది పడుతూంటే.. ప్రస్తుతం మరికొంత మంది సీనియర్లను బీఆర్ఎస్‌లో చేర్చుకుంటారన్న చర్చ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
చంద్రబాబు మౌనానికి కారణమేంటీ?
ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరాలని భారతీయ జనతా పార్టీ బలంగా కోరుకుటోంది. జాతీయ మీడియాలో ఈ అంశంపై తరచూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబునాయుడు కూడా తాము బీజేపీ విధానాలతో ఏకీభవిస్తామని ప్రకటించారు. మోదీ పరిపాలన విధానాన్ని ఆయన సమర్థించారు. అయితే ఎన్డీఏలో చేరికపై మాత్రం కాలమే నిర్ణయిస్తుందని చెబుతున్నారు. ఏదీ తేల్చడం లేదు. గతంలో ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ అయ్యారు. తర్వాత వారు ఏపీలో బహిరంగసభలు పెట్టి వైసీపీని విమర్శించారు. రాష్ట్రంలోనూ వైసీపీపై బీజేపీ నేతలు యుద్ధం ప్రకటించారు. కానీ చంద్రబాబు మాత్రం ఎన్డీఏలో చేరడానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఎందుకు సందేహిస్తున్నారన్న అంశం జాతీయ మీడియాలోనూ చర్చనీయాంశం అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రేవంత్ వర్శెస్ ప్రభుత్వం
ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఏ విషయమైన రాజకీయంగా కాక రేపుతుంది. ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విషయంలో కూడా అదే జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే తిరుగుతున్నట్టు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించిందని కాంగ్రెస్ నేతల మాట. అందుకే సెక్యూరిటీ లేకుండానే తిరుగుతున్నట్టు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు రేవంత్ రెడ్డి 4+4 భద్రతను ప్రభుత్వం కల్పించింది. అయితే వాటిని ఈ మధ్యనే 2+2కు ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు పూర్తిగా భద్రతను ప్రభుత్వం తొలగించందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వర్ష సూచన
వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తన ప్రభావంతో ఈరోజు ఒక అల్పపీడన ప్రదేశం వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం (ఆగస్టు 17) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అల్ప పీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపునకు వాలి ఉందని తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ రాగల 3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
టీడీపీ రద్దు చేయండి- విజయసాయిరెడ్డి
చంద్రబాబు అసత్య హరిశ్చంద్రుడంటూ వైఎస్ఆర్ సీపీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. పుంగనూరులో పోలీసులపై దాడి చేసిన చరిత్ర తెలుగు దేశం పార్టీదే అని విమర్శించారు. ఏపీలో ఇప్పటివరకూ చంద్రబాబుకు స్థిర నివాసం లేదని అన్నారు. క్షేత్రస్థాయిలో వైఎస్సార్ సీపీకి సంపూర్ణ బలం ఉందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం (ఆగస్టు 17) ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 51 శాతానికి పైగా ప్రజలందరూ వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారని.. గతంలో వచ్చిన 151 సీట్లకు ఒక్క సీటు కూడా తగ్గబోదని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
గ్రూప్ వన్ విజేతలకు శుభాకాంక్షలు
ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు ఆగస్టు 17న విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి 11 వరకు నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ ఆగస్టు 17న సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. గ్రూప్-1 ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫలితాలను చూసుకోవచ్చు. మొత్తం పోస్టులు 111 కాగా.. 110 పోస్టుల ఫలితాలను మాత్రమే ఏపీపీఎస్సీ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి కేవలం 11 నెలల్లోనే తుది ఎంపిక ఫలితాలను వెల్లడించడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
థర్డ్ డిగ్రీపై మంత్రి సీరియస్
మీర్‌పేట్ సీఎస్ పరిధిలో మహిళలను స్టేషన్‌కు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. దీనిపై గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి రాచకొండ సీపీకి ఫోన్ చేసి ఏం జరిగిందని ఆరా తీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కామెంట్ చేస్తే ఉద్యోగం పోయింది!
ఇటీవల తన మాజీ భర్త పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ రేణు దేశాయ్ ఓ వీడియో సందేశం పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన విషయంలో పవన్ చేసింది వంద శాతం తప్పేనని, కానీ రాజకీయంగా మాత్రం తన మద్దతు ఆయనకే ఉంటుందని ప్రకటించింది. పవన్ డబ్బు మనిషి కాదని, సమాజానికి మంచి చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చాడని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరింది. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆమెపై ఘాటు వ్యాఖ్యలు చేయగా.. ఆ విషయాన్ని రేణూ ఇంస్టాగ్రామ్ లో తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆ కామెంట్స్ చేసిన వ్యక్తి ఓ మీడియా సంస్థకి చెందిన ఉద్యోగి అని ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రం ఎలా ఉంది?
‘కథ వేరుంటది’ అంటూ బిగ్ బాస్ హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ పండించిన సొహెల్ వెండి తెరపై కూడా వినోదాన్ని పంచుతున్నారు. ఈ సంవత్సరం ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ అంటూ పలకరించాక ఇప్పుడు ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనే ప్రయోగాత్మక చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక మగాడు గర్భం మోయడం అనే ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్‌ను ఎమోషనల్‌గా కట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా కలిగాయి. చిత్ర బృందం చాలా అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ చేసింది. ఇంతకీ సినిమా ఎలా ఉంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
లిప్‌స్టిక్ వివాదానికి స్లైల్‌తో చెక్
బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, ఆలియా భట్‌పై అభిమానుల ఫోకస్ ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి జరిగినప్పటి నుంచి వీరిద్దరు కలిసి బయటికొచ్చినా లేదా ఒకరి గురించి ఒకరు మాట్లాడినా సెన్సేషనే అవుతోంది. తాజాగా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆలియా భట్.. రణబీర్ ఒకసారి తన లిప్‌స్టిక్‌ను పూర్తిగా తుడిచేయమన్నాడని ఆసక్తికర కామెంట్స్ చేసింది. కానీ తను చేసిన కామెంట్స్ వల్ల రణబీర్ చాలా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆలియా ఈ కామెంట్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి