అన్వేషించండి

Weather Latest Update: బంగాళాఖాతంలో అల్పపీడనం, భారీ వర్ష సూచన - వాతావరణ కేంద్రం

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు రేపు, ఎల్లుండి అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.

వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తన ప్రభావంతో ఈరోజు ఒక అల్పపీడన ప్రదేశం వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం (ఆగస్టు 17) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అల్ప పీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపునకు వాలి ఉందని తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ రాగల 3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు రేపు, ఎల్లుండి అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.

హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 10 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో వాయువ్య దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.7 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 81 శాతంగా నమోదైంది.

ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు కొన్నిచోట్ల నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అలాగే గాలులు కూడా స్వల్పంగా వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అన్నారు. 

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CapitaLand Investment: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం -  భయంతో పరుగులు తీసిన భక్తులు
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం - భయంతో పరుగులు తీసిన భక్తులు
CM Chandrababu: 'కేంద్రం చొరవతో 'వెంటిలేటర్' నుంచి ఏపీ బయటపడింది' - కేంద్ర మద్దతు ఇంకా కావాలన్న సీఎం చంద్రబాబు
'కేంద్రం చొరవతో 'వెంటిలేటర్' నుంచి ఏపీ బయటపడింది' - కేంద్ర మద్దతు ఇంకా కావాలన్న సీఎం చంద్రబాబు
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో యాత్రికుల వాహనానికి ప్రమాదం - 40 మందికి పైగా గాయాలు
ఆదిలాబాద్ జిల్లాలో యాత్రికుల వాహనానికి ప్రమాదం - 40 మందికి పైగా గాయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రైతు బంధుపై ఎవరిదీ రాజకీయం?Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP DesamCM Chandrababu on Population | పెద్ద కుటుంబమే పద్ధతైన కుటుంబం | ABP DesamMohammed shami Jasprit Bumrah CT 2025 | నిప్పులాంటి బుమ్రా...పెను తుపాన్ షమీ తోడవుతున్నాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CapitaLand Investment: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం -  భయంతో పరుగులు తీసిన భక్తులు
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం - భయంతో పరుగులు తీసిన భక్తులు
CM Chandrababu: 'కేంద్రం చొరవతో 'వెంటిలేటర్' నుంచి ఏపీ బయటపడింది' - కేంద్ర మద్దతు ఇంకా కావాలన్న సీఎం చంద్రబాబు
'కేంద్రం చొరవతో 'వెంటిలేటర్' నుంచి ఏపీ బయటపడింది' - కేంద్ర మద్దతు ఇంకా కావాలన్న సీఎం చంద్రబాబు
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో యాత్రికుల వాహనానికి ప్రమాదం - 40 మందికి పైగా గాయాలు
ఆదిలాబాద్ జిల్లాలో యాత్రికుల వాహనానికి ప్రమాదం - 40 మందికి పైగా గాయాలు
Crime News: మిమ్స్ వైద్య కళాశాల విద్యార్థి బలవన్మరణం - విజయనగరం జిల్లాలో విషాదం
మిమ్స్ వైద్య కళాశాల విద్యార్థి బలవన్మరణం - విజయనగరం జిల్లాలో విషాదం
Sankranthiki Vasthunam Box Office Collection Day 5: బాక్సాఫీసు వద్ద వెంకీమామ దూకుడు - షాకిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' 5 రోజుల కలెక్షన్స్‌, ఎంతంటే!
బాక్సాఫీసు వద్ద వెంకీమామ దూకుడు - షాకిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' 5 రోజుల కలెక్షన్స్‌, ఎంతంటే!
Kokata Murder Case: 'నా కుమారుడికి మరణ శిక్ష విధించండి' - ఆర్జీకర్ కేసు దోషి తల్లి
'నా కుమారుడికి మరణ శిక్ష విధించండి' - ఆర్జీకర్ కేసు దోషి తల్లి
SVSN Varma: 'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
Embed widget