Game Changer: ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ ఇలాంటి ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. "గేమ్ ఛేంజర్" ప్రీ రిలీజ్ వేడుక అమెరికాలో భారీ ఎత్తున జరగనుంది.
"ఆర్ఆర్ఆర్" సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం "గేమ్ ఛేంజర్". శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ గురించి ఓవైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా "గేమ్ ఛేంజర్" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. దాని ప్రకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ పరంగా "గేమ్ ఛేంజర్" ఇండియన్ సినీ హిస్టరీలో తొలిసారి ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది.
శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందుతున్న భారీ పొలిటికల్ ఎంటర్టైనర్ "గేమ్ ఛేంజర్". ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ల పై దిల్ రాజు, శిరీష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ అదిరిపోయే ప్లాన్స్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. రోజురోజుకూ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్న ఈ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి డైరెక్టర్ శంకర్ ఒక కొత్త ప్రమోషన్ స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు మరే ఇతర సినిమా చేయని అద్భుతాన్ని "గేమ్ ఛేంజర్" చేయబోతోంది.
Also Read: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
డిసెంబర్ 21న అమెరికాలో "గేమ్ ఛేంజర్" ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జరగబోతోంది. కర్టిస్ కల్‌వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్‌లాండ్ టి.ఎక్స్ 75040 ఈ వేడుకకు వేదిక కాబోతోంది. ఇక ఈ వేడుకకు రామ్ చరణ్, కియారా అద్వానీతో పాటు చిత్ర బృందం మొత్తం హాజరుకానున్నట్టుగా తెలుస్తోంది. కాగా "గేమ్ ఛేంజర్" ప్రీ రిలీజ్ వేడుక అమెరికాలో చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లేపల్లి ఆధ్వర్యంలో అత్యంత భారీగా జరగబోతుంది. అయితే చరిష్మా డ్రీమ్స్ పై డిస్ట్రిబ్యూటర్ గా, ప్రొడ్యూసర్ గా, యూఎస్ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిటర్ సర్కిల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న రాజేష్.. ఇప్పుడు రామ్ చరణ్ పై అభిమానంతో ఈ భారీ ఈవెంట్ ను కనీవిని ఎరగని విధంగా ప్లాన్ చేయడం అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉండగా రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు కథను అందించగా, తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. "గేమ్ ఛేంజర్" మూవీని తమిళంలో ఎస్విసి, ఆదిత్య రామ్ మూవీస్ సంస్థలు రిలీజ్ చేయబోతున్నాయి. అలాగే ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని హిందీలో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికైతే ఈ మూవీ నుంచి రెండు సాంగ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా. త్వరలోనే "గేమ్ ఛేంజర్" మూవీ నుంచి మూడో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక రిలీజ్ కు ముందే ఇలా రికార్డుల కోత మొదలు పెట్టిన "గేమ్ ఛేంజర్" అయ్యాక ఎన్ని రికార్డులను గల్లంతు చేస్తుందో చూడాలి.
Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు... మొదటి రోజే డిజాస్టర్ టాక్, షోస్ క్యాన్సిల్