Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
15 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో 'గేమ్ ఛేంజర్' కోసం న్యూజిలాండ్‌లో ఒక రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించారు మేకర్స్. ఈ పాటను నవంబర్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన పొలిటికల్ పాన్ ఇండియా మూవీ "గేమ్ ఛేంజర్". ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న భారీ ఎత్తున థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే మూవీ విడుదలకు టైం దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచే సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలోని ఒక సాంగ్ కోసం ఏకంగా 15 కోట్ల బడ్జెట్ ను పెట్టారనేది ఆ వార్తల సారాంశం.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ "గేమ్ ఛేంజర్". ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ రెండు సాంగ్స్ ను రిలీజ్ చేయగా, వాటికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు మూడవ సింగిల్ ను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు "గేమ్ ఛేంజర్" మేకర్స్ రిలీజ్ చేయబోతున్న ఈ మూడవ సాంగ్ ను న్యూజిలాండ్ లో భారీ స్థాయిలో చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ రొమాంటిక్ సాంగ్ లో రామ్ చరణ్ తో పాటు కియారా అద్వానీ కూడా స్టెప్పులేసింది. ఈ పాటను నవంబర్ 27న రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా సమాచారం. అయితే ఈ పాట కోసం మేకర్స్ ఏకంగా 15 కోట్ల బడ్జెట్ ను పెట్టారనే విషయం సంచలనంగా మారింది. ఒక్క పాటకే ఒక చిన్న సినిమా బడ్జెట్ పెట్టడంతో ఈ పాట తెరపై ఎలా ఉంటుందో చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు మెగా అభిమానులు. ఇక శంకర్ స్టైల్ లో భారీ బడ్జెట్ తో పాట వచ్చిందంటే... అది తెరపై కన్నుల విందుగా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు... మొదటి రోజే డిజాస్టర్ టాక్, షోస్ క్యాన్సిల్
కొన్నాళ్ల క్రితమే "గేమ్ ఛేంజర్" టీం ఈ సినిమా నుంచి రెండు పాటలను రిలీజ్ చేశారు. అందులో ఒకటి "జరగండి" అనే టైటిల్ తో రిలీజ్ అయింది. కియారా అద్వాని, రామ్ చరణ్ కలిసి చేసిన ఈ పెప్పీ డాన్స్ నంబర్ మెగా ఫాన్స్ ను తెగ ఆకట్టుకుంది. ఈ పాట ఈ ఏడాది మొదట్లో రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ అయింది. ఇక కొన్ని వారాల క్రితమే ఈ సినిమాలోని రెండవ పాట "రా మచ్చా మచ్చా" అనే పాట రిలీజ్ అయింది. ఇందులో రామ్ చరణ్ సోలో డాన్స్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఇక మూవీ రిలీజ్ కి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో మూడవ సింగిల్ ను రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు చిత్ర బృందం.
"గేమ్ ఛేంజర్" సినిమాలో రామ్ చరణ్, కియారా అద్వానీతో పాటు ఎస్జె సూర్య, శ్రీకాంత్, అంజలి, జయరాం, సముద్రఖని, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ అవినీతి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ప్రయత్నించే ఐఏఎస్ అధికారిగా కనిపించబోతున్నారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తారని టాక్ నడుస్తోంది. "గేమ్ ఛేంజర్" సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: జీబ్రా రివ్యూ: సత్యదేవ్ వర్సెస్ డాలీ ధనుంజయ... హీరోలు ఇద్దరిలో ఎవరిది పైచేయి? మూవీ హిట్టేనా?