అన్వేషించండి

రేణూ దేశాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు - ఆ కామెంట్స్ చేసిన టీవీ చానెల్ ఉద్యోగిపై వేటు?

పవన్ కళ్యాణ్ తన్ని తరిమేశాడంటూ ఓ నెటిజన్ కామెంట్స్ చేయడంపై ఇటీవల ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ కామెంట్ చేసిన వ్యక్తి ఎవరనే విష‌యం ఇప్పుడు బయటకు వచ్చింది. 

ఇటీవ‌ల త‌న‌ మాజీ భ‌ర్త ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ ను ఉద్దేశిస్తూ రేణు దేశాయ్ ఓ వీడియో సందేశం పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన విష‌యంలో పవన్ చేసింది వంద‌ శాతం తప్పేనని, కానీ రాజ‌కీయంగా మాత్రం తన మ‌ద్ద‌తు ఆయ‌న‌కే ఉంటుందని ప్రకటించింది. ప‌వ‌న్ డ‌బ్బు మ‌నిషి కాద‌ని, స‌మాజానికి మంచి చేయాల‌నే త‌ప‌న‌తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడని, ఒక్కసారి అవ‌కాశం ఇవ్వాల‌ని కోరింది. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆమెపై ఘాటు వ్యాఖ్యలు చేయగా.. ఆ విషయాన్ని రేణూ ఇంస్టాగ్రామ్ లో తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆ కామెంట్స్ చేసిన వ్యక్తి ఓ మీడియా సంస్థకి చెందిన ఉద్యోగి అని ప్రచారం జరుగుతోంది. 

జనసేన అధినేత పవన్‌ గురించి రేణూ దేశాయ్ మాట్లాడిన వీడియోకి ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘అందుకే పవన్ కళ్యాణ్ నిన్ను తన్ని తరిమేశాడు మేడమ్’’ అని కామెంట్ చేశాడు. దీనికి బాధ పడిన రేణూ ‘‘నన్ను తిట్టడంతో నీకు మనశ్శాంతి దొరికిందా? లేదంటే ఇంకా తిట్టండి. నా మాజీ భర్తను ఫాలో అయ్యేవారు లేదా ఆయన వ్యతిరేకుల నుంచి తిట్లు వినడం మాత్రమే నా జీవితానికి అర్థం. కానివ్వండి’’ అంటూ వాపోయింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ, పెద్ద నోట్ రాసుకొచ్చింది. 

‘‘నేను విడాకుల గురించి, నా మాజీ భర్త చేతిలో ఎలా మోసపోయాననే దాని గురించి మాట్లాడినప్పుడు తన ఫ్యాన్స్ నన్ను వేధింపులకు గురిచేశారు. ఇప్పుడు ఒక పౌరురాలిగా ఆయనకు ఫేవర్ గా నిజాయితీగా మాట్లాడినందుకు.. ఆయన హేటర్స్ నన్ను నిందిస్తున్నారు. ఒకప్పుడు విడాకుల గురించి మాట్లాడడానికి ఆయన వ్యతిరేక వర్గం నుంచి డబ్బు తీసుకున్నానని అనేవాళ్లు. ఇప్పుడు నేను నా మాజీ భర్తకు చెందిన వ్యక్తుల నుండి డబ్బు తీసుకున్నానని ఆరోపిస్తున్నారు. నేను రెండు సందర్భాల్లో నిజం తప్ప ఇంకేమీ మాట్లాడలేదు. ప్రేమలో పడినందుకు, నిజాలు మాట్లాడినందుకు ఇదంతా అనుభవించక తప్పదేమో. ఒకవేళ ఇదే నా తలరాత అయితే, అలాగే ఉండండి. ఇంకా తిట్టడం స్టార్ట్ చేయండి’’ అని రేణూ దేశాయ్ పోస్ట్ చేయడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 

అటు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ఇటు యాంటీ పవన్ ఫ్యాన్స్ నుంచి తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాననేది చెబుతూ ఆవేదన వ్యక్తం చేయడంతో అందరూ రేణు దేశాయ్ పై సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు. ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేసిన నెటిజన్ ను దూషిస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, రేణూపై కామెంట్స్ చేసిన వ్యక్తి ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో పని చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి యాజమాన్యం అతణ్ని ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పుకుంటున్నారు. 

Also Read: 2023లో అధిక లాభాలు, భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు - ఆ రెండూ 'మెగా' ఖాతాలోనే!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Pamban Rail Bridge: దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
Embed widget