అన్వేషించండి
Advertisement
Top Headlines Today: బీఆర్‌ఎస్ నేతలపై సీఏం విమర్శలు, జగన్ ట్వీట్‌కు లొకేశ్ కౌంటర్-మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Top 10 Headlines Today:
1. కాలకేయ ముఠా నుంచి కాపాడుకుందాం
తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్‌రెడ్డి.. బీఆర్‌ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఇచ్చింది.. రాష్ట్రాన్ని కాపాడేది తామే అని రేవంత్ చెప్పారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ముట్టి చూడండి బిడ్డా.. ఎవడు వస్తాడో రండి.. నేను చూస్తా అంటూ ముఖ్యమంత్రి మండిపడ్డారు. కాలకేయ ముఠా, మీడతల దండు నుంచి తెలంగాణను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
2. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో జిల్లేళ్లు మెలిపిస్తాం
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌పైన సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునే వాడు రాజీవ్ గాంధీ తెచ్చిన సంస్కరణలతో ఐటీ శాఖ మంత్రి అయ్యాడని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులు ఇచ్చుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ వేల ఎకరాల్లో కట్టిన ఫామ్ హౌస్‌లో జిల్లేడు మొలిపిస్తా నని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. గాంధీ భవన్‌కు.. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తరలిస్తాం
తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో.. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే చర్యంటూ మండిపడ్డారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలిస్తామని తేల్చి చెప్పారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. రెండు రోజులు వైన్స్ బంద్
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో వైన్ షాపులు రెండు రోజులు బంద్ కానున్నాయి. మంగళ, బుధవారాల్లో అన్ని మద్యం షాపులు మూసి వేయాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గణేశ్ నిమజ్జన వేడుకల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
5. జగన్ కౌంటర్.. లోకేశ్ ఎన్‌కౌంటర్
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ క్లాస్ విద్యార్థులు CBSE బోర్డ్ పరీక్షలు కాకుండా SSC బోర్డ్ పరీక్షలే రాసేలా విద్యా మంత్రి నారా లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. తమ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాలను కూటమి ప్రభుత్వం ఎందుకు పక్కనపెడుతోందని ప్రశ్నించారు. ఈ ట్వీట్ కి నారా లోకేష్ స్పందించారు. విద్యా శాఖ గురించి జగన్ లెక్చర్లు ఇవ్వడం వింతగా ఉందన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6. అమరావతి సురక్షితం: మంత్ర నారాయణ
అమరావతి పూర్తిగా సేఫ్ జోన్‌లో ఉందని, ఎలాంటి ఇబ్బందీ లేదని... ఎలాంటి దుష్ప్రచారం నమ్మొద్దని ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. అమరావతి నిర్మాణంలో భాగంగా మూడు కెనాల్స్‌ను డిజైన్ చేశామన్నారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్‌ను డిజైన్ చేసినట్లు తెలిపారు. వచ్చే వానాకాలం నాటికి ఈ కాల్వలను పూర్తి చేస్తామన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
7. బోట్ల తొలగింపు మరింత క్లిష్టం
ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ మరింత క్లిష్టంగా మారింది. 7 రోజులుగా వాటిని తొలగించేందుకు సిబ్బంది చేస్తోన్న ప్రయత్నాలు సత్ఫలాలు ఇవ్వడం లేదు. బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ ఇంజినీర్లు మరో వ్యూహం అమలు చేస్తున్నారు. రెండు భారీ పడవలను ఇనుప గడ్డర్లతో అనుసంధానించి వెలికి తీయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8. జానీపై జనసేనపార్టీ చర్యలు
యువతిపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సినీ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై జనసేన పార్టీ చర్యలు తీసుకుంది. జానీ ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనవద్దని తేల్చి చెప్పింది. యువతి నుంచి వాంగ్మూలం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని.. కానీ బాధితురాలు ప్రస్తుతం హైదరాబాద్ లో లేదని సీఐ చెప్పారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9. మోదీ 3.0పాలనకు వంద రోజులు పూర్తి
నేటితో బీజేపీ నేతృత్వంలోని NDA సర్కారు 3.O ..100 రోజులు పూర్తి చేసుకుంది. మోదీ 2.O ఐదేళ్ల వ్యవధిలో దేశంలోని ఆఖరి ఇంటికి కూడా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి చరిత్ర సృష్టించిన ఎన్‌డీఏ సర్కారు.. ఇప్పుడు దేశంలోని వంద మంది కంటే తక్కువ జనాభా కలిగిన గ్రామాలకు కూడా రోడ్డు సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు అవసరైన అనేక నిర్ణయాలు తీసుకుంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10. ముఖ్యమంత్రి పెళ్లాంగా ఇంద్రజ
సీనియర్ నటి ఇంద్రజ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తుండడం ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. 'సీఎం పెళ్లాం' పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. సహజనటి జయసుధ, సుమన్, అజయ్ నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో సాగే చక్కటి సందేశాత్మక చిత్రం 'సీఎం పెళ్లాం' అని దర్శకుడు తెలిపారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
తిరుపతి
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion