అన్వేషించండి

NDA 3.O @ 100 Days: వంద రోజులు పూర్తి చేసుకున్న మోదీ 3.0 సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాలివే !

100 Days Of NDA 3.O : మూడోసారి వరుసగా కేంద్రంలో అధికారం చేపట్టిన ఎన్‌డీఏ సర్కారు.. వంద రోజులను పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది.

NDA 3.0 @ 100 Days: మంగళవారం(సెప్టెంబర్‌ 17)తో 100 రోజులు పూర్తి చేసుకున్న భాజపా నేతృత్వంలోని NDA సర్కారు 3.O .. 2047 నాటికి భారత్‌ను సర్వశ్రేష్ఠం చేయడం సహా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు అవసరైన అనేక నిర్ణయాలు తీసుకుంది. దేశాభివృద్ధి అంటే ప్రతి ఇంటికీ విద్యుత్‌.. ప్రతి ఊరికి రోడ్డు సదుపాయం కల్పించడం. మోదీ 2.O ఐదేళ్ల వ్యవధిలో దేశంలోని ఆఖరి ఇంటికి కూడా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి చరిత్ర సృష్టించిన ఎన్‌డీఏ సర్కారు.. ఇప్పుడు దేశంలోని వంద మంది కంటే తక్కువ జనాభా కలిగిన గ్రామాలకు కూడా రోడ్డు సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఈ వంద రోజుల్లోనే.. 25 వేల గ్రామాల రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్రాల సాయంతో కేంద్రం  49 వేల కోట్లు వెచ్చించి  62 వేల 500 కిలోమీటర్ల మేర రోడ్లు, వంతెనల నిర్మాణం చేపట్టాలని బృహత్తర నిర్ణయం తీసుకుంది.

మొత్తం 3 లక్షల కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా అనేక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు అంకురార్పణ చేసింది. ఇందులో కొన్ని కొత్తగా చేపట్టేవి ఉండగా.. మరికొన్ని ఉన్నవాటిని అప్‌డేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. జూన్‌ 9న ముచ్చటగా మూడో సారి కొలువు దీరిన నరేంద్రమోదీ సర్కార్‌.. మహారాష్ట్రలోని వధ్‌వాన్ పోర్టు అభివృద్ధి చేసి దేశంలోని టాప్‌ 10 పోర్టుల్లో ఒకటిగా నిలపడమే లక్ష్యంగా.. 76 వేల 200 కోట్ల రూపాయలు వెచ్చించాలన్న నిర్ణయం కూడా ఈ వంద రోజుల్లో తీసుకున్నదే. దేశవ్యాప్తంగా ఉన్న రోడ్‌ నెట్‌వర్క్‌ను మరింత ఆధునికీకరించి మరింత వైగవంతమైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు దాదాపు 50 వేల 600 కోట్లు తద్వారా 956 కిలోమీటర్ల మేర హైస్పీడ్‌ కారిడార్లు ఏర్పాటు కానువ్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ను లద్ధాఖ్‌తో కనెక్ట్ చేసే షింకున్ లా టన్నెల్‌ ఏర్పాటు కూడా ఈ వంద రోజుల్లో సాధించిందే. అంతే కాకుండా దేశవ్యాప్తాం 8 హైస్పీడ్ రైల్వే లైన్‌లు ఏర్పాటు చేసి సుమారు           4న్నర కోట్ల హ్యూమన్ డేస్‌ ఆఫ్ ఎంప్లాయిమెంట్‌ను ఆదా చేయాలని నిర్ణయించారు. మొత్తంగా 3 లక్షల కోట్ల  రూపాయలతో దేశం రూపు రేఖలు మార్చే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఈ వందరోజుల్లోనే అడుగు పడింది.

రైతన్నకు అండగా వంద రోజుల పాలనలో నిర్ణయాలు:

దేశంలోని కోట్లాది రైతులకు మేలు చేసేలా మోదీ సర్కారు అనేక నిర్ణయాలు తీసుకుంది. ఖరీప్‌ సాగు పంటలకు మద్దతు ధర పెంపు సహా.. ఆనియన్స్, బాస్మతి రైస్‌ మీద ఉన్న మినిమమ్ ఎక్స్‌పోర్ట్‌ ప్రైస్‌ను ఎత్తేసింది. క్రూడ్‌ ఆయిల్ ఫామ్‌, సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై ఉన్న దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా ఇక్కడి ఫామ్ ఆయిల్ రైతులకు ఉపయుక్తమైన నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీలోనూ మార్పులు చేసిన మోదీ 3.O సర్కారు దాదాపు 140 వస్తువులపై జీఎస్‌టీని తగ్గించింది. అంతేకాకుండా సాగు రంగంలో కొత్త విప్లవం తేవడమే లక్ష్యంగా అగ్రిస్యూర్ పథకాన్ని రూపొందిన ఎన్‌డీఏ సర్కారు.. ఈ సెక్టార్‌లో సపోర్టింగ్‌ స్టార్టప్స్‌తో పాటు రూరల్ ఎంటర్‌ప్రైజెస్ ఏర్పాటుకు ఊతం అందించనుంది.

ఆర్‌ అండ్ డీతో పాటు ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సెక్టార్‌లకు బాసటగా నిర్ణయాలు:

పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో దేశాన్ని ద్విగుణీకృతం చేయడమే లక్ష్యంగా 50 వేల కోట్ల రూపాయలను నేషనల్ రీసెర్చ్ ఫండ్‌గా విడుదల చేసిన సర్కారు.. మరో వెయ్యికోట్ల రూపాయలతో దేశంలో స్టార్టప్స్ ఏర్పాటు సహా వాటిని ప్రమోట్ చేసేందుకు సహకరించనుంది. మొత్తంగా ఈ రంగంలో 15 లక్షల కోట్ల రూపాయల మేర విలువైన ప్రాజెక్టులను కూడా ఈ వంద రోజుల్లోనే మొదలు పెట్టింది. సెమీకండక్టర్‌ ఇండస్ట్రీకి ఊతం ఇచ్చేలా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను కూడా పరుగులు పెట్టించింది. ఈ మేరకు గుజరాత్‌లోని సానంద్‌లో 3 వేల 300 కోట్లతో రోజుకు ఆరు మిలియన్ల చిప్‌లు తయారు చేసేలా కొత్త ప్రాజెక్టుకు అంకురార్పరణ చేసింది. ఈ నిర్ణయాలతో ప్రపంచంలోని రెండో అతి పెద్ద మొబైల్ తయారీ సంస్థగా భారత్ అవతరించనుంది.

విపత్తుల నిర్వహణకు ప్రత్యేక చర్యలు:

విపత్తుల నిర్వహణకు నేషనల్‌ డేటాబేస్ ఏర్పాటు సహా గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్ రికార్డ్స్‌ భధ్రతకు భువన్ పంచాయత్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఇంధన మరియు భద్రత ప్రాజెక్టులను 4 వేల 100 కోట్లతో చేపట్టింది. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్ కింద 12 వేల 400 కోట్ల రూపాయల విలువైన విద్యుత్‌చ్ఛక్తి ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటితో పాటు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను కూడా అనేకం మొదలు పెట్టింది. అర్బన్ ఫ్లడ్ మేనేజ్‌మెంట్ సహా ఫైర్‌ సర్వీసెస్‌, గ్లేసియర్ లేక్ అవుట్ బరస్ట్‌, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సమర్థంగా ఎదుర్కొనేందుకు 12 వేల 554 కోట్ల రూపాయలను ఈ వంద రోజుల్లోనే రాష్ట్రాలకు కేటాయించింది. విజయవాడలోని బుడమేరు తరహా వరదల సమర్థ కట్టడికి సలహాలు సూచనల కోసం ప్రత్యేక కమిటీని కూడా వేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి నిర్ణయాలు పట్టాలెక్కించడమే లక్ష్యంగా పేర్కొన్న మోడీ 3.O సర్కారు.. జనగణన చేపట్టడానికి ఈ వంద రోజుల్లోనే నిర్ణయించింది.

Also Read: 74వ పడిలోకి నరేంద్ర మోదీ - కుగ్రామం నుంచి ప్రధాని వరకూ ఆయన ప్రయాణం సాగిందిలా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Telangana News: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Telangana News: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
Upcoming Smartphones in December: డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
Fengal Cyclone: 'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
Embed widget