అన్వేషించండి

Happy Birthday PM Modi: 74వ పడిలోకి నరేంద్ర మోదీ - కుగ్రామం నుంచి ప్రధాని వరకూ ఆయన ప్రయాణం సాగిందిలా

భారత ప్రధాని మోదీ మంగళవారం నాడు 74వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఒకచిన్న పట్టణంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన ప్రధాని మోదీ.. అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రధాని అవడమేకాక వరుసగా మూడు సార్లు ప్రధానిగా ఉన్నారు.

 HBD PM Modi | భారతదేశానికి మూడోసారి వరుసగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ.. వెనుకపడిన వర్గాలకు చెందిన ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి దేశాన్ని ఏలే వరకు ఆయన ప్రస్థానం స్పూర్తి దాయకం. 1950లో గుజరాత్‌లోని మెహ్‌సానా జిల్లా పరిధి వాద్‌నగర్‌లో మోదీ జన్మించారు. చిన్న తనంలో స్థానిక రైల్వే స్టేషన్‌లో టీ అమ్మిన ఆయన.. ఆ తర్వాత ఛాయ్‌ పే చర్చ అంటూ దేశవ్యాప్తంగా ప్రజలతో మమేకమయ్యారు. చిన్ననాటి నుంచే మనసులో దేశం పట్ల విపరమైన ప్రేమ పెంచుకున్న ఆయన.. మన్‌కీబాత్ పేరిట దేశపురోభివృద్ది గురించి దేశవ్యాప్తంగా ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఉన్నారు.

యూనివర్శిటీ ఆఫ్‌ అహ్మదాబాద్‌ నుంచి పొలిటికల్ సైన్స్‌లో MA చేసిన మోదీ.. చిన్ననాటి నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తొలుత 1970ల్లో ఆర్‌ఎస్‌ఎస్ స్టూడెంట్ వింగ్‌ అయిన అఖిల భారత విద్యాపరిషత్ ఏబీవీపీలో భాగమయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు క్రమంగా ఎదుగుతూ వచ్చిన మోదీ.. తన పొలిటికల్ కెరీర్‌కు అక్కడి నుంచే బాటలు వేసుకుంటూ వచ్చారు. 1987లో భారతీయ జనతా పార్టీలో చేరిన మోదీ.. ఏడాదిలోనే గుజరాత్ భాజపా జనరల్ సెక్రెటరీ స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత అనతి కాలంలోనే పార్టీని గ్రాస్‌రూట్స్‌కు తీసుకెళ్లాడు. 1990లో భాజపా సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించిన మోదీ.. 1995లో భాజపాను గుజరాత్‌లో అధికారంలోకి తీసుకు రావడంలో కీలక పాత్రపోషించి జాతీయ నాయకుల దృష్టిలో పడ్డారు. అయితే ఆ సర్కారు 1996లో కూలిపోయింది.

జాతీయ రాజకీయాల్లోకి మోదీ ఎంట్రీ:

1995లో భాజపాను తొలిసారి ఒంటరిగా గుజరాత్‌లో అధికారంలోకి తేవడంలో మోదీ కీలకపాత్ర పోషించారు. భాజపా జాతీయ స్థాయిలో సెక్రటరీగా నియమితులయ్యారు. మరో మూడేళ్ల పాటు మోదీ ఢిల్లీలోనే ఉండిపోయారు. ఆ తర్వాత 2001లో భుజ్‌ భూకంపంలో 20 వేల మంది మృత్యువాత పడగా.. సమర్థంగా విపత్తును నిర్వహించడంలో ఫెయిలయ్యారన్న ఆరోపణలపై  అప్పటి వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న కేశూభాయ్‌ పటేల్‌ను తప్పించిన భాజపా.. నరేంద్రమోదీని తొలి సారి ప్రతక్ష్య రాజకీయాల్లోకి దింపి నేరుగా గుజరాత్‌కు ముఖ్యమంత్రిని చేసింది. 2002లో జరిగిన బైఎలక్షన్‌లో గెలిచిన మోదీ తొలిసారి ఎమ్ఎల్‌ఏ అయ్యారు. గోద్రా అల్లర్ల తర్వాత 2002లో గుజరాత్‌లో జరిగిన మారణకాండలో వెయ్యి మంది వరకూ మృత్యువాత పడగా.. ఆ ఘటన విషయంలో ముఖ్యమంత్రిగా మోదీ వ్యవహారశైలిపై అనేక ఆరోపణలు వచ్చాయి. అవేమీ పట్టించుకోని గుజరాత్‌ ఓటర్లు.. 2002, 2007, 2012లో వరుసగా మోడీని మూడు సార్లు ముఖ్యమంత్రిగా గెలిపించారు. మోడీ తన గుజరాత్‌ అభివృద్ధి ఫార్ములాకు విపరీతంగా ప్రచారం చేసుకోవడం ద్వారా దేశ ప్రజల దృష్టిలో పడ్డారు.

2014 సార్వత్రిక సమరంలో భాజపా సారథిగా మోదీ నియామకం:

 2013లో రాజ్‌నాథ్ సింగ్‌ భాజపా జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించిన వేళ.. ఆయన 2014 సార్వత్రిక సమరానికి నరేంద్రమోదీని సారథిగా ఎంచుకున్నారు. సుడిగాలి పర్యటనలు చేసిన నరేంద్రమోదీ.. తొలిసారి భాజపాను పూర్తి మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. తొలి సారి ప్రధానిగా మే 26, 2014న బాధ్యతలు చేపట్టిన తర్వాత.. నోట్ల రద్దు నిర్ణయంతో నల్లడబ్బుపై సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. అంతే కాకుండా భారత జవాన్ల ప్రాణాలను బలిగొన్న ఘటనలో మన సైన్యం సరిహద్దులు దాటి మరీ ముష్కరుల అంతు చూసే ధైర్యాన్నిచ్చారు. దేశంలోకి డైరెక్ట్‌ ఫారెన్ ఇన్‌వెస్ట్‌మెంట్‌కు అవకాశాలు కల్పించారు. పాకిస్తాన్‌తో సంబంధాలకు తొలుత ప్రాధాన్యం ఇచ్చిన మోదీ.. ఆప్గన్‌ రాజధాని కాబూల్‌ నుంచి నేరుగా ఇస్లామాద్‌కు ఆకస్మిక పర్యటన చేపట్టి నవాజ్‌షరీఫ్‌తో పాటు ఇరు దేశాల ప్రజలను ఆశ్చర్య పరిచారు. ఆ తర్వాత ఆ దేశంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం సహా సరిహద్దుల్లో ముష్కరుల చర్యలతో కఠినంగా వ్యవహరిస్తూ దెబ్బకు దెబ్బతీస్తూ వచ్చారు.

2019 సార్వత్రిక్రం ముందు జమ్ము కశ్మీర్‌లో ఫిబ్రవరి 14న ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేసిన ముష్కరులపై వైమానిక దాడులు నిర్వహించి బాలాకోట్‌లో ఉగ్రస్థావరాలను నేల మట్టం చేశారు.  ఆ తర్వాత పాక్‌ చేసిన దుస్సాహసాన్ని అడ్డుకునే క్రమంలో భారత వింగ్ కమాండర్ అభినందన్‌ వర్దమాన్‌ను సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చే క్రమంలో అంతర్జాతీయంగా పాక్‌పై ఒత్తిడి తీసుకురాగలిగారు. జీఎస్‌టీ సహా అయోధ్య రామమందిర నిర్మాణం విషయంలో సుప్రీం తీర్పు.. ముస్లిం మహిళలకు రక్షణ కల్పిస్తూ తలాక్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. రెండోసారి ప్రధానిగా 2019లో బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆర్టికల్ 370 రద్దు సహా జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించి అక్కడ ఉగ్రవాదాన్ని రెండు జిల్లాలకు పరిమితం చేశారు. ప్రస్తుతం దాన్ని కూడా పూర్తిగా రూపు మాపేందుకు చర్యలు చేపట్టారు. ఎర్రకోటపై ప్రధానిగా ఎన్నికైన నాటి నుండి ఏ విధమైన బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ లేకుండా ప్రసంగాలు చేస్తున్న మోదీ.. ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌లో ఎన్నికల శంఖారావం పూరించేందుకు 42 ఏళ్ల తర్వాత దోడా వెళ్లిన తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ఇప్పుడు మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత.. వన్‌నేషన్‌-వన్‌ ఎలక్షన్ సహా యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ దిశగా చర్యలు ముమ్మరం చేశారు. మొదటి రెండు సార్లు ప్రధానిగా ఎన్నికైనప్పుడు భాజపా పూర్తి మెజారిటీ సాధించగా ఈ సారి మాత్రం సంకీర్ణ ప్రభుత్వాన్ని మిత్ర పక్షాలపై ఆధారపడి ఏర్పాటు చేసింది.

            మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఈ 11 ఏళ్ల వ్యవధిలో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం సహా ప్రపంచ యవనికపై భారత్‌కు ప్రత్యేక స్థానం కల్పించారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా గతంలో మాదిరిగా ఖండనలతో ఆగకుండా.. సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించే స్థాయికీ భారత్‌ను మోదీ చేర్చడంలో అతడు అనుసరిస్తున్న విదేశీ విధానం ప్రముఖ పాత్ర పోషిస్తంది. అటు ప్రజాదరణలోనూ ప్రపంచ వ్యాప్త లీడర్లలో రెండో స్థానంలో ఉంటున్నారు. ప్రస్తుతం 74వ పడిలోకి వచ్చిన మోదీ.. ఇప్పటికీ భాజపాకు దేశవ్యాప్తంగా అత్యంత ఛరిష్మా ఉన్న నేతగానే కొనసాగుతున్నారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
Embed widget