(Source: ECI/ABP News/ABP Majha)
Top 10 Headlines Today: ఆదిపురుష్ ఎలా ఉంది? తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది? టాప్ టెన్ మార్నింగ్ న్యూస్‌లో చూడండి
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
అమిత్ షా, చంద్రబాబు భేటీలో అసలేం జరిగింది ?
అసలు ఆ రోజు ఏం జరిగింది.. ? తెలుగు రాజకీయాలను ఫాలో అయ్యే వారందరికీ ఇప్పుడు అదే డౌట్. జూన్ 3 వ తేదీ చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఏదో జరిగింది. అందకే తెలుగు రాజకీయ క్షేత్రంలో అంతటి మార్పు. దానిని అన్ని పార్టీల వాళ్లూ రకరకాలుగా అన్వయించుకుంటున్నారు. బీజేపీ మా నుంచి దూరం అయిందని వైసీపీ చెప్పగానే అంతా టీడీపీకి చేరువైందేమో అనుకుంటున్నారు. కానీ ఏపీ పొలిటికల్ సీన్ అలా కనిపించడం లేదు. అసలు ఏం జరిగి ఉండటానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
బండి సేఫ్
తెలంగాణ బీజేపీలో నెలకొన్న డైలమాకు ఆ పార్టీ హైకమాండ్ తెర దించింది. బండి సంజయ్ నే పార్టీ అధ్యక్షుడుగా ఉంటారని.. ఆయనను మార్చేది లేదని మరోసారి ఖరాఖండిగా తేల్చేసింది. నిజానికి గత నెల రోజుల వ్యవధిలో ఇలా చెప్పడం రెండో సారి. పదే పదే ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. తెలంగాణ బీజేపీలో పరిస్థితులు అలా ఉన్నాయి మరి. గతంలో యాక్టివ్ గా పాదయాత్రలు చేసిన బండి సంజయ్.. ఇప్పుడు నెమ్మదించారు. పెద్దగా కార్యక్రమాలు చేపట్టడం లేదు. అదే సమయంలో ఆయనకు బదులుగా మరొకరికి చాన్సివ్వాలని బలమైన నేతల వర్గం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నిస్తోంది. లేకపోతే వారంతా పార్టీ మారుతారన్న ప్రచారంతో బీజేపీలో గందరగోళం ఏర్పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వాన జల్లులు
దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ మరియు వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం (జూన్ 15) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో వడగాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఈ రోజు అదిలాబాద్, ఖమ్మం, ములుగు, కొమరం భీం , మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, కొత్త గూడెం,సూర్యాపేట, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ మరియు హన్మకొండ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
బపర్‌జోయ్ బీభత్సం
బిపర్జోయ్ తుపాన్ గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జఖౌ తీరాన్ని గురువారం (జూన్ 15) రాత్రి 11.30 గంటలకు తాకింది. తీరాన్ని తాకిన తర్వాత తుపాను వేగం క్రమంగా తగ్గుతూ వస్తోంది. జఖౌ, మాండ్వీ సహా కచ్, సౌరాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు ఈ తుపాను రాజస్థాన్ వైపు కదులుతోంది. ఇక్కడ గాలుల వేగం గంటకు 75 నుంచి 85 కిలోమీటర్లు ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కిమ్ జాంగ్ ఉన్ టెన్షన్
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరోసారి పొరుగు దేశాలను టెన్షన్ పెడుతున్నారు. ఉన్నట్టుండి ఓ బాలిస్టిక్ మిజైల్‌ని లాంఛ్ చేసినట్టు జపాన్‌తో పాటు దక్షిణ కొరియా వెల్లడించింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిద వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వైరం పెరుగుతూ వస్తోంది. తరచూ క్షిపణులను ప్రయోగిస్తూ దక్షిణ కొరియాను కవ్విస్తున్నారు కిమ్. యుద్ధానికి రెడీగా ఉండండి అంటూ సైనికులకు పిలుపు కూడా ఇచ్చారు. ఇలాంటి తరుణంలో మరోసారి బాలిస్టిక్ మిజైల్‌ని లాంఛ్ చేయడంపై దక్షిణ కొరియా అసహనం వ్యక్తం చేస్తోంది. అటు జపాన్ కూడా టెన్షన్ పడుతోంది. ఈ క్షిపణికి సంబంధించిన సమాచారాన్ని వీలైనంత త్వరగా అందించాలని అధికారులకు ఆర్డర్ వేశారు కిషిద. జపాన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవాలని తేల్చి చెప్పారు. అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. ఈ మధ్యే అమెరికా, దక్షిణ కొరియా కలిసి పెద్ద ఎత్తున ఫైర్ డ్రిల్స్ చేపట్టాయి. అప్పటి నుంచి ఉత్తర కొరియా ఇలా కవ్విస్తోంది. గత నెల ఓ స్పై మిజైల్‌ని పంపేందుకూ ప్రయత్నం చేసి విఫలమైంది. అప్పటి నుంచి మరింత అసహనంగా ఉన్నారు కిమ్. ఎలాగైనా అమెరికాని, దక్షిణ కొరియాను భయపెట్టాలని చూస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
అరణ్య కాండఋ+ యుద్ధ కాండ= ఆదిపురుష్
వాల్మీకి రాసిన రామాయణంలో అరణ్య కాండ, యుద్ధ కాండ ఆధారంగా రూపొందిన సినిమా 'ఆదిపురుష్' (Adipurush Movie). రాఘవునిగా ప్రభాస్ (Prabhas), జానకిగా కృతి సనన్, లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
‘యాషెస్’రణరంగం
ప్రపంచ క్రికెట్‌లో భారత్ - పాకిస్తాన్‌కు ఉండే క్రేజే వేరు. అయితే దాయాదుల సమరం మొదలై మహా అయితే ఏడు దశాబ్దాలు. కానీ అంతకు ఏడు దశాబ్దాల మందే క్రికెట్‌లో అగ్రరాజ్యాలైన ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియాల మధ్య ‘యాషెస్’రణరంగం మొదలైంది. 1882 నుంచి సాగుతున్న ఈ ‘బూడిద’ సమరం మరోసారి అభిమానులకు అసలైన టెస్టు క్రికెట్ సమరాన్ని పంచడానికి సిద్ధమైంది. గతంలో కంటే ఈసారి ఈ సిరీస్ మరింత రసవత్తరంగా సాగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
గోల్డెన్ ఛాన్స్
బంగారాన్ని చౌకగా కొనుగోలు చేయాలనుకుంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక సువర్ణావకాశం తీసుకొచ్చింది. RBI సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ కింద తక్కువ ధరకే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్గం ఇది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు అయింది. ఉపా చట్టం (Unlawful Activities (Prevention) Act) 2022 కింద గత ఏడాది ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది. ఇదే కాక ఆయుధాల చట్టం, సెక్షన్ 10 కింద కేసులు నమోదు అయ్యాయి. హరగోపాల్‌తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులు ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
డేట్ ఫిక్స్