TS Gurukula Jobs: గురుకులాల్లో 9,210 పోస్టుల పరీక్ష తేదీలు ఖరారు! ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
తెలంగాణలోని గురుకులాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీలను గురుకుల విద్యాలయాల సంస్థ ఖరారు చేసింది. ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల నియామక పరీక్ష నిర్వహించనున్నారు.
![TS Gurukula Jobs: గురుకులాల్లో 9,210 పోస్టుల పరీక్ష తేదీలు ఖరారు! ఎగ్జామ్స్ ఎప్పుడంటే? ts gurukula recruitment board announced teaching posts exams dates, check details here TS Gurukula Jobs: గురుకులాల్లో 9,210 పోస్టుల పరీక్ష తేదీలు ఖరారు! ఎగ్జామ్స్ ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/17/bf539af6cc433e96bd17373f97f5244a1681705689996522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
క్ర.సం. | పోస్టు పేరు | పోస్టుల సంఖ్య |
1. | డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్ | 868 |
2. | జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ | 2008 |
3. | పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) | 1276 |
4. | ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) | 4020 |
5. | లైబ్రేరియన్ స్కూల్ | 434 |
6. | ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్ | 275 |
7. | డ్రాయింగ్ టీచర్స్ ఆర్ట్ టీచర్స్ | 134 |
8. | క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ క్రాఫ్ట్ టీచర్స్ | 92 |
9. | మ్యూజిక్ టీచర్స్ | 124 |
మొత్తం ఖాళీలు | 9210 |
Also Read:
గురుకుల పోస్టుల దరఖాస్తుల సవరణ, ఈ తేదీల్లోనే అవకాశం!
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల విద్యాలయాల సొసైటీ పరిధిలో 9,231 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అర్హత గల అభ్యర్థుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. అయితే అభ్యర్థులకు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది గురుకుల నియామక బోర్డు. అభ్యర్థులు ఒకసారి మాత్రమే తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసిన దరఖాస్తులను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాని సూచించారు.
దరఖాస్తుల సవరణ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 35 జూనియర్ ఇంజినీర్ పోస్టులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 65 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ (సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)