TREIRB: గురుకుల పోస్టుల దరఖాస్తుల సవరణ, ఈ తేదీల్లోనే అవకాశం?
గురుకుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది గురుకుల నియామక బోర్డు. అభ్యర్థులు ఒకసారి మాత్రమే తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు.
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల విద్యాలయాల సొసైటీ పరిధిలో 9,231 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అర్హత గల అభ్యర్థుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. అయితే అభ్యర్థులకు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది గురుకుల నియామక బోర్డు. అభ్యర్థులు ఒకసారి మాత్రమే తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసిన దరఖాస్తులను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాని సూచించారు.
దరఖాస్తుల సవరణ షెడ్యూలు ఇలా..
➥ జూనియర్ లెక్చరర్స్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరీయన్, పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు జూన్ 14 నుంచి 19వ తేదీ మధ్యలో తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
➥ డిగ్రీ కాలేజీలకు సంబంధించిన లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరీయన్, లైబ్రరీయన్(స్కూల్స్), ఫిజికల్ డైరెక్టర్(స్కూల్స్), డ్రాయింగ్, ఆర్ట్ టీచర్లు, క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు జూన్ 20 నుంచి 24 మధ్యలో ఎడిట్ చేసుకోవచ్చు.
➥ టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూన్ 25 నుంచి 30వ తేదీ మధ్యలో తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి.
ఇక గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి. గురుకుల జూనియర్ కాలేజీల్లో పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు, పీజీటీ పోస్టులకు ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు, మిగతా పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించింది. రాతపరీక్షల ద్వారా నియామకాలు చేపట్టనున్నారు.
Also Read:
జూన్ 14 నుంచి పోలీసు అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇవి ఉండాల్సిందే!
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నిర్వహించనున్న ధ్రువపత్రాల పరిశీలన తేదీలను పోలీసు నియామక మండలి ఖరారుచేసిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అభ్యర్థులకు జూన్ 14 నుంచి 26 వరకు సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 కేంద్రాల్లో మొత్తం 1,09,906 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగనుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం కటాఫ్ మార్కులు ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం కటాఫ్ మార్కులు, అభ్యర్థుల రిజర్వేషన్, ఇతర కేసుల వెరిఫికేషన్ పూర్తవ్వగానే ఎంపికైన అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఇంటిమేషన్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని పోలీసు నియామక మండలి ఇప్పటికే సూచించింది. ఈ లెటర్లు జూన్ 11 నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయి.
పూర్తిసమాచారం కోసం క్లిక్ చేయండి..