అన్వేషించండి

TSLPRB: జూన్ 14 నుంచి పోలీసు అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇవి ఉండాల్సిందే!

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అభ్యర్థులకు జూన్‌ 14 నుంచి 26 వరకు సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 కేంద్రాల్లో మొత్తం 1,09,906 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగనుంది.

తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నిర్వహించనున్న ధ్రువపత్రాల పరిశీలన తేదీలను పోలీసు నియామక మండలి ఖరారుచేసిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అభ్యర్థులకు జూన్‌ 14 నుంచి 26 వరకు సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 కేంద్రాల్లో మొత్తం 1,09,906 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగనుంది.

TSLPRB: జూన్ 14 నుంచి పోలీసు అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇవి ఉండాల్సిందే!

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ అనంతరం కటాఫ్‌ మార్కులు ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం కటాఫ్‌ మార్కులు, అభ్యర్థుల రిజర్వేషన్‌, ఇతర కేసుల వెరిఫికేషన్‌ పూర్తవ్వగానే ఎంపికైన అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఇంటిమేషన్‌ లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పోలీసు నియామక మండలి ఇప్పటికే సూచించింది. ఈ లెటర్లు జూన్‌ 11 నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయి. 

దరఖాస్తు వివరాల్లో తప్పుల సవరణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికేట్ల పరిశీలన జరిగే ఆయా తేదీల్లో ఉదయం 9 గంటలకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్రింట్ కాపీని తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కేంద్రంలోనే అప్లికేషన్‌ ఎడిటింగ్‌/మాడిఫై చేసుకునే అభ్యర్థులకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు బోర్డు తెలిపింది. 

ఇవి గమనించండి..

➥ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ద్వారా మార్కుల వెయిటేజీ పొందాలనుకుంటున్న అభ్యర్థులు ఆర్టీఏ ధ్రువీకరించిన సర్టిఫికెట్లను చూపించాలని కోరింది.

➥ వెరిఫికేషన్‌కు వచ్చే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం (జూన్‌ 2, 2014 తర్వాత), బీసీ అభ్యర్థులు నాన్‌ క్రీమిలేయర్‌ సర్టిఫికెట్‌ (2021 ఏప్రిల్‌ 1 తర్వాత), ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు (2021 ఏప్రిల్‌ 1 తర్వాత), ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లు ఒరిజినల్స్‌, జిరాక్స్‌ల సెట్‌ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాల‌ని సూచించింది.

➥ వీటితో పాటుగా ఇంటిమేషన్‌ లెటర్‌, ట్రాన్సాక్షన్‌ ఫామ్‌, పార్ట్‌-2 అప్లికేషన్‌ ప్రింట్‌ అవుట్‌, ఆధార్‌కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, ఏజ్‌ రిలేటెడ్‌, లోకల్‌ కాండిడేచర్‌ రిలేటెడ్‌, రిజర్వేషన్‌ బెనిఫిట్‌ రిలేటెడ్‌, ఏజ్‌ రిలాక్షేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, హారిజంటల్‌ రిజర్వేషన్‌ బెనిఫిట్స్‌ రిలేటెడ్‌ సర్టిఫికెట్లు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని బోర్డు సూచించింది.

తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ మెయిన్ పరీక్షల ఫలితాలు మే 30న వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడటంతో అభ్యర్థులకు శిక్షణ దిశగా పోలీస్‌శాఖ కసరత్తు మొదలుపెట్టింది. తుది రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నేపథ్యం, నేరచరిత్ర గురించి ఆరా తీసి ఎంపికైన వారి తుది జాబితాను నెలాఖరులోపు వెలువరించే అవకాశం ఉంది. తుది ఫలితాలకు సంబంధించి ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, ప్రొహిబిష‌న్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు 98,218; ఎస్‌సీటీ ఎస్ఐ సివిల్ పోస్టుల‌కు 43,708; ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ ఐటీ అండ్ సీవో ఉద్యోగాల‌కు 4,564; ఎస్‌సీటీ ఎస్ఐ ఐటీ అండ్ సీవో పోస్టుల‌కు 729, ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ డ్రైవ‌ర్, డ్రైవ‌ర్ ఆప‌రేట‌ర్ ఉద్యోగాల‌కు 1,779; ఎస్‌సీటీ ఏఎస్ఐ ఎఫ్‌పీబీ ఉద్యోగాల‌కు 1,153; ఎస్‌సీటీ ఎస్ఐ పీటీవో ఉద్యోగాల‌కు 463, ఎస్‌సీటీ పీసీ మెకానిక్ పోస్టుల‌కు 238 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

శిక్షణకు వడివడిగా ఏర్పాట్లు..

తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ మెయిన్ పరీక్షల ఫలితాలు మే 30న వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడటంతో అభ్యర్థులకు శిక్షణ దిశగా పోలీస్‌శాఖ కసరత్తు మొదలుపెట్టింది. తుది రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నేపథ్యం, నేరచరిత్ర గురించి ఆరా తీసి ఎంపికైన వారి తుది జాబితాను నెలాఖరులోపు వెలువరించే అవకాశం ఉంది. ఎంపికైన ఎస్‌ఐ అభ్యర్థులకు రాజా బహద్దూర్‌ వెంకట్రాంరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇక కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి 9 నెలలపాటు శిక్షణ కోసం టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌ శిక్షణ కేంద్రాలు(బీటీసీలు), పోలీస్‌ శిక్షణ కళాశాలలు(పీటీసీలు), నగర శిక్షణ కేంద్రాల(సీటీసీలు) మైదానాల్ని వినియోగించేందుకు పోలీస్‌శాఖ సన్నాహాలు చేస్తోంది. ఐజీ తరుణ్‌జోషి నేతృత్వంలో ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో శిక్షణ విభాగం నిమగ్నమైంది. జులైలో శిక్షణ ప్రారంభించే అవకాశాలున్నాయి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Embed widget