అన్వేషించండి

Top Headlines Today: తక్షణ సాయం కావాలంటున్నతెలంగాణ సీఏం, జనసేనలోకి బాలినేని -మార్నింగ్ టాప్ న్యూస్

Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.

Top 10 Headlines Today: 

1.  తక్షణ సాయం చేయలంటూ కేంద్రానికి రేవంత్ వినతి
తెలంగాణలో వరదల వల్ల భారీ నష్టం సంభవించిందని.. భేషరత్తుగా తక్షణ సాయం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి... కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర బృందంతో భేటీ అయిన రేవంత్‌.. వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని కోరారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. సమగ్ర అంచనాల ప్రకారం తెలంగాణలో రూ.10,032 కోట్ల నష్టం వాటిల్లిందని రేవంత్ అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
2. దెబ్బ మీద దెబ్బ.. జనసేనలోకి బాలినేని..!
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జగన్‌ తనకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారు. బాలినేనితో జగన్‌ గురువారం సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత బాలినేని పార్టీ మారుతారన్న ప్రచారం ఇంకా ఊపందుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
 
3. జగన్‌తో సెల్ఫీ.. పోలీస్‌కు ఛార్జ్‌ మెమో
వైసీపీ చీఫ్‌ జగన్‌తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్‌ అయేషా బానుకు ఉన్నతాధికారులు షాక్‌ ఇచ్చారు. విధి నిర్వహణలో ఉండి జగన్‌తో సెల్ఫీ దిగిన కానిస్టేబుల్‌కు ఛార్జిమెమో ఇస్తామని జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చిన వివరణ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్ జగన్‌తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్‌కు ఛార్జిమెమో ఇవ్వడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని ఆరోపించింది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
4. హైడ్రాను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్
చెరువులు, జలాశయాలు, ప్రభుత్వ భూములను కబ్జా నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాపై హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన జీవో 99 చ‌ట్టబ‌ద్దత‌ను స‌వాల్ చేస్తూ పిటిష‌న్ దాఖ‌లైంది. జీహెచ్ఎంసీ యాక్ట్ కాద‌ని హైడ్రాకు ఎలా అధికారాలు ఇస్తార‌ని లక్ష్మీ అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. పిటిష‌న్‌పై విచారణ జరిపిన జ‌స్టిస్ కే. ల‌క్ష్మణ్.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
5. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు లాభమా..? నష్టమా..?
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బతకడానికి వచ్చారంటూ కౌశిక్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. కౌశిక్‌ మాటలు సూటిగా హైదరాబాద్‌లోని సెటిలర్లకు తగులుతాయనడంలో సందేహం లేదు. అయితే కౌశిక్ రెడ్డి ఆవేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారా లేకపోతే.. పార్టీ స్ట్రాటజీని అమలు చేశారా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. బీఆర్ఎస్ భవిష్యత్తు వ్యూహాలు ఎలా ఉంటాయనే దానిపై అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
6. నేడు ఎయిమ్స్‌కు సీతారాం ఏచూరి పార్థివదేహం అప్పగింత
సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి పార్థివదేహాన్ని ఇవాళ వసంత్ కుంజ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకురానున్నారు. పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు వచ్చి నివాళి అర్పిస్తారు. సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడే మృతదేహాన్ని ఉంచుతారు. సాయంత్రం నాలుగు తర్వాత మృతదేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలిస్తారు.  మరోవైపు చంద్రబాబునాయుడు  ఏచూరిని నివాళులు అర్పించి భావో‌ద్వేగానికి గురయ్యారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
7. హైదరాబాద్‌లో రూ. 700 కోట్ల భారీ మోసం
హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగుచూసింది. ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని డీకేజడ్ టెక్నాలజీస్ అనే సంస్థ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీలు ఇస్తామంటూ ప్రజల నుంచి ఏకంగా రూ. 700 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. తెలంగాణతోపాటు మరో రెండు రాష్ట్రాల్లోనూ ఈ సంస్థ డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లోనే 18వేల మంది ఈ సంస్థలో పెట్టుబడి పెట్టారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
8. కొతి వ్యాధికి మందు దొరికింది
 ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మంకీ ఫాక్స్‌కు వ్యాక్సిన్ కనిపెట్టారు. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని ముందుగా ఆఫ్రికా దేశంలో అమల్లోకి తీసుకురానున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
9. దుమ్మురేపుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు
అనంతపురంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు ఆసక్తిగా సాగుతున్నాయి. ప్రస్తుతానికి ఇండియా ఏ, ఇండియా బీ టీమ్‌లు పైచేయి కనిపిస్తోంది. ఇవాళ మ్యాచ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
10. చాలామందితో రిలేషన్‌లో ఉన్నా: రెజీనా
ప్రముఖ నటి రెజీనా సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను సీరియల్ డేటర్‌ని అని... చాలా మందితో రిలేషన్‌లో ఉన్నా అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఉత్సవం‘ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసింది. తాను చాలా మందితో రిలేషన్‌లో ఉన్నానని.. చాలా ప్రపోజల్స్ కూడా ఉన్నాయని.. తాను ఓ సీరియల్ డేటర్‌ని అని ఆమె చెప్పారు. కొంత కాలంగా రిలేషన్ షిప్ కు బ్రేక్ ఇచ్చానని... ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్ లో లేనన్నారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget