అన్వేషించండి
Advertisement
Morning Top 10 News: వైసీపీ అధినేత జగన్ మాస్టర్ ప్లాన్, కర్ణాటక రాజకీయాలలో కీలక మలుపు వంటి టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Top 10 News :
1.వైసీపీ అధినేత జగన్ ప్లాన్
వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన నేతల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ నియోజవవర్గాల నుంచి క్యాడర్ ను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. జిల్లాలకు పార్టీ అధ్యక్షుల్ని కూడా నియమిస్తున్నారు. వీలైనంత వరకూ సీనియర్ నేతల్ని నియమిస్తున్నారు. అందర్నీ యాక్టివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జనవరిలో నుంచి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ లోపు పార్టీ కార్యకర్తలకు, క్యాడర్ కు నమ్మకం కలిగించేందుకు గుడ్ బుక్ ప్రస్తావన పార్టీ కోసం కష్టపడిన వారందర్నీ గుర్తుంచుకుంటామని గుడ్ బుక్‌లో పేర్లు రాసుకుని అధికారంలోకి రాగానే మేలు చేస్తామని హామీ ఇస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. ఏపీకి మరో తుఫాను ముప్పు
ఏపీకి మరోసారి తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమంగా తుఫానుగా బలపడి రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో ఈ నెల 15 నాటికి తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. మహిషాసురమర్దనిగా కనకదుర్గమ్మ
విజయవాడ ఇంద్రకీలాద్రీపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజున నేడు(శుక్రవారం) శ్రీ మహిషాసురమర్దనిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి తొమ్మిది అవతారాల్లో మహిషాసురమర్దనిని మహోగ్రరూపంగా భావిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. ఆమ్రపాలికి కేంద్రం షాక్
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రపాలికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఆమ్రపాలితోపాటు తెలంగాణ కేడర్ కావాలనే 11 మంది ఐఏఎస్‌ల విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. ఈ 11 మందిలో ఆమ్రపాలితోపాటు విద్యుత్ శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్ కూడా ఉన్నారు. వీరందరూ తమకు తెలంగాణ కేడర్ కావాలని కేంద్రంలోని డీవోపీటీ శాఖకు గతంలో దరఖాస్తు చేసుకోగా, వీరి విజ్ఞప్తిని తాజాగా కేంద్రం తోసిపుచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
5. గొలుసు మింగిన చిన్నారి.. కాపాడిన వైద్యులు
ఆదిలాబాద్ జిల్లాలో 7 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు కాలిపట్టి గొలుసు మింగేసింది. గొలుసు గొంతులో ఇరుక్కుని ఊపిరాడక ఇబ్బందులు ఎదుర్కొంది. వైద్యులు చిన్నారికి చికిత్స చేసి గొలుసును బయటకు తీశారు. గుడిహత్నూర్‌కు చెందిన సత్యపాల్ కూతురు ధ్రుతి కాలికి ఉన్న వెండి పట్టగొలుసును నొట్లో పెట్టుకోవడంతో గొంతులో ఇరుక్కుపోయింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్యులు ఆపరేషన్ చేసి గొలుసు బయటకు తీశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6. రతన్ టాటాకు వీడ్కోలు పలికిన 'గోవా'
ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్(NCPA)లో రతన్ టాటా ప్రియమైన పెంపుడు కుక్క గోవా పారిశ్రామికవేత్తకు తన చివరి నివాళులు అర్పించింది. రతన్ టాటా గోవాను తన ఆఫీస్ మేట్ అని ప్రేమగా పిలిచేవారు. కాగా గత 11 ఏళ్లుగా టాటా నివాసంలో ఈ వీధి కుక్క'గోవా' నివసిస్తుండటం గమనార్హం. కాగా దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8. కర్ణాటక రాజకీయాలలో కీలక మలుపులు
కర్ణాటకలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. . సిద్ధరామయ్య ముడా స్కాంలో ఇరుక్కున్నారు. ఆ రాజకీయ దుమారం ఆగాక పోవడంతో సీఎం మార్పు ఖాయమంటూ సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా హనీ ట్రాప్ అంశం తెరపైకి వచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కర్ణాటకలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. . సిద్ధరామయ్య ముడా స్కాంలో ఇరుక్కున్నారు. ఆ రాజకీయ దుమారం ఆగాక పోవడంతో సీఎం మార్పు ఖాయమంటూ సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా హనీ ట్రాప్ అంశం తెరపైకి వచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9. 13న నారా రోహిత్ నిశ్చితార్థం
టాలీవుడ్ హీరో నారా రోహిత్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13న హైదరాబాద్‌లో రోహిత్ నిశ్చితార్థం జరగనున్నట్లు సమాచారం. ప్రతినిధి-2 లో హీరోయిన్‌గా నటించిన సిరి లేళ్లను రోహిత్ పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10. పాక్‌తో టెస్టులో ఇంగ్లాండ్ ఊచకోత
పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌ను 823/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోరు. తొలి స్థానంలో శ్రీలంక 952/6 డిక్లేర్(ఇండియా) ఉండగా, ఇంగ్లాండ్ 903/7 డిక్లేర్(ఆస్ట్రేలియా), ఇంగ్లాండ్ 849(వెస్టిండీస్), 823/7 డిక్లేర్(పాకిస్థాన్) ఉన్నాయి. బ్యాటింగ్‌లో హ్యారీ బ్రూక్ 317, జో రూట్ 262 రన్స్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10. రిటైర్మెంట్ ప్రకటించిన రాఫెల్ నాదల్
స్పెయిన్ స్టార్, టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ రాఫెల్ నాదల్ రిటైర్మెంట్ ప్రకటించారు. వచ్చే నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్పే తనకు చివరి సిరీస్ అని సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్టు చేశారు. 2001లో అంతర్జాతీయ టెన్నిస్‌లోకి అరంగేట్రం చేసిన రాఫెల్.. 22సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌గా నిలిచారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement