
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'మిరాయ్' ఆడియో రైట్స్ అదిరిపోయే ధరకు అమ్ముడయ్యాయని సమాచారం.

'హనుమాన్' మూవీతో ఓవర్ నైట్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా. ఆయన హీరోగా నటిస్తున్న తాజా ఫాంటసీ యాక్షన్ డ్రామా 'మిరాయ్'. తాజాగా ఈ సినిమా ఆడియో రైట్స్ సాలిడ్ ధరకు అమ్ముడైనట్టు సమాచారం.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ 'మిరాయ్'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో తేజ సజ్జ ఒక పవర్ ఫుల్ యోధుడిగా నటించబోతున్నారు. ఇదివరకే ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్ తో పాటు తేజ లుక్ సినిమాపై మరింత కుతూహలాన్ని పెంచింది. తేజ సజ్జా కెరీర్ లోనే 'మిరాయ్' మూవీ ట్రెండ్ సెట్టర్ గా మారుతుందని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు.
కథతో పాటు విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ అన్నీ కూడా తెరపై సినిమా విజువల్ వండర్ గా ఉంటుంది అనిపించేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది 2డి, 3డి ఫార్మాట్ లలో, పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే 'మిరాయ్' సినిమాకు సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. ఈ మూవీ ఆడియో రైట్స్ ను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టిప్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ డీల్ రూ.2.75 కోట్ల రూపాయలకు కుదిరినట్టు టాక్ నడుస్తోంది. సినిమా పాన్ ఇండియా పరిధి, నిర్మాణ విలువలు, మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరా, హీరో క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని... ఆడియో రైట్స్ కు ఈ సాలిడ్ డీల్ కుదిరిందని భావిస్తున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి 'హనుమాన్' మూవీకి అద్భుతమైన సంగీతం అందించారు. ఇక 'మిరాయ్' స్టోరీతో పాటు మ్యూజిక్ పరంగా కూడా సరికొత్తగా ఉండబోతుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే మూవీకి సంబంధించి విడుదలైన మొదటి గ్లింప్స్ నుంచి పాటల మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీలో బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ ని టిప్స్ మ్యూజిక్ సంస్థ సొంతం చేసుకోవడంతో 'మిరాయ్' మూవీపై మరింత బజ్ ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే... ఇందులో టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ విలన్ గా నటించబోతున్నారు. ఇక గ్లింప్స్ లో తేజ సూపర్ యోధగా నటించగా, బిజీఎమ్ గూస్ బంప్స్ తెప్పించింది. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ బ్యూటీ 'అశోక వనంలో అర్జున కళ్యాణం' మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఆమె చేస్తున్న సెకండ్ మూవీ 'మిరాయ్' పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఆడియో రైట్స్ పరంగా అదిరిపోయే డీల్ కుదుర్చుకున్న 'మిరాయ్' రిలీజ్ అయితే ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.
Also Read: శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీలో హీరో ఎవరు? నాని లేదా నాగ చైతన్య... ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

