అన్వేషించండి

Akhil Akkineni: శ్రియా భూపాల్‌తో అఖిల్ అక్కినేని ఎంగేజ్‌మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో తెలుసా?

Akhil Shriya Bhupal Engagement: అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జైనాబ్ రావ్‌డ్జీ అనే అమ్మాయితో జరిగిన విషయం తెలిసిందే. మరి గతంతో జరిగిన అఖిల్, శ్రియా భూపాల్ నిశ్చితార్థం ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో తెలుసా?

అక్కినేని వారసులు ఇద్దరూ వరుసగా పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు శోభిత ధూళిపాళతో నాగ చైతన్య డిసెంబర్లో పెళ్లికి సిద్ధమవుతుంటే... మరోవైపు ఆయన సోదరుడు అఖిల్ అక్కినేని కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నాడు. నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ని సీక్రెట్ గా జరిపించిన అక్కినేని ఫ్యామిలీ... ఆ తర్వాత విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇక తాజాగా అఖిల్ ఎంగేజ్మెంట్ ను కూడా సైలెంట్ గా కానిచ్చేసి, ఆ తర్వాత నాగార్జున సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. ఇప్పటికే అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జైనాబ్ రావ్‌డ్జీ అనే అమ్మాయితో జరిగింది. అయితే అసలు ఆమె ఎవరు అన్న విషయం సస్పెన్స్ గా మారింది. దీంతో అఖిల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే విషయంపై ఆరా తీయడం మొదలుపెట్టారు.

జైనాబ్ హైదరాబాద్ అమ్మాయి. కానీ, తెలుగువారు మాత్రం కాదు. ఆ కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, వ్యాపార లింకులైతే బాగానే ఉన్నాయి. జైనాబ్ తండ్రి జుల్ఫీ రావ్‌డ్జీతో ఏపీ ప్రభుత్వంలో జగన్ సలహాదారుగా పని చేశారు. అంతే కాకుండా వ్యాపారంలో నాగార్జునతో పాటు నిమ్మగడ్డ ప్రసాద్, అఖిల్ కి కాబోయే భార్యకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారని సమాచారం. అలా ఏర్పడిన వీళ్ళ పరిచయం పెళ్లికి దారితీసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు అఖిల్ మొదటి పెళ్లి ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఎందుకు ఆగిపోయింది? అనేది చర్చనీయాంశంగా మారింది.

నాగ చైతన్య - సమంత పెళ్లికి ముందే అక్కినేని అఖిల్ కూడా నిశ్చితార్థం చేసుకున్నాడు. 2016లో ఫ్యాషన్ డిజైనర్ అండ్ జీవికే రెడ్డి మనవరాలు అయిన శ్రియా భూపాల్ తో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. కానీ నిశ్చితార్థం జరిగిన కొన్ని నెలల్లోనే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. నిజానికి ఈ జంట పెళ్లిని అప్పట్లో ఇటలీలో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ గా ప్లాన్ చేశారు. దురదృష్టవశాత్తు వీరి బంధం పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయింది. అయితే ఇప్పుడు అక్కినేని అఖిల్ రెండవసారి ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో మొదటిసారి ఎందుకు శ్రియాతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారనే వార్త మరోసారి తెరపైకి వచ్చింది.

Also Read: పుష్ప 2 చూసిన అల్లు అరవింద్... ఆయన రియాక్షన్, రివ్యూ ఏమిటంటే?

అయితే అప్పట్లో ఎంగేజ్మెంట్ పూర్తయ్యాక హైదరాబాద్ విమానాశ్రయంలో అఖిల్, శ్రియా మధ్య ఓ పెద్ద గొడవ జరిగిందని, ఆ గొడవ కారణంగా వీళ్ళిద్దరూ పెళ్లికి ముందే విడిపోవలసి వచ్చిందని వార్తలు వచ్చాయి. నిజానికి ఇరు కుటుంబాల సభ్యులు రంగంలోకి దిగి, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినప్పటికీ... వారిద్దరూ మనసు మార్చుకోకపోవడంతో చేతులెత్తేసారని టాక్ నడిచింది. అంతేకాకుండా అప్పట్లో అఖిల్ కి 22 ఏళ్ళు కాగా, శ్రియాకి 26 ఏళ్లు. ఇలా ఏజ్ గ్యాప్ కారణంగా చివరి నిమిషంలో ఈ పెళ్లి ఆగిపోయిందని మరో పుకారు షికారు చేసింది. మరి అసలు విషయం ఏంటి అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మొత్తానికి విడిపోయాక అటు శ్రియా యూఎస్ కు వెళ్ళిపోయింది, ఇటు అఖిల్ సినిమాలపై ఫోకస్ చేశాడు.

Read Also : Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల  వద్ద భారీగా పోలీసులు
కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు
Anantapuram News: సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
Saif Ali Khan: పటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?
పటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?
Hindenburg Research : హిండెన్ బర్గ్ మూసివేత - ఫౌండర్ సంచలన ప్రకటన, సవాళ్లలోనూ ఉత్సాహంగా పని చేశామని లేఖ
హిండెన్ బర్గ్ మూసివేత - ఫౌండర్ సంచలన ప్రకటన, సవాళ్లలోనూ ఉత్సాహంగా పని చేశామని లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Saif Ali Khan | బాలీవుడ్ బడా హీరోలు టార్గెట్ గా హత్యాయత్నాలు | ABP DesamISRO SpaDEX Docking Successful | అంతరిక్షంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఇస్రో ఉపగ్రహాలు | ABP DesamKTR Attended ED Enquiry | ఫార్మూలా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్ | ABP DesamAttack on Saif Ali khan | సైఫ్ అలీఖాన్ పై కత్తిదాడి..తీవ్రగాయాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల  వద్ద భారీగా పోలీసులు
కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు
Anantapuram News: సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
Saif Ali Khan: పటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?
పటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?
Hindenburg Research : హిండెన్ బర్గ్ మూసివేత - ఫౌండర్ సంచలన ప్రకటన, సవాళ్లలోనూ ఉత్సాహంగా పని చేశామని లేఖ
హిండెన్ బర్గ్ మూసివేత - ఫౌండర్ సంచలన ప్రకటన, సవాళ్లలోనూ ఉత్సాహంగా పని చేశామని లేఖ
SpadeX: అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ - ఇస్రో మరో ఘనత, నాలుగో దేశంగా భారత్
అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ - ఇస్రో మరో ఘనత, నాలుగో దేశంగా భారత్
Nimmala Ramanaidu : సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి - సామాన్య రైతులా పొలం పనులు, వ్యవసాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి అని వెల్లడి
సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి - సామాన్య రైతులా పొలం పనులు, వ్యవసాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి అని వెల్లడి
Smartphone Tips: స్మార్ట్ ఫోన్లు ఎక్కువ రోజులు వాడాలంటే ఇలా చేయాల్సిందే - ఈ ఐదు పనులు అంత ముఖ్యం!
స్మార్ట్ ఫోన్లు ఎక్కువ రోజులు వాడాలంటే ఇలా చేయాల్సిందే - ఈ ఐదు పనులు అంత ముఖ్యం!
KTR: 'కాంగ్రెస్ పెడుతున్న కేసులు మా ఘనతను తుడిచేయలేవు' - ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్
'కాంగ్రెస్ పెడుతున్న కేసులు మా ఘనతను తుడిచేయలేవు' - ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్
Embed widget