అన్వేషించండి

Karnataka : హనీట్రాప్‌లు, సీక్రెట్ భేటీలు, సీఎంపై కేసులు - కర్ణాటకలో ప్రభుత్వ మార్పునకు సమయం దగ్గర పడిందా ?

BJP: కర్ణాటక రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. బీజేపీ నేతలు ఆపరేషన్ కమల్‌ అమలు చేస్తున్నారన్న అనుమానాలు కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతున్నాయి.

Karnataka politics is taking a turning point :  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ఆ పార్టీకి కాస్త ధైర్యం ఇచ్చిన రాష్ట్రం కర్ణాటక. తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ముందుగా రాజును బలహీనం చేస్తున్న  బీజేపీ.. తర్వాత  సైన్యాధిపతులను టార్గెట్ చేస్తూ వస్తోంది. సిద్ధరామయ్య ముడా స్కాంలో ఇరుక్కున్నారు. ఆ స్థలాలన్నీ వెనక్కి ఇచ్చేసి బయటపడాలని అనుకుంటున్నారు కానీ.. రాజకీయ దుమారం  ఆగేలా లేదు. పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అదే సమయంలో సీఎం మార్పు ఖాయమంటూ సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో హనీ ట్రాప్ అంశంపై కూడా తెరపైకి వచ్చింది. 

సమస్యల్లో సిద్దరామయ్య - పక్క చూపుల్లో  కాంగ్రెస్ నేతలు

సీఎం సిద్దరామయ్యపై లోకాయుక్త విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌కు కష్టాలు ప్రారంభమయ్యాయి. అది రోజు రోజుకు  పెను వివాదంగామారింది. చివరికి  ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఆయన తనను తాను కాపాడుకునే పరిస్థితుల్లో ఉండటంతో మరో వైపు బీజేపీ ఆపరేషన్ కమల్ ప్రారంభించిందన్న ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ సారి ఢిల్లీ వెళ్లినప్పుడు  బీజేపీ పెద్దల్ని కలిసినట్లుగా ప్రచారం జరిగింది. దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరణ ఇవ్వడానికి రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తూంటే అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణిగినట్లుగా ఉన్నా.. నివురుగప్పిన నిప్పులానే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు జరుపుతున్న సీక్రెట్ సమావేశాలతో వెల్లడవుతూనే ఉంది. 

హుదూద్‌ కంటే వంద రెట్ల విధ్వంసం సృష్టించిన మిల్టన్ - ఫ్లోరిడా పరిస్థితి ఎలా ఉందో చూశారా ?

తాజాగా హనీ ట్రాప్ అంటూ తెరపైకి మహిళ

కర్ణాటక రాజకీయాల్లో హనీ ట్రాప్‌కు ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. గతంలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి  ఈ హనీ ట్రాపే కారణం. సీనియర్ మంత్రి ఒకరు ఇలాంటి ట్రాప్ లో ఇరుక్కుని  రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత చాలా సీడీలు ఉన్నాయని ప్రచారం జరిగినా  చివరికి ఏవీ  బయటకు రాలేదు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారిపోయారు. ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు మరో మహిళ బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరు ముఖ్య నేతలు హనీ ట్రాప్‌లో ఇరుక్కున్నారని బీజేపీ నేతలు రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తే వారికి ఇస్తానని చెప్పారు. ఆమె నిజంగా చెప్పిందా లేకపోతే రాజకీయమా అన్నది క్లారిటీ లేదు. కానీ  అందులో ఏదైనా మ్యాటర్ ఉంటే మాత్రం రానున్న రోజుల్లో సంచలనం ఖాయమనుకోవచ్చు. 

సానియా మీర్జా పెళ్లి మరోసారి పాకిస్థానీతోనే అయిపోయిందా ? అసలు నిజం ఏమిటంటే ?

కాంగ్రెస్‌లో కుమ్ములాటలతో బీజేపీ రాజకీయం

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం బీజేపీకి ఇష్టం లేదని అనుకోవచ్చు. ముఖ్యమంత్రి మార్పు చర్చల్లో కాంగ్రెస్ నేతలు చాలా మంది తమకే సీఎం పదవి అని లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరికి వారు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుంటున్నారు. బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. వీరిలో ఒకరైనా బీజేపీ వైపు కొంత మంది ఎమ్మెల్యేలతో వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిక్కులు ఏర్పడతాయి. అదే సమయంలో కర్ణాటకలో ఆపరేషన్ కమల్ నిర్వహించడంలో బీజేపీ చాలా సార్లు సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా అలాంటిదే నిర్వహిస్తే ఫెయిలయ్యే అవకాశం లేకుండా చూసుకుంటుంది. అందుకే కర్ణాటకలో ఏం జరుగుతుందా అన్న ఆసక్తి దేశమంతా వ్యక్తమవుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan : క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
Central Taxes: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
Weather Update: బంగాళాఖాతంలో తుపాను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది,ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి?
బంగాళాఖాతంలో తుపాను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది,ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి?
Ratan Tata: రతన్ టాటాకు శునకం 'గోవా' కన్నీటి వీడ్కోలు - పార్థీవ దేహం వద్ద వేదనతో!, వైరల్ వీడియో
రతన్ టాటాకు శునకం 'గోవా' కన్నీటి వీడ్కోలు - పార్థీవ దేహం వద్ద వేదనతో!, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata News: అంత పెద్ద రతన్ టాటాకు చిన్న కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్Ratan Tata: రతన్ టాటా మృతిపై స్పందించిన మాజీ గర్ల్‌ ఫ్రెండ్Ratan Tata Last Post: సోషల్ మీడియాలో రతన్ టాటా లాస్ట్ పోస్ట్ ఇదేRatan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan : క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
Central Taxes: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
Weather Update: బంగాళాఖాతంలో తుపాను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది,ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి?
బంగాళాఖాతంలో తుపాను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది,ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి?
Ratan Tata: రతన్ టాటాకు శునకం 'గోవా' కన్నీటి వీడ్కోలు - పార్థీవ దేహం వద్ద వేదనతో!, వైరల్ వీడియో
రతన్ టాటాకు శునకం 'గోవా' కన్నీటి వీడ్కోలు - పార్థీవ దేహం వద్ద వేదనతో!, వైరల్ వీడియో
Telugu States IAS IPS : కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
BYD eMAX 7: వావ్ అనిపిస్తున్న బీవైడీ కొత్త కారు - సింగిల్ ఛార్జింగ్‌తో ఎంత రన్ అవుతుంది?
వావ్ అనిపిస్తున్న బీవైడీ కొత్త కారు - సింగిల్ ఛార్జింగ్‌తో ఎంత రన్ అవుతుంది?
Dussehra 2024: జీవితంలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారా..అయితే ఉపశమనం కోసం ఈ స్తోత్రం పఠించండి!
జీవితంలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారా..అయితే ఉపశమనం కోసం ఈ స్తోత్రం పఠించండి!
Viswam Twitter Review - 'విశ్వం' ట్విట్టర్ రివ్యూ: యాక్షన్ సీన్లలో బోయపాటిని గుర్తు చేసిన వైట్ల - మరి ట్రైన్ ఎపిసోడ్, గోపీచంద్ యాక్షన్?
'విశ్వం' ట్విట్టర్ రివ్యూ: యాక్షన్ సీన్లలో బోయపాటిని గుర్తు చేసిన వైట్ల - మరి ట్రైన్ ఎపిసోడ్, గోపీచంద్ యాక్షన్?
Embed widget