అన్వేషించండి

Dussehra 2024: జీవితంలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారా..అయితే ఉపశమనం కోసం ఈ స్తోత్రం పఠించండి!

Navratri 2024: శరన్నవరాత్రుల్లో తొమ్మిదోరోజు మహర్నవమి. ఈ రోజు అమ్మవారు మహిషాసుర మర్ధినిగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ రోజు మహిషాసుర మర్ధిని స్తోత్రాన్ని పఠిస్తే ఎన్నో శుభఫలితాలు పొందుతారు...

Mahishasura Mardhini Stotram : మహిషాసుర మర్ధిని స్తోత్రాన్ని భగవత్ స్వరూపులైన ఆది శంకరాచార్యులు రచించారు. మహిషాసురుడిని సంహరించేందుకు దేవతలంతా తమ శక్తులను మిళితం చేసి దుర్గను సృష్టించారు. త్రిమూర్తులు, పంచభూతాలు, మిగిలిన దేవుళ్లంతా తమ తేజస్సుని, ఆయుధాలను అమ్మవారికి ఇచ్చారు. మహిషాసురుడి సంహారం అనంతరం అమ్మవారిని ఆదిశంకరులు మహిషాసుర మర్దిని స్తోత్రంతో స్తుతించారు. 

దుష్ట శక్తుల నుంచి రక్షణ కోసం ఈ స్తోత్రాన్ని పఠిస్తారు. నిత్యం మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని పఠిస్తే అంతర్గత బలం, ధైర్యం పెరుగుతుంది. ఈ స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే జీవితంలో ఉండే సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.  మరణనానంతరం మోక్షం లభిస్తుంది. అత్యంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొనే సమయంలో ఈ స్తోత్రం పఠించడం ద్వారా ఓదార్పులభిస్తుంది. 

మహిషాసుర మర్ధిని స్తోత్రం 
అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే
గిరి వరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సురవరహర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణి తుంగ హిమాలయశృంగనిజాలయ మధ్యగతే
మధుమధురే మధుకైతభగంజిని కైతభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే
నిజ భుజదండ నిపాటితఖండ విపాటితముండ భటాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి రణ దుర్మదశత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే
చతురవిచార ధురీణమహాశివదూతకృత ప్రమతాధిపతే
దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి శరణాగత వైరివధూవర వీరవరాభయ దాయికరే
త్రిభువన మస్తకశూలవిరోధి శిరోధికృతామల శూలకరే
దుమి దుమి తామర దుందుభినాదమహోముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి నిజ హుంకృతి మాత్రనిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమరవిశోషితశోణితబీజసముద్భవశోణితబీజలతే
శివ శివ శుంభ నిశుంభమహాహవతర్పిత భూతపిశాచరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

ధనురనుసంగరరక్షణసంగపరిస్ఫురదంగనటత్కటకే
కనకపిశంగ పృషత్కనిషంగ రసద్భటశృంగ హటావటుకే
కృత చతురంగబలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్వటుకే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సురలలనాత తథేయి తధేయి తథాభినయోత్తమనృత్యరతే
హాసవిలాసహులాసమయి ప్రణతార్తజనేమితప్రేమభరే
ధిమికిటధిక్కటధిక్కటధిమిధ్వనిఘోరమృదంగనినాదలతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

జయ జయ జప్య జయేజ్ఞయశబ్దపరస్తుతితత్పర విశ్వనుతే
ఝణఝణఝింఝిమిఝింకృతనూపురశింజితమోహితభూతపతే
నటితనటార్ధనటీనటనాయకనాటితనాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి సుమనసుమనసుమనసుమనసుమనోహర కాంతియుతే
శ్రితరజనీరజనీరజనీరజనీరజనీకర వక్త్రవృతే
సునయనవిభ్రమరభ్రమరభ్రమరభ్రమరభ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

మహితమహాహవమల్లమతల్లిక మల్లిత రల్లక మల్లరతే
విరచిత వల్లికపల్లికమల్లికఝిల్లికభిల్లికవర్గవృతే
సృతకృతఫుల్లసముల్లసితారుణతల్లజపల్లవసల్లలితే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అవిరళగండగళన్మదమేదురమత్తమతంగజరాజగతే
త్రిభువనభూషణభూతకళానిధిరూపపయోనిధిరాజసుతే
అయి సుదతీజనలాలసమానసమోహనమన్మధరాజమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కమలదళామలకోమలకాంతిబలాకలితాతులఫాలతలే
సకలవిలాసకళానిలయక్రమకేళికలత్కలహంసకులే
అలికులసంకులకువలయమండలమౌళిమిలద్వకులాలికులే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కలమురళీరవవీజితకూజితలజ్జితకోకిలమంజుమతే
మిలితమిలిందమనోహరగుంజితరాజితశైలనికుంజగతే
నిజగణభూతమహాశబరీగణరంగణసంభృతకేళితతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కటితటపీతదుకూలవిచిత్రమయూఖతిరస్కృతచంద్రరుచే
ప్రణతసురాసురమౌళిమణిస్ఫురదంశులసన్నఖసాంద్రరుచే
జితకనకాచలమౌళిపదోఝితదుర్ధరనిర్ఝరతున్డకుచే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

విజితసహస్రకరైకసహస్రకరైకసహస్రకరైకనుతే
కృతసురతారకసంగరతారకసంగరతారకసూనునుతే
సురథసమానసమాధిసమానసమాధిసమానసుజాతరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం న శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయస్స కథం న భవేత్
తవపదమేవ పరం పదమిత్యనుశీలయతో మమ కింనశివే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కనకలసత్కలశీకజలైరనుషి..తి తెఢ్గణరంగభువం
భజతి స కిం ను శచీకుచకుంభతటీపరిరంభసుఖానుభవం
తవచరణం శరణం కరవాణి నతామర వాణినివాశిశివే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే

తవ విమలేందు కలం వదనేందు మలం సకలం ననుకూలయతే
కిము పురుహూత పురీందు ముఖీ సుముఖీ భిరసౌ విముఖీ క్రియతే
మమ తు మతం శివ నామ ధనే భవతీ కృపయా కుముత క్రియతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే

అయి మయి దీన దయాళు తయా కృప యైవ త్వయా భవితవ్య ముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథాను మితాసిరతే
యదుచిత మత్రభవ త్యురరీ కురుతా దురుతాప మపాకురుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే

Also Read: శరన్నవరాత్రుల్లో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరు, తింటే ఏమవుతుంది!

Also Read: ఆశ్వయుజ మాసం ప్రారంభ - ముగింపు తేదీలు.. కార్తీకమాసం ఎప్పటి నుంచి మొదలు!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

19-07-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
19-07-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
గరుడ పురాణం: భూమ్మీదకు వచ్చేముందు ఆత్మ చివరి ఆలోచన ఏంటి?
గరుడ పురాణం: భూమ్మీదకు వచ్చేముందు ఆత్మ చివరి ఆలోచన ఏంటి?
నోలన్ 'The Odyssey 'లో రామాయణ, మహాభారత పోలికలు: వైరల్ అవుతున్న 3 సారూప్యతలు!
నోలన్ 'The Odyssey 'లో రామాయణ, మహాభారత పోలికలు: వైరల్ అవుతున్న 3 సారూప్యతలు!
Kokila vrat 2026: ఆషాఢ మాసంలో కోకిల వ్రతం ఎప్పుడైనా చేశారా? వ్రత విధానం ఏంటి, ఎందుకు చేయాలి తెలుసుకోండి!
ఆషాఢ మాసంలో కోకిల వ్రతం ఎప్పుడైనా చేశారా? వ్రత విధానం ఏంటి, ఎందుకు చేయాలి తెలుసుకోండి!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Embed widget