Top Headlines Today: కేసీఆర్ ఇచ్చే సీట్లు మాకు వెంట్రుకేనన్న నారాయణ; టీటీడీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
సీఎం కేసీఆర్ ఇచ్చే సీట్లు మాకు వెంట్రుకతో సమానం - సీపీఐ నారాయణ
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చే సీట్లు తమకు వెంట్రుకతో సమానమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కలిసి వస్తేనే కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తామన్నారు. లేదంటే తమకు బలం ఉన్న 20 స్థానాలు, సీపీఎంకు బలం ఉన్న కొన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. జాతీయ స్థాయిలో పొత్తులు వేరు, రాష్ట్ర స్థాయిలో పొత్తులు వేరు అన్నారు. ఇంకా చదవండి
విమర్శలకు తలొగ్గను, తిరుపతి విషయంలో వెనకాడనన్న టీటీడీ ఛైర్మన్ భూమన
విమర్శలకు తలొగ్గి అభివృద్ధిని ఆపే వాడిని కాదని, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చుదిద్దుతామని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి తుడా కార్యాలయం వెనుక తిరుపతి స్మార్ట్ సిటీ నిధులతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన కచ్ఛపి ఆడిటోరియంను, సుకృతి కళానిలయంను ఆదివారం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, స్మార్ట్ సిటీ ఎండి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఇంకా చదవండి
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ కి ప్రమాదం
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మెన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు తృటిలో ప్రమాదం తప్పిపోయింది. వీణవంక పర్యటనకు వెళ్ళి వస్తుండగా మానకొండుర్ మండలం లలితపూర్ లో ఈటెల కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. గొర్రెలు అడ్డురావడంతో ముందు వెళ్తున్న కాన్వాయ్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఈటెల ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టింది. ఈటల క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు కాలేదని తెలియగానే ఆయన అభిమానులు, బీజేపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఇంకా చదవండి
నేడూ ఆరెంజ్ అలర్ట్, ఈ జిల్లాలకు అతిభారీవర్షాలు - ఐఎండీ అలర్ట్
నిన్న ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం ఈరోజు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తు వరకు అదే ప్రాంతంలో కొనసాగుతూ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల వాయువ్య, దాని పరిసర పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో రాబోయే 48 గంటల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఆవర్తనం నుంచి ద్రోణి ఒకటి ఉత్తర ఆంధ్ర తీరం వరకు సముద్ర మట్టంకి 1.5 కిమీ, 3.1 కిమీ ఎత్తు మధ్యలో విస్తరించి ఉంది. ఇంకా చదవండి
హిందూ ధర్మాన్ని అవమానించడం వాళ్లకు కొత్తేం కాదు, ఉదయనిధి స్టాలిన్‌పై అమిత్ షా ఫైర్
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తీవ్రంగా స్పందించారు. విపక్షాలకు హిందూ ధర్మాన్ని అవమానించడం ఇదే తొలిసారి కాదని, వాళ్లకు ఇదో అలవాటైపోయిందని మండి పడ్డారు. I.N.D.I.A కూటమి ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ సందర్భంలో బడ్జెట్ గురించి ప్రస్తావిస్తూ "మైనార్టీలకే మా తొలి ప్రాధాన్యత" అని చెప్పినట్టు గుర్తు చేశారు షా. తాము మాత్రం నిరుపేదలు, వెనకబడిన వర్గాలు, దళితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రకటించారు. కేవలం మైనార్టీల పేరు చెప్పుకుని ఓట్లు రాబట్టుకోడానికే విపక్ష కూటమి కుతంత్రాలకు పాల్పడుతోందని మండి పడ్డారు. రాహుల్ గాంధీ హిందూ సంస్థల్ని ఉగ్ర సంస్థలతో పోల్చి కించపరిచారని అన్నారు. ఇంకా చదవండి
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ - PTI ఇంటర్య్వూలో ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ PTI వార్తాసంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. G20 గురించి ప్రస్తావించిన ఆయన...ఈ సదస్సుతో భారత్ విజన్ ఏంటో ప్రపంచానికి అర్థమవుతుందని వెల్లడించారు. భారత్‌ని ప్రపంచ దేశాలు భవిష్యత్‌కి రోడ్‌మ్యాప్‌లా పరిగణిస్తున్నాయని అన్నారు. గతంలో అన్ని దేశాలూ GDP గురించి మాత్రమే ఆలోచించేవని, ఇప్పుడు క్రమంగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాయని వెల్లడించారు. ఈ విషయంలో భారత్ కూడా ముందంజలో ఉందని స్పష్టం చేశారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ నినాదం కేవలం భారత్‌కే పరిమితం కాకుండా ప్రపంచానికీ దిక్సూచిగా మారిందని అన్నారు. ఇంకా చదవండి
‘బిగ్ బాస్’ సీజన్ 7లో మారిన రూల్స్ ఇవే - ఇక అంతా ప్రేక్షకుల చేతుల్లోనే!
బిగ్ బాస్ అనేది ప్రారంభమయిన తర్వాత ప్రతీ సీజన్‌లో టాస్కులు, కంటెస్టెంట్స్ పొందే పనిష్మెంట్లు.. ఇవన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. సీజన్, సీజన్‌కు ఇవన్నీ మారుతూనే ఉంటాయి. కానీ దాదాపు ప్రతీ బిగ్ బాస్ సీజన్ లాంచ్ ఎపిసోడ్ మాత్రం ఒకేలా ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 7 మాత్రం పూర్తిగా అన్నింటికంటే భిన్నం అని, ఉల్టా పుల్టా అని లాంచ్ ఎపిసోడ్ నుండే నిరూపించుకోవడం మొదలుపెట్టింది. ఎందుకంటే మొదటి ఎపిసోడ్‌లోనే బిగ్ బాస్ సీజన్ 7లో అనేక మార్పులు జరగనున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మార్పులు చూస్తుంటే.. బిగ్ బాస్ సీజన్ 7లో మరెన్నో కొత్త మార్పులు ఉండబోతున్నాయని అర్థమవుతోంది. ఇంకా చదవండి
షకీలా ఒక సోషల్ వర్కర్ - అప్పుడు మలయాళ స్టార్‌లను వణికించింది, ఇప్పుడు అనాథలకు అమ్మగా
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అసలు సిసలైన వినోదాన్ని పరిచయం చేసిన బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' సరికొత్త సీజన్ తో తిరిగొచ్చింది. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ చెబుతూ వస్తున్న హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున.. ఈ సీజన్ లో అలరించనున్న 24 మంది కంటెస్టెంట్ లను పరిచయం చేశారు. ఎవరూ ఊహించని విధంగా అలనాటి శృంగార తార షకీలా హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇంకా చదవండి
ఆలస్యం అవుతున్న ఏథర్ 450ఎస్ డెలివరీలు - ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయంటే?
ఏథర్ 450ఎస్ లాంచ్ సమయంలో కంపెనీ దీని డెలివరీ ఆగస్టు చివరి వారం నుంచి ప్రారంభం అవుతుందని చెప్పింది. కానీ ఇప్పుడు దీన్ని సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. ఏథర్ 450S రోల్ అవుట్ కోసం కంపెనీ టైమ్‌లైన్‌ను కూడా సెట్ చేసింది. తన ఎక్స్ (ట్విట్టర్) సోషల్ మీడియా ఖాతాలో ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో తరుణ్ మెహతా కంపెనీ హోసూర్ ప్లాంట్ నుంచి విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న ప్రొడక్షన్ స్పెక్ 450ఎస్ ఫొటోలను షేర్ చేశారు. ఇంకా చదవండి
పసికూనలతో అయినా పోరు సాగేనా? - నేపాల్‌తో భారత్ మ్యాచ్‌కు వర్షం ముప్పు
ఆసియా కప్‌లో భారీ అంచనాల నడుమ పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడిన భారత జట్టు వర్షం కారణంగా ఫలితం తేలని మ్యాచ్‌తో నిరాశచెందింది. శనివారం దాయాది జట్ల మధ్య అర్థాంతరంగా ముగిసిన కీలకపోరులో అంతరాయం కలిగించిన వర్షం.. నేడు బోణీ కొట్టి సూపర్ - 4కు ఆత్మవిశ్వాసంతో అడుగేయాలని చూస్తున్నా వరుణుడు టీమిండియా ఆశలపై నీళ్లు చల్లేట్టున్నాడు. పాక్‌తో ముగిసిన పల్లెకెలె వేదికగానే నేపాల్‌తోనూ మ్యాచ్ జరగాల్సి ఉంది. వర్షం ముప్పు తప్పితే భారత ఆటగాళ్లు పసికూనలపై తమ ప్రతాపాలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా చదవండి