అన్వేషించండి

Bigg Boss Telugu 7: షకీలా ఒక సోషల్ వర్కర్ - అప్పుడు మలయాళ స్టార్‌లను వణికించింది, ఇప్పుడు అనాథలకు అమ్మగా మారింది

కింగ్ అక్కినేని నాగార్జున హోస్టుగా తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 7 గ్రాండ్ గా ప్రారంభమైంది. ప్రముఖ నటి షకీలా కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగుపెట్టారు.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అసలు సిసలైన వినోదాన్ని పరిచయం చేసిన బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్‌ బాస్‌' సరికొత్త సీజన్ తో తిరిగొచ్చింది. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ చెబుతూ వస్తున్న హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున.. ఈ సీజన్ లో అలరించనున్న 24 మంది కంటెస్టెంట్ లను పరిచయం చేశారు. ఎవరూ ఊహించని విధంగా అలనాటి శృంగార తార షకీలా హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.

నటి షకీలా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 18 ఏళ్లకే సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె.. బోల్డ్‌ క్యారెక్టర్లతో సౌత్ సినిమాలో శృంగార తారగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో అడల్ట్ చిత్రాలలో నటించి, బిగ్ స్టార్స్ కే పోటీగా నిలిచింది. జూనియర్ సిల్క్ గా 90స్ లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. మాలీవుడ్ లో ఆమె సినిమా వస్తోంది అంటే చాలు, పెద్ద పెద్ద సినిమాల విడుదలలు కూడా వాయిదా వేసుకునేవారు. 

షకీలా తల్లిది నెల్లూరు, ఆమె తండ్రి చెన్నై వాసి. వెండితెరపై బోల్డ్‌గా కనిపించే ఆమె.. నిజ జీవితంలో మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంటారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అయితే తన సొంత మనుషుల చేతిలోనే మోసపోయి కష్ట నష్టాలు అనుభవించింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఆమె జీవిత కథ ఆధారంగా 'షకీలా' బయోపిక్ కూడా తెరకెక్కింది. అలాంటి పాపులర్ నటి ఇప్పుడు 'బిగ్ బాస్ తెలుగు 7' రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టడం అందరినీ ఆకర్షించింది.

షకీలా 'బిగ్ బాస్' వేదికగా తాను సినిమాల్లోకి ఎలా వచ్చింది? చిత్ర పరిశ్రమలో ఎలాంటి ఇబ్బందు ఎదుర్కొంది? ఆస్తులు ఎలా కోల్పోయిందనే విషయాలను వివరించింది. ఆమె తన ఫ్యామిలీ గురించి షకీల మాట్లాడుతూ.. "10త్ క్లాస్ ఫెయిల్‌ కావడంతో తండ్రి చితకబాదాడు. ఆయన మేకప్‌ మెన్‌ నన్ను సినిమాల్లో చేర్పిస్తానన్నాడు. అలా ఒకరోజు నేను సిల్క్‌ స్మితను చూశాను. వెంటనే నన్ను సిల్క్‌ స్మిత చెల్లెలిగా సెలక్ట్‌ చేశారు'' అని తెలిపింది. చాలా సినిమాల్లో దుస్తులు విప్పేయమనే వారని, ఆ విషయాన్ని తన తండ్రితో చెప్తే 'చేయనని చెప్పేయ్‌' అని చాలా ఈజీగా తీసుకునేవారని చెప్పింది.

అప్పట్లో కట్టలు కట్టలు డబ్బులు వచ్చేవని, డబ్బు వ్యవహారాలన్నీ తన అక్క చూసుకునేదని షకీలా తెలిపింది. ఇన్ కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తారని చెప్పి వాటిని దాచి పెడతానని తన అక్క తీసుకెళ్లేదని, వాటితో ఆమె ధనవంతురాలైంది కానీ, తాను మాత్రం ఇలా అయిపోయానని చెప్పింది. తన సినిమాకు సెన్సార్‌ ఇవ్వకుండా ఆపేశారని, నాలుగేళ్లు ఖాళీగా ఉన్నానని, తాను తానుగా ఉండటమే బలమని చెప్పుకొచ్చింది. 

షకీల 50 మందికి పైగా ట్రాన్స్‌జెండర్ల అక్కున చేర్చుకుంది. అంతేకాదు ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్‌ను దత్తత తీసుకొని సొంత పిల్లల్లాగా వారి బాగోగులు చూసుకుంటోంది. బిగ్ బాస్ స్టేజ్ మీదకి వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి పరిచయం చేశారు నాగ్. వారి గురించి చెబుతూ షకీలా ఎమోషనల్ అయ్యారు. తనకు వచ్చిన బ్యాడ్ నేమ్‌ను మార్చుకుని.. షకీ అమ్మగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుదామనే 'బిగ్ బాస్' లో పాల్గొంటున్నట్లు షకీలా తెలిపింది.

ఇదిలా ఉంటే 2012లో ఇకపై బి గ్రేడ్ సినిమాల్లో నటించనని ప్రకటించింది షకీలా. అప్పటి నుంచి క్యారక్టెర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ వస్తోంది. 2014లో బిగ్బాస్ కన్నడ సీజన్ 2 లో ఆమె కంటెస్టెంట్ గా పాల్గొంది. 2021 మార్చిలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లో ప్రవేశించింది. మరి ఇప్పుడు 'బిగ్ బాస్ తెలుగు 7' రియాలిటీ షో ద్వారా ఆడియన్స్ ను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి. 

Also Read: ‘బిగ్ బాస్’ సీజన్ - 7‌లోకి షకీలా‌తోపాటు మరో ఐటెమ్ బాంబు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
Shiva Kumar: బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
Kalyan: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Embed widget