Bigg Boss Season 7 Telugu Live Updates: ‘బిగ్ బాస్’ సీజన్ - 7 లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి సీనియర్ నటులు - ఈ సారి 14 మందేనా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, ఇందులో పాల్గొనే సెలబ్రిటీలు ఎవరు?
LIVE
![Bigg Boss Season 7 Telugu Live Updates: ‘బిగ్ బాస్’ సీజన్ - 7 లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి సీనియర్ నటులు - ఈ సారి 14 మందేనా? Bigg Boss Season 7 Telugu Live Updates: ‘బిగ్ బాస్’ సీజన్ - 7 లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి సీనియర్ నటులు - ఈ సారి 14 మందేనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/01/efc4dca1468f983d630ce9f7340b0c451693580022261239_original.jpg)
Background
ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు వీరే
1. ప్రియాంక జైన్ (‘జానకి కలగనలేదు’ సీరియల్ నటి)
2. శివాజీ (హీరో)
3. దామిని (సింగర్)
4. ప్రిన్స్ యవార్ (‘నా పేరు మీనాక్షి’ నటుడు)
5. శుభశ్రీ (లాయర్, నటి)
6. షకీలా (నటి)
7. ఆట సందీప్ (కొరియోగ్రాఫర్)
8. శోభా శెట్టి (‘కార్తీక దీపం’ నటి)
9. టేస్టీ తేజ (జబర్దస్త్ కమెడియన్)
10. రతిక (నటి, ఇన్‌ఫ్లూయెన్సెర్)
11. డాక్టర్ గౌతం (నటుడు)
12. కిరణ్ రాథోడ్ (నటి)
13. పల్లవి ప్రశాంత్ (రైతు)
14. అమర్ దీప్ (‘జానకి కలగనలేదు’ నటుడు)
14 మంది సభ్యులే ఎంట్రీ? ‘బిగ్ బాస్’ పెద్దగానే ప్లాన్ చేశాడు - వచ్చే వారం మరికొందరు?
ప్రతి ‘బిగ్ బాస్’ సీజన్‌లో సుమారు 21 మంది ఎంట్రీ ఇస్తుంటారు. అయిేత సీజన్ - 7లో మాత్రం 14 మంది సభ్యులు మాత్రమే ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో వచ్చేవారం మరో ఏడుగురిని హౌస్‌లోకి పంపే అవకాశం ఉందని తెలుస్తోంది.
బిగ్ బాస్ హౌస్‌లోకి నవీన్ పోలిశెట్టి
‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ మూవీ ప్రమోషన్లో భాగంగా నవీన్ పోలిశెట్టి.. ‘బిగ్ బాస్’ స్టేజ్ మీదకు వచ్చాడు. అనంతరం హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ‘జానకి కలగనలేదు’ నటుడు అమర్ దీప్
‘జానకి కలగనలేదు’ సీరియల్ నటుడు అమర్దీప్ బిగ్ బాస్ హౌస్‌లోకి 14వ కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. అంతకు ముందు రైతు పల్లవి ప్రశాంత్ 13వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు.
బిగ్ బాస్లోకి కిరణ్ రాథోడ్, జెమిని సాంగ్తో దుమ్ములేపిసింది
తమిళంలో ‘జెమినీ’ మూవీతో గుర్తింపు పొందిన కిరణ్ రాథోడ్ తెలుగు ‘బిగ్ బాస్’లోకి వచ్చింది. ఈమె తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)