అన్వేషించండి

Bigg Boss Season 7: ‘బిగ్ బాస్’ సీజన్ 7లో మారిన రూల్స్ ఇవే - ఇక అంతా ప్రేక్షకుల చేతుల్లోనే!

మొదటి ఎపిసోడ్‌లోనే బిగ్ బాస్ సీజన్ 7లో అనేక మార్పులు జరగనున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మార్పులు చూస్తుంటే.. బిగ్ బాస్ సీజన్ 7లో మరెన్నో కొత్త మార్పులు ఉండబోతున్నాయని అర్థమవుతోంది.

బిగ్ బాస్ అనేది ప్రారంభమయిన తర్వాత ప్రతీ సీజన్‌లో టాస్కులు, కంటెస్టెంట్స్ పొందే పనిష్మెంట్లు.. ఇవన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. సీజన్, సీజన్‌కు ఇవన్నీ మారుతూనే ఉంటాయి. కానీ దాదాపు ప్రతీ బిగ్ బాస్ సీజన్ లాంచ్ ఎపిసోడ్ మాత్రం ఒకేలా ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 7 మాత్రం పూర్తిగా అన్నింటికంటే భిన్నం అని, ఉల్టా పుల్టా అని లాంచ్ ఎపిసోడ్ నుండే నిరూపించుకోవడం మొదలుపెట్టింది. ఎందుకంటే మొదటి ఎపిసోడ్‌లోనే బిగ్ బాస్ సీజన్ 7లో అనేక మార్పులు జరగనున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మార్పులు చూస్తుంటే.. బిగ్ బాస్ సీజన్ 7లో మరెన్నో కొత్త మార్పులు ఉండబోతున్నాయని అర్థమవుతోంది.

నాగ్ నో ఎంట్రీ..
మామూలుగా ఇప్పటివరకు జరిగిన ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో హోస్ట్.. కంటెస్టెంట్స్ కంటే ముందే హౌజ్‌లోకి వెళ్లి అసలు ఆ హౌజ్ ఎలా ఉంటుంది అని ప్రేక్షకులకు చూపించేవారు. కానీ బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్ ఉంబోతున్న హౌజ్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు తెలియలేదు. ఎందుకంటే నాగార్జున ముందుగా హౌజ్‌లోకి వెళ్లలేదు. నేరుగా కంటెస్టెంట్స్‌నే అందులోకి పంపించారు. పైగా కంటెస్టెంట్స్ లోపలికి వెళ్లే సమయానికి అక్కడ కనీసం ఫర్నీచర్ కూడా లేదు. ఆ తర్వాత వారే ఫర్నీచర్‌ను టాస్క్ ఆడి గెలుచుకున్నారు. అది కూడా ఒక టైమర్‌ను సెట్ చేసి.. ఆ టైమ్‌లోపు కంటెస్టెంట్స్ అందరూ కలిసి ఎంత ఫర్నీచర్ తెచ్చుకోగలిగితే.. అంత ఫర్నీచర్ వారి సొంతమని చెప్పారు.

పవర్ అస్త్రా ప్రేక్షకుల చేతుల్లో..
బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్‌గా ఎంటర్ అయిన వెంటనే అందరికీ ఒక ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. వారంతా కేవలం కంటెస్టెంట్సే అని ‘పవర్ అస్త్రా’ ఎవరు గెలుచుకుంటారో వారు మాత్రమే బిగ్ బాస్ హౌజ్‌లో హౌజ్‌మేట్స్‌లాగా కొనసాగుతారని చెప్పారు. అంటే ఇప్పటివరకు హౌజ్‌లో ఎవరూ కన్ఫర్మ్‌గా కంటెస్టెంట్స్ అవ్వలేదని అర్థం. అంటే ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు. పవర్ అస్త్రా లభించిన వారిని మాత్రమే బిగ్ బాస్ హౌజ్‌లో ఉంచి, మిగతావారిని పంపించేసి కొత్త వారిని తీసుకొస్తారా అన్న అనుమానాలు కూడా ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. పైగా ఈ పవర్ అస్త్రా ఎవరికి దక్కాలి అన్న నిర్ణయం ప్రేక్షకుల చేతిలో ఉంటుందని చెప్పారు కానీ అది ఎలా అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

10 కాదు ఒకటి మాత్రమే..
బిగ్ బాస్ ప్రేక్షకులు తమకు నచ్చిన ఒక కంటెస్టెంట్‌కు అయినా లేదా వేర్వేరు కంటెస్టెంట్స్‌కు అయినా 10 ఓట్లు వేసే అవకాశం ఉండేది. కానీ ఈసారి ఒక ప్రేక్షకుడికి ఒక ఓటు మాత్రమే అని చెప్పి నాగార్జున పెద్ద షాకే ఇచ్చారు. మిస్డ్ కాల్ అయినా హాట్‌స్టార్ నుండి అయినా ఒకరు కేవలం ఒక ఓటు మాత్రమే వేయగలరని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా బిగ్ బాస్‌లో మామూలుగా 20కు పైగా కంటెస్టెంట్స్ ఎంటర్ అవుతూ ఉంటారు. కానీ ఈసారి కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే హౌజ్‌లోకి వెళ్లారు. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నా కేవలం ఇద్దరిని మాత్రమే అలా తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. మరి ఈ 14 మంది కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ సీజన్ 7 ఎంతకాలం నడుస్తుంది అనే విషయంపై కూడా ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి.

Also Read: పెద్దాయన మారిపోయుండు - ‘బిగ్ బాస్’ ఓటింగ్ విషయంలో కీలక మార్పులు, ఇలాగైతే కష్టమే!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
Embed widget