అన్వేషించండి

Bigg Boss 7 Telugu: పెద్దాయన మారిపోయుండు - ‘బిగ్ బాస్’ ఓటింగ్ విషయంలో కీలక మార్పులు, ఇలాగైతే కష్టమే!

కొత్తగా ప్రారంభమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7లోని కొన్ని రూల్స్ గురించి నాగ్ క్లారిటీ ఇచ్చినా.. ఇంకా కంటెస్టెంట్స్ మాత్రం ఈ రూల్స్ విషయంలో కొంచెం కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు.

బిగ్ బాస్ ఉల్టా పుల్టా సీజన్ గురించి ఇప్పటివరకు ఎన్నో రూమర్స్ వైరల్ అవుతూ వచ్చాయి. ఫైనల్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదటి ఎపిసోడ్ లాంచ్ అయిన తర్వాత కూడా ప్రేక్షకుల్లో కొన్ని అనుమానాలు అలాగే ఉండిపోయాయి. సీజన్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది, 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి వెళ్లారు. అయినా కూడా ఇంకా ప్రేక్షకులకు పూర్తిగా ఈ సీజన్ గురించి అర్థం కాలేదు. కొత్తగా ప్రారంభమవుతున్న ‘బిగ్ బాస్’ సీజన్-7లోని కొన్ని రూల్స్ గురించి నాగ్ క్లారిటీ ఇచ్చినా.. ఇంకా కంటెస్టెంట్స్ మాత్రం ఈ రూల్స్ విషయంలో కొంచెం కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. పైగా ఓటింగ్ విషయంలో కూడా ఒకేసారి చాలా పెద్ద మార్పును తీసుకొచ్చింది బిగ్ బాస్ టీమ్.

ఒక్క ఓటు మాత్రమే..

బిగ్ బాస్ మొదటి సీజన్ నుండి ఆరవ సీజన్ వరకు ఒక్కొక్క ప్రేక్షకుడు పది ఓట్లు వేసే అవకాశాన్ని అందించారు. ఆ పది ఓట్లు ఒకే కంటెస్టెంట్‌కు వేయాలా, లేదా వేర్వేరు కంటెస్టెంట్స్‌కు డివైడ్ చేసి వేయాలా అన్న నిర్ణయం ప్రేక్షకులకే వదిలేశారు. మిస్డ్ కాల్ ద్వారా, లేదా హాట్‌స్టార్ ద్వారా ఈ ఓటలను వేసే సౌకర్యం ఉండేది. కానీ ‘బిగ్ బాస్’ సీజన్-7 మాత్రం అలా కాదు.. ఒక ప్రేక్షకుడికి ఒక ఓటు మాత్రమే వేసే అవకాశం ఉంటుంది. మిస్డ్ కాల్ ద్వారా అయినా, హాట్‌స్టార్ ద్వారా అయినా కూడా ఒక ప్రేక్షకుడు ఒక ఓటు మాత్రమే వేయగలడు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా మొదటి ఎపిసోడ్ చివర్లో ప్రకటించారు.

కొత్తగా పవర్ అస్త్రా..

పైగా బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన వారికి మరొక ట్విస్ట్‌ను కూడా ముందే ఇచ్చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన 14 మంది కేవలం కంటెస్టెంట్స్‌గా మాత్రమే వెళ్లారని, వారు హౌజ్‌మేట్స్‌గా మారాలంటే పవర్ అస్త్రాను సంపాదించుకోవాలి అన్నారు. పైగా కొందరు కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి వెళ్లే సమయానికి అక్కడ ఫర్నీచర్ కూడా ఏమీ లేదు. నాగార్జున పెట్టిన టాస్క్‌ను కంటెస్టెంట్స్ అంతా కలిసి ఆడి, ఫర్నిచర్‌ను సంపాదించుకున్నారు. పైగా ఈ టాస్క్‌లో బాగా ఆడిన శుభశ్రీ, ఆట సందీప్‌కు డీలక్స్ రూమ్స్ కూడా లభించాయి. కానీ ‘బిగ్ బాస్’ సీజన్-7లో 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉండడంపై ప్రేక్షకుల్లో పలు అనుమానాలు మొదలయ్యాయి.

70 రోజులేనా..?

మామూలుగా కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ హౌజ్‌లో కనీసం 100 రోజులు ఉండాలి. కానీ ‘బిగ్ బాస్’ సీజన్-7లో హౌజ్‌లోకి కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఎంటర్ అయ్యారు. అంటే ఈసారి బిగ్ బాస్ కేవలం 70 రోజులు మాత్రమే ఉండబోతుందా అని ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. లేదా ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీల విషయంలో కూడా ఏమైనా ట్విస్టులు ఉంటాయా అనేది కొన్నిరోజులు గడిచిన తర్వాత తెలుస్తుంది. ఒక ఎలిమినేషన్ జరుగుతున్న సమయంలోనే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందేమో అని కొత్తగా ఆలోచించడం కూడా మొదలుపెట్టేశారు బిగ్ బాస్ ఫ్యాన్స్. 

Also Read: ‘బిగ్ బాస్’ భారీ ట్విస్ట్, మొత్తం కంటెస్ట్‌లు వీళ్లే - మిగతావారంతా ఎక్కడా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
Embed widget