అన్వేషించండి

Top Headlines Today: ఐప్యాక్ - ప్రశాంత్ కిషోర్ వేర్వేరా?; సర్కార్‌కు ఏపీ హైకోర్టు ఆదేశాలు ఏంటి? - నేటి టాప్ న్యూస్

నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

ఐప్యాక్ - ప్రశాంత్ కిషోర్ వేర్వేరా ?

ఐ ప్యాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా అమరావతికి వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ఓ సంచలనంగా మారింది. దీనికి కారణం ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో ఎప్పుడూ అసోసియేట్ కాలేదు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీకి పని చేసేందుకు పీకే ఆసక్తి చూపినా.. .చంద్రబాబు అంగీకరించలేదని చెబుతారు. ఇంకా చదవండి

కార్యాలయాలను విశాఖ తరలించొద్దు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు (High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నం (Visakhapatnam)కు ప్రభుత్వ కార్యాలయాల (Government)ను తరలించవద్దని ఆదేశాలిచ్చింది. కార్యాలయాల తరలింపును సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం,  కార్యాలయాలను ఇప్పుడే తరలించవద్దని స్పష్టం చేసింది. కార్యాలయాల తరలింపుపై నమోదైన పిటిషన్లు ఏ బెంచ్ విచారణ చేపట్టాలో త్వరలోనే ప్రధాన న్యాయమూర్తి వెల్లడిస్తారని న్యాయస్థానం తెలిపింది. ఇంకా చదవండి

ఆటో డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు సీఎం రేవంత్ శుభవార్త

హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్లకు తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. వీరి కోసం రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ  ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) హామీ ఇచ్చారు. 4 నెలల కిందట హైదరాబాద్ లో కుక్క తరిమితే భవనం పై నుంచి పడి మృతి చెందిన స్విగ్గి డెలివరీ బాయ్ (Swiggy Delivery BOy) కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. మృతుడి కుటుంబానికి సీఎం సహాయనిది నుంచి రూ. 2 లక్షలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇంకా చదవండి

ప్రియాంకకు షాక్, ఠాక్రేను జరిపారు! తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా దీపా దాస్‌మున్షీ

న్యూఢిల్లీ: భారత జాతీయ కాంగ్రెస్ (Congress Party) పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమించింది. అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీకి ఏఐసీసీ షాకిచ్చింది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఏఐసీసీ ఇంచార్జ్ పదవి నుంచి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాను తప్పించారు. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా రాజస్థాన్ కు చెందిన కీలక నేత సచిన్ పైలట్ కు బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జిగా రమేష్ చెన్నితాల నియమితులయ్యారు. ఇంకా చదవండి

సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమవడం ప్రమాదకరం: రాహుల్ గాంధీ

భారత ఆర్థిక వ్యవస్థ (India Economy) గురించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  అమెరికా( America)లోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం (Harvard University)విద్యార్థులతో ఇటీవల భేటీ అయ్యారు. సమావేశానికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రసంశలు కురిపిస్తూనే, అనేక అంశాలను లేవనెత్తారు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నా, సంపద మొత్తం కొంతమంది చేతుల్లోనే ఉంటోందన్నారు రాహుల్ గాంధీ. ఈ కారణంగానే దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని అభిప్రాయపడ్డారు. ఇంకా చదవండి

టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల కోసం ఎగబడుతున్న జనం, కారణాలు ఇవే

దేశంలో వివిధ బీమా ఉత్పత్తులకు (Insurance products) డిమాండ్ పెరిగింది. ప్రజల్లో అవగాహన పెరుగుతున్న కొద్దీ, ఎక్కువ బీమా ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్ పట్ల ప్రజల్లో అవగాహన మెరుగుపడిందని ఇటీవలి నివేదిక చెబుతోంది. గతంలో, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు (Self Employed People) సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్‌కు దూరంగా ఉండేవాళ్లు. ఇప్పుడు, టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఎక్కువగా కొంటున్నారు. ఇంకా చదవండి

ఏపీ సీఎం జగన్‌కు ఫేవర్ గా వ్యూహం సినిమా, డైరెక్టర్ వర్మ కీలక విషయాలు వెల్లడి

విజయవాడ: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ వ్యూహం. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. తనను వైసీపీ మనిషి అంటున్నారని, అది నిజమేనన్నాడు ఆర్జీవీ (Director Ramgopal varma). ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఫేవర్ గానే వ్యూహం సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. విజయవాడలో నిర్వహించిన వ్యూహం ప్రి రిలీజ్ ఈవెంట్లో (Vyuham pre release event in Vijayawada) దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ - 25 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా చేశాను. కానీ వ్యూహం సినిమా నేపథ్యం ఇప్పుడు మన కళ్ల ముందు జరుగుతున్నదే. ఇందులో కథ కంటే క్యారెక్టర్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని డైరెక్టర్ వర్మ తెలిపారు. ఇంకా చదవండి

'సలార్' డైలాగ్స్ - రెబల్ స్టార్ ప్రభాస్ నోటి వెంట వింటే ఆ కిక్కే వేరప్పా!

'సలార్'లో రెబల్ స్టార్ ప్రభాస్ యాక్టింగ్, దేవా పాత్రలో ఆ యాటిట్యూడ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు సైతం అమితంగా నచ్చేశాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆయనతో డైలాగులు తక్కువ చెప్పించారు. హీరోయిజం ఎక్కువ చూపించారు. ఇంకా చదవండి

ఐపీఎల్ 2024కు హార్దిక్ పాండ్యా దూరం! రోహిత్ శర్మ చేతికే MI కెప్టెన్సీ పగ్గాలు!

ఢిల్లీ: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించిన తరువాత తెరవెనుక పెద్ద వివాదమే జరిగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించిన తరువాత జట్టులో అంతర్గతంగా సైతం ఈ నిర్ణయం ఎవరికీ రుచించలేదు. పైగా ఫ్యాన్స్ అయితే భారీ స్థాయిలో సోషల్ మీడియా ఖాతాల్లో ముంబై ఇండియన్స్ ను అన్ ఫాలో చేశారు. తాజాగా మరో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2024 (IPL 2024)కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అందుబాటులో (Hardik Pandya to Miss IPL 2024) ఉండేది కష్టమే. ఐపీఎల్ 17 సీజన్ లో ముంబై సారథిగా ఎవరు ఉంటారని చర్చ మొదలైంది. ఇందు కారణంగా హార్దిక్ పాండ్యా గాయం నుంచి ఇంకా కోలుకోలేదని ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. ఇంకా చదవండి

అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్లలో పీవీ సింధు

భారత స్టార్‌ షట్లర్‌(Indian shuttler)  పి.వి.సింధు (PV Sindhu) మరోసారి అత్యధికంగా ఆర్జించిన అంతర్జాతీయ మహిళా క్రీడాకారుల జాబితాలో చోటు  దక్కించుకుంది. 2023లో కూడా  ఆమె రూ.59 కోట్లతో ఈ లిస్టులో అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌తో కలిసి 16వ స్థానంలో నిలిచింది. గతేడాది కూడా ఇంతే ఆదాయాన్ని సంపాదించిన సింధు.. 12వ స్థానాన్ని సాధించింది. 2018లో రూ.70 కోట్లతో సింధు ఫోర్బ్స్‌ ( Forbes) జాబితాలో అత్యున్నతంగా ఏడో స్థానాన్ని దక్కించుకుంది. 2023లో దాదాపుగా రూ. 198 కోట్ల ఆదాయంతో టెన్నిస్‌ స్టార్‌ ఇగా స్వైటెక్‌ అగ్రస్థానం దక్కించుకుంది. మొత్తానికి బ్యాడ్మింటన్ క్రీడను కెరియర్ గా ఎంచుకొని వందలకోట్లు సంపాదించవచ్చునని తెలుగుతేజం పీవీ సింధు తేల్చి చెప్పింది ఇంకా చదవండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
UPSC Civils Interview: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Smartphones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
రూ.15 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
Embed widget