PV Sindhu Forbes List: అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్లలో పీవీ సింధు
Indian shuttler PV Sindhu : భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు 2023లో అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకుంది.
PV Sindhu Name in Forbes List: భారత స్టార్ షట్లర్(Indian shuttler) పి.వి.సింధు (PV Sindhu) మరోసారి అత్యధికంగా ఆర్జించిన అంతర్జాతీయ మహిళా క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకుంది. 2023లో కూడా ఆమె రూ.59 కోట్లతో ఈ లిస్టులో అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్‌తో కలిసి 16వ స్థానంలో నిలిచింది. గతేడాది కూడా ఇంతే ఆదాయాన్ని సంపాదించిన సింధు.. 12వ స్థానాన్ని సాధించింది. 2018లో రూ.70 కోట్లతో సింధు ఫోర్బ్స్ ( Forbes) జాబితాలో అత్యున్నతంగా ఏడో స్థానాన్ని దక్కించుకుంది. 2023లో దాదాపుగా రూ. 198 కోట్ల ఆదాయంతో టెన్నిస్ స్టార్ ఇగా స్వైటెక్ అగ్రస్థానం దక్కించుకుంది. మొత్తానికి బ్యాడ్మింటన్ క్రీడను కెరియర్ గా ఎంచుకొని వందలకోట్లు సంపాదించవచ్చునని తెలుగుతేజం పీవీ సింధు తేల్చి చెప్పింది
ఈ ఏడాది ఆటలో ఏమాత్రం రాణించకపోయినా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ లో గత దశాబ్దకాలంలో మొదటి 10 మంది అంతర్జాతీయ మహిళా బ్యాడ్మింటన్ స్టార్లలో మాత్రం 28 ఏళ్ల సింధు తన స్థానాన్ని నిలుపుకొంటూ ఏడాది ఏడాదికీ ఆదాయాన్ని పెంచుకొంటూనే వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదించిన మహిళా అథ్లెట్ల జాబితాలో ఈ తెలుగమ్మాయి.. 16వ స్థానంలో ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ జాబితాలో ఉంటున్న సింధూ.. 2018లో టాప్-10లో నిలిచింది. ఆ ఏడాది సింధూ.. 8.5 మిలియన్ డాలర్లతో అత్యధిక సంపాదనను ఆర్జించే మహిళా అథ్లెట్లలో ఏడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకూ ఆమెకు ఇదే బెస్ట్. గతేడాది కూడా దాదాపు ఇంతే అమౌంట్‌తో ఉన్నా 12వ ర్యాంకులో నిలిచింది. ఇక ఇప్పుడు ఈ జాబితాలో సింధు 16 వ స్థానంలో ఉంది.
గతేడాది కామన్వెల్త్ క్రీడల తర్వాత గాయాలపాలైన సింధూ.. ఫిబ్రవరిలో రికవరీ అయింది. కానీ ఆటలో మునపటి రేంజ్ ను అందుకోవడంలో విఫలమవుతూనే ఉంది. ఇప్పటికే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన సింధు.. వచ్చే ఏడాది జరగబోయే పారిస్ ఒలంపిక్స్ కు సన్నద్ధమవుతోంది. బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాశ్ పదుకొణె ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటోంది.
28 ఏళ్ళ సింధు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ పాడ్కాస్ట్లో పాల్గొంది. ఈ సందర్భంగా తన ఆమె ఆట గురించి మాత్రమే కాకుండా ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. లవ్ లైఫ్, రిలేషన్షిప్ గురించి అడిగిన ప్రశ్నలకు సింధు సరదాగా సమాధానమిచ్చింది.
రిలేషన్ షిప్ స్టేటస్పై అడిగిన ప్రశ్నకి స్పందిస్తూ తను సింగిల్ అని, ప్రస్తుతం బ్యాడ్మింటన్ తప్ప మరే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుత లక్ష్యం ఒలింపిక్స్ మాత్రమే అని, దాని కోసమే కష్టపడుతున్నానని చెప్పింది జీవితంలోఒక భాగస్వామి ఉండాలని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నించగా దాని గురించి తానెప్పుడూ అంతగా ఆలోచించలేదని, అదంతా విధి అని భావిస్తానని, ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పింది. అప్పటికి కూడా వదలని యాంకర్ మీరు ఎవరితోనైనా డేటింగ్ చేశారా అని ప్రశ్నించగా.. 'లేదు' అని బదులిచ్చింది. అయితే ఇందులో తప్పు, ఒప్పు అన్న ఆలోచన కన్నా తను ఆ విషయాలు పెద్దగా పట్టించుకొనని, జీవితం ఎలా తీసుకుపోతే అలా వెళ్ళిపోతానని సమాధానం ఇచ్చింది.