అన్వేషించండి
Advertisement
Salaar: 'సలార్' డైలాగ్స్ - రెబల్ స్టార్ ప్రభాస్ నోటి వెంట వింటే ఆ కిక్కే వేరప్పా!
Prabhas Dialogues In Salaar: 'సలార్' సినిమాలో ప్రభాస్ హీరోయిజం, ఆయన నటన గురించి అభిమానులు మాట్లాడుతున్నారు. అయితే... సినిమాలో ఆయన ఎన్ని డైలాగ్స్ చెప్పారు? అందులో పంచ్ డైలాగ్స్ ఎన్ని?
Prabhas Salaar movie dialogues In Telugu: 'సలార్'లో రెబల్ స్టార్ ప్రభాస్ యాక్టింగ్, దేవా పాత్రలో ఆ యాటిట్యూడ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు సైతం అమితంగా నచ్చేశాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆయనతో డైలాగులు తక్కువ చెప్పించారు. హీరోయిజం ఎక్కువ చూపించారు.
అసలు 'సలార్' సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగులు ఎన్ని? అంటే... 38! ఆ 38లో 'అంతేగా' లాంటి చిన్న చిన్న మాటలు కూడా ఉన్నాయి. అటువంటివి పక్కన పెట్టేసి... పంచ్ డైలాగ్స్ విషయానికి వస్తే? ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ ఏంటి? అనేది ఒక్కసారి చూడండి.
- అమ్మాయిని వెతకడం కంటే ముందు ఇండియా నుంచి బయటకు వెళ్లకుండా చూసుకుంటారు. ఒక నకిలీ కేసు పెట్టి ఎంబసీకి, పోలీస్ స్టేషనుకు పంపిస్తారు. (శృతి హాసన్ ఇండియాకి వచ్చిన తర్వాత ఆమెను కాపాడటం కోసం మైమ్ గోపితో ప్రభాస్ చెప్పే మాట)
- NO PROBLM CHACHA. SORRY BROTHER. I WILL MOVE BACK (ఓ పెద్ద లారీ ముందు ప్రభాస్ బైక్ నడిపే సీన్ ఉంది కదా! ఆ ఏరియాలో ఓ లారీ డ్రైవర్ తన బండికి అడ్డం వచ్చాడని చెబితే ప్రభాస్ చెప్పే మాట! అప్పుడు ఆయన బండి డ్రైవ్ చేయడం లేదులే)
- బ్యాట్స్ మెన్ కు బౌలింగ్ ఇచ్చినట్లు... అనీ బిగించే పనులు ఇచ్చార్రా! అదే ఇరొక్కెట్టే పనిస్తే... ఒక్కటే దెబ్బ! (ఇది ఏ సన్నివేశంలో వస్తుందనేది చెప్పడం కంటే సినిమా చూస్తే బావుంటుంది)
- రేపటి నుంచి రానమ్మ (తల్లి ఈశ్వరీ రావుతో ప్రభాస్ చెప్పే మాట! ఎప్పుడు? ఏ సందర్భంలో చెప్పారు? అనేది సినిమాలో చూడండి)
- రేయ్... నేను లేకుండా క్రికెట్ ఆడుతున్నారా - ప్రభాస్!
నువ్ క్రికెట్ కు ఎప్పుడొస్తవ్? - పిల్లాడు
రేపొస్తాలే - ప్రభాస్! - 'గొంతు మారి ఉండొచ్చు! పిలుపు మారలేదు. అయినా ప్రపంచంలో మా అమ్మ తప్ప దేవా అని పిలిచేది ఒక్కడే వరదరాజ మన్నార్' (పృథ్వీరాజ్ సుకుమారన్ తో ప్రభాస్)
- 'పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి. బయటికి ఎవడు పోతాడని కాదు. లోపలికి ఎవడొస్తాడని' (ట్రైలర్‌లో ఈ డైలాగ్ విన్నారుగా)
- 'కాటేరమ్మ పలకాలంటే.... పశువుల సంతకు పోవాలా....మందలో బాగా ఒళ్లు చేసి బాగా కొమ్ములు తిరిగిన పొట్టెలను పట్టాలా. పట్టి ఈడ్చుకురావాలా. మెడలో దండేసి ముఖానికి పసుపు కుంకుమ పూసి కత్తికి రాయిపెట్టి నూరాలా. దాని ముఖాన నీళ్లు జల్లాల. అది ఒళ్లు జలదరించిన వెంటనే.... సంతకు పోనా!' (ఈ సన్నివేశానికి థియేటర్లలో విజిల్స్ పడటం, గూస్ బంప్స్ రావడం గ్యారంటీ!'
- 'ఆడోళ్లను ఎలా ముట్టుకుంటార్రా! అది చిన్న పిల్ల.... సారీ రా!' (పృథ్వీరాజ్ సుకుమారన్ తో ప్రభాస్)
- 'నీ కొడును చంపింది నేనే. నన్నేమైనా చేసుకో. వరదాను ముట్టుకోకండి సర్..... సర్ వరదేది ఏం తప్పులేదు. అంత నేనే చేశాను. వాణ్ని ముట్టుకోకండి సర్. నన్ను కొట్టండి చంపడి. వరదాను ముట్టుకోకండి. సర్ విష్ణును నేను ఈ చేతులతో చంపాను. నన్ను చంపేయండి. దయచేసి వరదను మాత్రం ముట్టుకోవద్దు' - ఇదీ గూస్ బంప్స్ ఇచ్చే సన్నివేశమే!
- 'ఓటింగ్ ఎటువైపు పోతుందా మన చేతుల్లో లేదు... నీ ఓటు ఓటు వైపు పోవాలో మన చేతుల్లో ఉంది' ('సలార్'లో కీలక సన్నివేశంలో వచ్చే మాట! బహుశా... ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు కూడా సరిపోతుందేమో!?)
- ఖాన్సార్ ఎరుపెక్కాల. మండే నిప్పుతోనైనా... వీళ్ల రక్తంతోనైనా! (ఈ మాటకూ గూస్ బంప్స్ గ్యారంటీ)
- 'రేయ్! అట్ల నూరితే కనీసం తోలు కూడా తెగదు. వంచి నూరి నరకాలా... ఎముకలు తెగాలా!'
Also Read 'సలార్' ఫ్లాప్, ప్రభాస్ కంటే డెడ్ బాడీ నయం - విషం చిమ్ముతున్న బాలీవుడ్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion