Congress Incharges: ప్రియాంకకు షాక్, ఠాక్రేను జరిపారు! తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా దీపా దాస్‌మున్షీ
కాంగ్రెస్ (Congress Party) పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమించింది.
Deepa Dasmunshi appointed as incharge of Telangana Congress: న్యూఢిల్లీ: భారత జాతీయ కాంగ్రెస్ (Congress Party) పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమించింది. అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీకి ఏఐసీసీ షాకిచ్చింది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఏఐసీసీ ఇంచార్జ్ పదవి నుంచి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాను తప్పించారు. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా రాజస్థాన్ కు చెందిన కీలక నేత సచిన్ పైలట్ కు బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జిగా రమేష్ చెన్నితాల నియమితులయ్యారు.
తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు వీరే..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ కు విజయాన్ని అందించారు మాణిక్ రావ్ ఠాక్రే. కానీ కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నంచి ఠాక్రేను తప్పించింది ఏఐసీసీ. కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా దీపాదాస్ మున్షీని నియమించారు. ఠాక్రేకు గోవా, డామన్, డయ్యూ, దాద్రానగర్ హవేలీలకు ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అబ్జర్వర్ గా దీపాదాస్ మున్సీ పనిచేశారు. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ఠాక్రేను తప్పించి, దీపాదాస్ మున్షీకి బాధ్యతలు అప్పగించింది ఏఐసీసీ. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా మాణికం ఠాగూర్ వ్యవహించనున్నారు. అండమాన్ అండ్ నికోబార్ కు సైతం ఠాగూర్ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అజయ్ మాకెన్ కోశాధికారిగా, మిలింద్ దేవరాతో పాటు విజయ్ ఇందర్ సింగ్లాలు సంయుక్త కోశాధికారులుగా కొనసాగనున్నారు.
ముకుల్ వాస్నిక్ - గుజరాత్
ప్రియాంక గాంధీ - (యూపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తొలగింపు)
జితేంద్ర సింగ్ - అసోం, మధ్యప్రదేశ్ ( అదనపు బాధ్యతలు )
రణదీప్ సింగ్ సుర్జేవాలా - కర్ణాటక
దీపక్ బబారియా - ఢిల్లీ, హర్యానా (అదనపు బాధ్యతలు)
సచిన్ పైలట్ - ఛత్తీస్ గఢ్
అవినాష్ పాండే - ఉత్తరప్రదేశ్
కుమారి సెల్జా - ఉత్తరాఖండ్
దీపాదాస్ మున్సీ - కేరళ, లక్షద్వీప్, తెలంగాణ (అదనపు బాధ్యతలు)
రమేష్ చెన్నింతల - మహారాష్ట్ర
మోహన్ ప్రకాష్ - బిహార్
డాక్టర్ చెల్లకుమార్ - మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్
డాక్టర్ అజయ్ కుమార్ - ఒడిశా, (తమిళనాడు, పుదుచ్చేరిలకు అదనపు బాధ్యతలు)
భరత్ సిన్హ్ సోలంకి - జమ్మూ కాశ్మీర్
రాజీవ్ శుక్లా - హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్
సుఖ్వీందర్ సింగ్ రంధావా - రాజస్థాన్
దేవెందర్ యాదవ్ - పంజాబ్
మాణిక్ రావ్ ఠాక్రే - గోవా, డామన్, డయ్యూ, దాద్రా నగర్ హవేలీ
గిరిష్ ఛోడంకర్ - త్రిపుర, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్
మాణికం ఠాగూర్ - ఆంధ్రప్రదేశ్, అండమాన్ & నికోబార్