అన్వేషించండి

Top Headlines Today: డిస్కంలకు రూ.80 వేల కోట్ల అప్పు నిజమే; తుపాను బాధితులతో చంద్రబాబు - నేటి టాప్ న్యూస్

నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

డిస్కంలకు అప్పులు రూ.80 వేల కోట్లు నిజమే

తెలంగాణ రాష్ట్రం డిస్కంలకు చెల్లించే అప్పులు రూ.80 వేల కోట్లు అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ప్రచారంలో నిజానిజాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ స్పందించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ. 80 వేల కోట్ల అప్పు బాకీ ఉందని ప్రచారం జరిగింది. ఇవన్నీ మాజీ సీఎం కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు అని.. విద్యుత్ సంస్థలు దివాలా తీస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. అసలు అన్ని అప్పులు నిజమేనా? అయితే ఎందుకు అయ్యాయనే దానిపై బీఆర్ఎస్ అధికారిక ఖాతా ఎక్స్ లో వివరాలు పోస్ట్ చేసింది. ఇంకా చదవండి

లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ: భట్టి విక్రమార్క

డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర సచివాలయం ఫైనాన్స్ శాఖ కార్యాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ, వ్యయం, రాష్ట్ర అప్పుల గురించి భట్టి విక్రమార్కకి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే రామకృష్ణారావు వివరించారు. సంపద సృష్టించడం, సృష్టించిన సంపద ప్రజలకు పంచడం కోసం ఆర్థిక శాఖ అధికారులు ఆదాయ వనరుల అన్వేషణ కోసం తమ మేధస్సును ఉపయోగించాలన్నారు. ప్రభుత్వ విజయం ఆర్థిక శాఖ పైన ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, అభయ హస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అధికారులు మనస్ఫూర్తిగా పనిచేయాలి. ఉద్యోగస్తుల్లా కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నామన్న కమిట్మెంట్ తో మనస్ఫూర్తిగా విధులు నిర్వర్తించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయి. ప్రభుత్వ విజయానికి దోహదపడిన వారు అవుతారరని భట్టి విక్రమార్క అన్నారు. ఇంకా చదవండి

ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా - మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  సీఎంజగన్ మోహన్ రెడ్డికి తమపై అభిమానం  ఉండాలి కదా అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా జగన్ తమను నిరాదరిస్తున్నట్లుగా ఆయన సందేశం పంపినట్లయింది. ఒొంగోలులో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని మా అబ్బాయి కోరుకున్నాడని..  తెలంగాణ అంతా తిరిగి  బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడన్నారు. అయితే తాను మాత్రం కాంగ్రెస్ గెలుస్తుందని 50 లక్షల రూపాయలు బెట్టింగ్ కాశానన్నారు. కానీ తన కుమారుడు ఫీలవుతాడని.. ఆ బెట్టింగ్ ను వెనక్కి తీసుకున్నాన్నారు. ఇంకా చదవండి

రూ.25 వేలు అందించాలి - చంద్రబాబు డిమాండ్

'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన రెండో రోజు పర్యటించారు. శనివారం బాపట్ల (Bapatla) జిల్లాలోని పర్చూరు (Parchur) నియోజకవర్గంలో ఆయన బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. తుపాను వల్ల తాము సర్వం కోల్పోయామని జమ్ములపాలెం ఎస్టీ కాలనీలో గిరిజనులు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా చదవండి

ఇండిపెండెంట్ అభ్యర్థిని వసుంధర రాజే ప్రలోభ పెట్టారా? ఇది నిజమేనా?

ఇటీవల జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ని గద్దె దించి భారీ మెజార్టీ సాధించింది బీజేపీ. 200 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో 199 స్థానాలకు పోలింగ్ జరగ్గా బీజేపీ 115 సీట్లు సాధించింది. కాంగ్రెస్ 69 సీట్లకే పరిమితమైంది. అయితే..మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఝల్రపటన్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే...ఫలితాలకు ముందు డిసెంబర్ 1వ తేదీన వసుంధర రాజేకి సంబంధించిన ఓ 12 సెకన్ల వీడియో వైరల్ అయింది. ఇంకా చదవండి

ఖలిస్థాన్ వేర్పాటువాదంపై భారత్‌ స్ట్రాటెజీ ఏంటి? ఆరోపణల్ని ఎలా తిప్పికొట్టనుంది?

భారత్‌కి అందరి అవసరమూ ఉంది. భారత్‌తోనూ అందరికీ అవసరముంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇదీ మన ఫారిన్ పాలసీ. ఎవరితోనూ కయ్యం పెట్టుకోవడం లేదు. అలా అని ఎవరితోనూ మరీ అతి చనువుగా ఉండడం లేదు. కానీ..ఈ విధానాన్ని రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితులు తీసుకొస్తున్నాయి ఇటీవల జరిగిన పరిణామాలు. అవసరమైతే స్వప్రయోజనాలను వదులుకునైనా కాస్త కఠినంగా ఉండక తప్పదనిపించేలా చేస్తున్నాయి. ఖలిస్థాన్ వేర్పాటువాదం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ దాదాపు ఏడాదిగా ఈ వాదం బాగా బలపడింది. కెనడాలోనే ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య (Nijjar Killing) తరవాత భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో. ఇంకా చదవండి

2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే

కొత్త సంవత్సరం ప్రారంభంలో మారుతీ సుజుకి, హ్యుందాయ్, కియా, మహీంద్రా తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాయి. 2024 జనవరి 16వ తేదీన క్రెటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌ కానున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా అధికారికంగా ధృవీకరించింది. ఇది కాకుండా కియా తన ఫేస్‌లిఫ్టెడ్ సోనెట్‌ను 2023 డిసెంబర్ 14వ తేదీన పరిచయం చేయబోతోంది. అయితే మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ లాంచ్ తేదీలను అధికారికంగా ధృవీకరించలేదు. ఇది 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత మహీంద్రా  తన ఎక్స్‌యూవీ300 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అప్‌డేటెడ్ మోడళ్లను కూడా లాంచ్ చేయనుంది. ఇంకా చదవండి

ఇలాంటి ఫండ్స్‌ చేతిలో ఉంటే చాలు, టాప్‌ క్లాస్‌ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి

ఈ సంవత్సరం (2023) మ్యూచువల్ ఫండ్స్‌కు చాలా బాగా గడిచింది. డిసెంబరు మొదటి వారం అప్పుడే పూర్తయింది, ఈ సంవత్సరాంతానికి ఇక 3 వారాలే మిగిలుంది. మ్యూచువల్ ఫండ్స్ కోణంలో ఈ ఏడాదిని పరిశీలిస్తే, ఈ మాధ్యమం ద్వారా పెట్టుబడి పెట్టిన వాళ్లు భారీ లాభాలు సంపాదించారు. ఇంకా చదవండి

భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు

అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు - 'ఖలేజా' సినిమాలో త్రివిక్రమ్ రాసిన మాట! అయితే... అద్భుతాన్ని వెండితెరపై తనివితీరా చూస్తూ ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు మాత్రమే దక్కుతుంది. ఈ ఏడాది ఒక్కసారి కాదు... ఏకంగా అరడజను సార్లు ఆ అవకాశం తెలుగు ప్రేక్షకులకు లభించింది. విడుదలకు ముందు కొన్ని క్రేజ్ సొంతం చేసుకుంటే... విడుదల తర్వాత కొన్ని.... థియేటర్లలోకి వచ్చిన ఆరు సినిమాలు ప్రశంసలతో పాటు భారీ వసూళ్లు సాధించాయి. ఆ సినిమాలు ఏవో చూడండి! ఇంకా చదవండి

నమో - నరేంద్ర మోడీ కాదండోయ్, సర్వైవల్ కామెడీ సినిమా!

నమో అంటే ప్రజలకు గుర్తుకు వచ్చే ఏకైక పేరు దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi). అభిమానులు ఆయనను ముద్దుగా 'నమో నమో' అంటుంటారు. ఇప్పుడు 'నమో' పేరుతో తెలుగులో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇంకా చదవండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Embed widget