అన్వేషించండి

Namo Movie: నమో - నరేంద్ర మోడీ కాదండోయ్, సర్వైవల్ కామెడీ సినిమా!

'నమో' పేరుతో తెలుగులో ఓ సినిమా రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆ సినిమా పోస్టర్ విడుదలైంది.

Namo Telugu Movie: నమో అంటే ప్రజలకు గుర్తుకు వచ్చే ఏకైక పేరు దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi). అభిమానులు ఆయనను ముద్దుగా 'నమో నమో' అంటుంటారు. ఇప్పుడు 'నమో' పేరుతో తెలుగులో ఓ సినిమా తెరకెక్కుతోంది. 

సర్వైవల్ కామెడీ సినిమా 'నమో'
'జెర్సీ'లో ప్రత్యేక పాత్రలో నటించిన విశ్వంత్ దుద్దంపూడి (Viswant Duddumpudi) గుర్తు ఉన్నారా? హీరో నాని కుమారుడిగా (పెద్దైన తర్వాత) కనిపించారు. 'ఓ పిట్టకథ', 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్', 'కథ వెనుక కథ' సినిమాల్లో హీరోగా నటించారు. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో ఓ క్యారెక్టర్ చేస్తున్నారు.

విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా రూపొందుతున్న సినిమా 'నమో'. ఇందులో విస్మయ హీరోయిన్‌. శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకాలపై ఎ. ప్రశాంత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్యక్రమంలో శనివారం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. 

''నమో అనే పేరు వినగానే ప్రధాన నరేంద్ర మోదీ గారి మీద కథ సిద్ధం చేశారని అనుకున్నా. నగేష్, మోహన్ హీరోల పాత్రల పేర్ల మీద టైటిల్ పెట్టామని దర్శకుడు ఆదిత్య చెప్పారు'' అని పోస్టర్ విడుదల చేసిన తర్వాత భీమనేని శ్రీనివాసరావు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఆదిత్య నా దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆయన చాలా సిన్సియర్‌ పర్సన్. రెండు మూడేళ్లు నా దగ్గర ఉన్నారు. ఎంతో అకింత భావంతో పని చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అతను వచ్చి 8 ఏళ్ళు అవుతోంది. ఏదో చేయాలని, నేర్చుకోవాలన్న తపన ఆయనలో ఉంది. ఈ సినిమాతో ఆయన పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా'' అని అన్నారు.

Also Readహిందీ సినిమాలు 4, తమిళ సినిమాలు 2... తెలుగు నుంచి ఒక్కటీ లేదు - 2023లో పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్
Namo Movie: నమో - నరేంద్ర మోడీ కాదండోయ్, సర్వైవల్ కామెడీ సినిమా!

ఆదిత్య రెడ్డి కుందూరు మాట్లాడుతూ... ''ఈ రోజు మా కోసం వచ్చిన నా గురువు భీమనేని శ్రీనివాసరావు గారికి థాంక్స్. ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నా. నా కథ నచ్చి సినిమా చేయడానికి ముందుకు వచ్చిన మా హీరో విశ్వంత్‌, హీరోయిన్ విస్మయకు థాంక్స్. మా సినిమా చాలా బాగా వచ్చింది. హాయిగా నవ్వుకునేలా ఉంటుందీ సినిమా'' అని చెప్పారు. చిన్నా పెద్దా తేడాలు లేకుండా వినోదాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారని, సర్వైవల్ కామెడీ జానర్‌ సినిమా 'నమో'ను కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

Also Readఒక్కటే క్యారెక్టర్... రెండు సినిమాలు - ఇలాగైతే ఎలా శ్రీలీల, చూసుకోవాలిగా? 2023లో శ్రీలీల హిట్స్ & ఫ్లాప్స్!

''ఇదొక డిఫరెంట్ సినిమా. దర్శకుడు ఆదిత్య స్పీడుగా సినిమాను పూర్తి చేశారు. ఈ 'నమో'ను మున్ముందు సిరీస్‌ ఆఫ్ సినిమాలు కూడా తీయొచ్చు'' అని హీరో విశ్వంత్ దుద్దంపూడి అన్నారు. ''మా సినిమాలో ఫుల్ ఫన్ ఉంటుంది. విశ్వంత్ చాలా బాగా నటించారు. అనురూప్ పాత్ర బాగుంటుంది'' అని విస్మయ అన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Raakaasaa Review - 'రాకాస' రివ్యూ: సంగీత్ శోభన్ హ్యాట్రిక్ కొట్టాడా? నిహారిక కొణిదెల నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
'రాకాస' రివ్యూ: సంగీత్ శోభన్ హ్యాట్రిక్ కొట్టాడా? నిహారిక కొణిదెల నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
Ranbir Kapoor : 92 ఏళ్ల క్రితం ముత్తాత... ఇప్పుడు మనవడు - శ్రీరాముడి రోల్ వెనుక ఎమోషనల్ స్టోరీ
92 ఏళ్ల క్రితం ముత్తాత... ఇప్పుడు మనవడు - శ్రీరాముడి రోల్ వెనుక ఎమోషనల్ స్టోరీ
Saraswathi OTT : ఓటీటీలోకి వరలక్ష్మి సైకలాజికల్ థ్రిల్లర్ - ఏ ప్లాట్ ఫాంలో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వరలక్ష్మి సైకలాజికల్ థ్రిల్లర్ - ఏ ప్లాట్ ఫాంలో చూడొచ్చంటే?
Carmeni Selvam Review - 'కార్మేని సెల్వం' రివ్యూ: తప్పులు చేయించే అప్పులు - మిడిల్ క్లాస్ కష్టాలపై సినిమా ఎలా ఉందంటే?
'కార్మేని సెల్వం' రివ్యూ: తప్పులు చేయించే అప్పులు - మిడిల్ క్లాస్ కష్టాలపై సినిమా ఎలా ఉందంటే?

వీడియోలు

Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam
Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP No friends: మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
మిత్రులే లేని వైసీపీ - బీఆర్ఎస్ కూడా హ్యాండ్ - జగన్ రాజకీయం ఇంత తేడానా?
Tamil Nadu Elections 2026: విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
విజయ్ డబుల్ రోల్ వ్యూహం - తమిళనాడు రాజకీయాల్లో సాహసమా లేక తప్పిదమా?
Kaleshwaram Politics: కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
కాళేశ్వరంపై రేవంత్ వాదననే వినిపిస్తున్నకేంద్రం - బీఆర్ఎస్‌ ఉక్కిరిబిక్కిరి -ఎదురుదాడి ఎలా?
Palasa- Ichchapuram: ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
ఉద్దానం ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్‌! దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పలాస- ఇచ్చాపురం సెక్షన్‌ విలీనం!
KKR VS SRH: స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విక్ట‌రీ.. కేకేఆర్‌పై భారీ విజ‌యం; స‌త్తా చాటిన క్లాసెన్, నితీశ్, ఉనాద్క‌త్
స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విక్ట‌రీ.. కేకేఆర్‌పై భారీ విజ‌యం; స‌త్తా చాటిన క్లాసెన్, నితీశ్, ఉనాద్క‌త్
Railwaykoduru Crime News: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై దాడి! జనసేన లీడర్లపై బాధితురాలి ఫిర్యాదు!
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై దాడి! జనసేన లీడర్లపై బాధితురాలి ఫిర్యాదు!
Carmeni Selvam Review - 'కార్మేని సెల్వం' రివ్యూ: తప్పులు చేయించే అప్పులు - మిడిల్ క్లాస్ కష్టాలపై సినిమా ఎలా ఉందంటే?
'కార్మేని సెల్వం' రివ్యూ: తప్పులు చేయించే అప్పులు - మిడిల్ క్లాస్ కష్టాలపై సినిమా ఎలా ఉందంటే?
Perni Nani Fire: కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా నీ అంతు చూస్తా - మచిలీపట్నం అధికారికి పేర్ని నాని వార్నింగ్ - అసలేం జరిగిందంటే?
కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా నీ అంతు చూస్తా - మచిలీపట్నం అధికారికి పేర్ని నాని వార్నింగ్ - అసలేం జరిగిందంటే?
Embed widget