Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
జూన్ రెండో వారం వరకు ఇంతే
తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి సాయంత్ర వరకు రికార్డు స్థాయిలో ఎండలు మండిపోనున్నాయి. సాయంత్రానికి వెదర్‌ని కూల్ చేసేలా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడబోతున్నాయి. మొత్తానికి ప్రీమాన్‌సూన్ కారణంగా ఇలాంటి డిఫరెంట్ వెదర్ కనిపించనుంది. మరోవైపు రుతుపవనాలు జూన్ రెండో వారంలో వచ్చే ఛాన్స్ ఉందని ఏపీ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మట్టిలో మాణిక్యం
నాన్న గ్రామంలో వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ కూడా మొన్నటి వరకు గృహిణే.. ఇద్దరు ఆడపిల్లలు. పేదరికమే వారి నేపథ్యం.. అందరిలానే కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాలని కలలు కన్నారు. కానీ చిన్న కుమార్తె క్రీడల్లో కనబరుస్తోన్న ప్రతిభ వారిని ఆమెను మరింత ప్రోత్సహించేలా చేసింది. ఉండేది తీరగ్రామమైనా హైస్కూల్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక సార్లు విజేతగా నిలిచిన కుమార్తెకు కిక్ బాక్సింగ్ అంటే చాలా ఇష్టమని గ్రహించారు. ఇంటి దగ్గర సరదాగా క్రర్ర సాములో కూడా గాయత్రి నైపుణ్యాన్ని గమనించారు. కూతురిని ఆదిశగా ప్రోత్సహించాలని ఆలోచన ఉంది కానీ ఎక్కడో భయం వారిని వెనక్కులాగింది. ఆ భయాలను అధిగమించి కుమార్తె ఇష్టానికి తమ వంతు ప్రోత్సాహాన్ని అందించారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి కిక్ బాక్సింగ్, కర్రసాములో మూడు విభాగాల్లో మూడు బంగారు పతకాలు సాధించింది. ఆ అమ్మాయే డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సముద్రతీర ప్రాంతమైన ఓడలరేవులో మెరిసిన మాణిక్యం పినపోతు గాయత్రి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మెడికో సూసైడ్!
తెలంగాణలో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటన మరువక ముందే వరంగల్ జిల్లాకు చెందిన మరో మెడికో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఖమ్మం జిల్లాలో మెడికో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మమతా మెడికల్ కాలేజీకి చెందిన సముద్రాల మానస పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఊహాగానాలే
తెలుగు దేశం పార్టీ, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అవన్నీ గాలి వార్తలేనని తెలిపారు. అలాంటి వార్తలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. ఆదివారం వివిధ జిల్లాల నేతలతో బండి సంజయ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రం ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో నెలాఖరు వరకు జరిగే మహాజరన్ సంపర్స్ అభియాన్ కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. గడప గడపకూ బీజేపీ పేరుతో.. మోదీ సర్కారు అందించిన అభివృద్ధి, సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను టీడీపీ అధినేత చంద్రబాబు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగామ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా ప్రజలు, ప్రతిపక్ష పార్టీలను కలవకుండా ప్రగతి భవన్ కే పరిమితమై తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే నైజాం బీజేపీది కాదని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వెబ్‌సైట్‌లో అప్‌లోడ్
ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేసింది. బాధితుల సమాచారాన్ని తెలిసేందుకు, డెడ్ బాడీస్ గుర్తించేందుకు అక్కడి నుంచి అందిన సమాచారాన్ని ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఒడిశా ప్రభుత్వం నుండి అందిన వివరాలిలా ఉన్నాయి. భువనేశ్వర్‌లో 120 గుర్తుతెలియని మృతదేహాలు లభించాయి. భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని, 1929 నెంబర్ లో సంప్రదించవచ్చు. మరణించినవారిని గుర్తించడానికి NoKలను వివిధ ఆసుపత్రులలోని మార్చురీలకు తీసుకెళ్లడానికి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఏదైనా సహాయం అవసరమైతే, వారు సంప్రదించగలరు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ప్రేమ కథల కవితలు
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం తర్వాత పట్టాలపై పలు కాగితాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?
పోస్టాఫీసు ద్వారా, భారత ప్రభుత్వం చాలా పొదుపు, పెట్టుబడి పథకాలను అందిస్తోంది. వీటిలో కొన్ని స్కీమ్స్‌లో TDS కట్ అవుతుంది, కొన్ని స్కీమ్స్‌లో పన్ను మినహాయింపు లభిస్తుంది. కొన్ని పోస్టాఫీస్ పథకాలు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఆదాయ పన్ను మినహాయింపు పరిధిలోకి రావు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఆన్‌లైన్‌లో చూసేయండి
ఆదాయ పన్ను పత్రాలు (ITR) దాఖలు చేయడానికి కీలక డాక్యుమెంట్ ఫామ్-16. ఫైలింగ్‌కు అవసరమైన ముఖ్యమైన సమాచారం ఫామ్-16లో ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను విభాగం నుంచి మీరు ఎంత పన్ను వాపసు పొందవచ్చు అనే సమాచారం కూడా ఇందులో కనిపిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఓవల్‌లో మన రికార్డు ఏంటీ?
రెండేండ్లకోమారు ఐసీసీ నిర్వహించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ ఈనెల 7 నుంచి 11 దాకా ఇంగ్లాండ్‌లోని ‘ఓవల్’ మైదానం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ - ఆస్ట్రేలియాలు ఇదివరకే లండన్‌కు చేరుకుని ప్రాక్టీస్ కూడా ముమ్మరంగా చేస్తున్నాయి. అయితే ఓవల్ గ్రౌండ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ ఎవరు..? ప్రస్తుత టీమిండియా నుంచి ఓవల్‌లో మెరుగ్గా ఆడినవారు ఎవరైనా ఉన్నారా..? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే,
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్‘. ఈ చిత్రం భారత్ తో పాటు ఇతర దేశాల్లోనూ సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుతో పాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ లిస్టులో ‘స్పైడర్ మ్యాన్’ నటుడు టామ్ హాలండ్ కూడా చేరారు. ఈ సినిమా తనకు ఎంతో బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి