అన్వేషించండి

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

సంచలనం సృష్టించిన కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటన మరువక ముందే వరంగల్ జిల్లాకు చెందిన మరో మెడికో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

తెలంగాణలో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటన మరువక ముందే వరంగల్ జిల్లాకు చెందిన మరో మెడికో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఖమ్మం జిల్లాలో మెడికో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మమతా మెడికల్ కాలేజీకి చెందిన సముద్రాల మానస

అసలేం జరిగిందంటే..
వరంగల్ జిల్లాకు చెందిన సముద్రాల మానస ఖమ్మంలో మమతా మెడికల్ కాలేజీలో బీడీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. కాలేజీకి సమీపంలో ఉన్న హాస్టల్ లో ఉంటూ కాలేజీకి వెళ్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి హాస్టల్ గదిలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది మానస. ఇది గమనించి విద్యార్థినులు హాస్టర్ నిర్వాహకులకు చెప్పారు. వారు మానస గది తలుపులు బద్దలుకొట్టి  లోపలికి వెళ్లే సమయానికే జరగకూడదని నష్టం జరిగిపోయింది. మంటల్లో కాలిపోయి మానస చనిపోయినట్లు నిర్ధారించారు. హాస్టల్ నిర్వాహకుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఫిబ్రవరిలో వరంగల్ లో ఇలాంటి ఘటనే.. 
ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మెడికో విద్యార్థిని మానస ఓ పెట్రోల్ బంకుకు వెళ్లింది. పెట్రోల్ బంక్ లో మానస పెట్రోల్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా పోలీసులకు ఈ విషయం తెలిసింది. వైద్య విద్యార్థిని మానస స్వస్థలం వరంగల్ కాగా, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వరంగల్ జిల్లాకే చెందిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక తానే పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది ప్రీతి. తొలుత అపస్మారక స్థితిలో గమనించిన తోటి విద్యార్థినులు మేనేజ్ మెంట్ కు సమాచారం అందించగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. పాయిజన్ ఇంజక్షన్ తీసుకున్న తరువాత నాలుదైదు రోజులు చికిత్స పొందిన ప్రీతి చివరకు బ్రెయిన్ డెడ్ అయింది. చివరగా ప్రీతి చనిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. 

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget