search
×

Form 16: ఇంకా ఫామ్‌-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్‌ కూడా ఉంది

ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలు చేయడానికి చివరి తేదీ జులై 31.

FOLLOW US: 
Share:

Check Form-16 Online: ఆదాయ పన్ను పత్రాలు ‍‌(ITR) దాఖలు చేయడానికి కీలక డాక్యుమెంట్‌ ఫామ్‌-16. ఫైలింగ్‌కు అవసరమైన ముఖ్యమైన సమాచారం ఫామ్‌-16లో ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను విభాగం నుంచి మీరు ఎంత పన్ను వాపసు పొందవచ్చు అనే సమాచారం కూడా ఇందులో కనిపిస్తుంది.

కంపెనీలన్నీ తగిన సమయానికి ఫామ్‌-16ని అందజేస్తాయి. చాలామంది ఉద్యోగులు ఇప్పటికే ఫామ్‌-16 తీసుకున్నారు. అయితే, ఈ కీలక డాక్యుమెంట్‌ను అందుకోని వాళ్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఒకవేళ మీరు కూడా త్వరగా ఆదాయ పన్ను పత్రాలు సమర్పించాలనుకుంటే, ఫామ్‌-16 కోసం ఎదురుచూస్తుంటే, దానిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేసే ఆప్షన్‌ కూడా ఉంది.

ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఫామ్‌-16 లేదా ఫామ్‌-16Aను ఉద్యోగులకు కంపెనీలు జారీ చేస్తాయి. మూలం వద్ద మినహాయించిన పన్ను (TDS) గురించిన సమాచారం వాటిలో ఉంటుంది. ఈ ఫారాన్ని తనిఖీ చేస్తే, గత ఆర్థిక సంవత్సరంలో మీ జీతం నుంచి ఎంత పన్నును ముందుస్తుగా చెల్లించాలో మీకు తెలుస్తుంది. మీరు వాస్తవ పన్ను బాధ్యత కంటే TDS ఎక్కువగా కట్‌ అయితే, అదనంగా కట్టిన పన్ను మొత్తం వాపసు కోసం (Income Tax Refund)  క్లెయిమ్ చేయవచ్చు.

ఫామ్‌-16 కోసం ఈ నెల 15 వరకు గడువు
అన్ని కంపెనీలు TDS రిటర్న్‌లను ఫైల్ చేయడం తప్పనిసరి. ఈసారి TDS రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువు మే 31. అంటే మీ కంపెనీ కూడా ఇప్పటికే TDS రిటర్న్‌ను ఫైల్ చేసి ఉండాలి. టీడీఎస్ రిటర్న్‌ను దాఖలు చేసిన తర్వాత, ఆయా కంపెనీలు ఒకటి లేదా రెండు వారాల్లో ఫామ్‌-16ను తమ ఉద్యోగులకు జారీ చేస్తాయి. ఫామ్‌-16 జారీ చేయడానికి కంపెనీలకు ఈ నెల 15వ తేదీ వరకు గడువుంది. ఈలోగానే ఈ ఫారాన్ని మీరు అందుకునే అవకాశం ఉంది.

రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఇదే గడువు
2022-23 ఆర్థిక సంవత్సరం లేదా 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలు చేయడానికి చివరి తేదీ జులై 31. ఫారం-16 అందుకున్న తర్వాత, పన్ను చెల్లింపుదార్లు తమ ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్‌ చేయడానికి ఆలస్యం చేయవద్దని టాక్స్‌ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. ఫైలింగ్‌ గడువును పొడిగిస్తారన్న ఎలాంటి గ్యారెంటీ ప్రస్తుతానికి లేదు. కాబట్టి, చివరి తేదీ వరకు ఎదురు చూసి, అప్పుడు హడావిడి పడొద్దని చెబుతున్నారు. హడావిడిలో తప్పుడు సమాచారం ఇవ్వడానికి, ముఖ్యమైన సమాచారాన్ని మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. 

ఫారం-16ను ఆన్‌లైన్‌లో ఇలా చెక్‌ చేయవచ్చు:

ఆదాయపు పన్ను విభాగం అధికారిక వెబ్‌సైట్ https://www.incometaxindia.gov.in/Pages/default.aspxకి వెళ్లండి.
'Forms/Download' విభాగాన్ని ఓపెన్‌ చేయండి.
అక్కడ మీకు 'Income Tax Forms' ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
క్రిందికి స్క్రోల్ చేసినప్పుడు, Frequently Used Forms ఆప్షన్‌, అందులో Form-16 కనిపిస్తుంది.
దాన్ని క్లిక్ చేసిన తర్వాత, PDF, Fillable Form ఆప్షన్లు కనిపిస్తాయి.
మీ సౌలభ్యం ప్రకారం ఒకదానిని ఎంచుకోండి. దీంతో, ఫామ్‌-16 డౌన్‌లోడ్ పూర్తవుతుంది. 

ఆ ఫైల్‌ను ఓపెన్‌ చేశాక, మీ ఫామ్-16 పూర్తిగా అప్‌డేట్ అయిందా, లేదా అన్నది మీకు తెలుస్తుంది. ఫామ్‌-16 అప్‌డేట్ అయితే, దాని సాయంతో మీరు వెంటనే ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ ఫైల్ చేయవచ్చు.

మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: వడ్డీ రేట్లు పెంచిన, తగ్గించిన బ్యాంకుల లిస్ట్‌ - మీ అకౌంట్‌ పరిస్థితేంటో చెక్‌ చేసుకోండి

Published at : 04 Jun 2023 02:50 PM (IST) Tags: Income Tax ITR Income Tax Return Filing form 16

ఇవి కూడా చూడండి

Multibagger stocks: 10 రెట్ల రాబడి, 15 రెట్ల సేల్స్‌ గ్రోత్‌! ఈ SME స్టాక్స్‌ కోటీశ్వరులను చేశాయ్‌!

Multibagger stocks: 10 రెట్ల రాబడి, 15 రెట్ల సేల్స్‌ గ్రోత్‌! ఈ SME స్టాక్స్‌ కోటీశ్వరులను చేశాయ్‌!

Savings at Risk: తగ్గిన కుటుంబ ఆదా! బ్యాంకుల 'స్ట్రాటజీ'తో పెరిగిన అప్పులు!

Savings at Risk: తగ్గిన కుటుంబ ఆదా! బ్యాంకుల 'స్ట్రాటజీ'తో పెరిగిన అప్పులు!

Petrol-Diesel Price 23 September 2023: స్వల్పంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు- ఈ ప్రాంతంలో మాత్రం తగ్గుదల

Petrol-Diesel Price 23 September 2023: స్వల్పంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు- ఈ ప్రాంతంలో మాత్రం తగ్గుదల

Gold-Silver Price 23 September 2023: పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌- మీ నగరాల్లో గోల్డ్ కొనుగోలుకు ఇదే మంచి టైం

Gold-Silver Price 23 September 2023: పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌- మీ నగరాల్లో గోల్డ్ కొనుగోలుకు ఇదే మంచి టైం

Gold-Silver Price 19 September 2023: గుబులు రేపుతున్న గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price 19 September 2023: గుబులు రేపుతున్న గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

టాప్ స్టోరీస్

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Kishan Reddy On Ktr :  ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!