By: ABP Desam | Updated at : 04 Jun 2023 12:10 PM (IST)
వడ్డీ రేట్లు పెంచిన, తగ్గించిన బ్యాంకుల లిస్ట్
Interest Rates: మరికొన్ని రోజుల్లో RBI మానిటరీ పాలసీ కమిటీ (MPC) మీటింగ్ ఉంది. దీనికి ముందు, కొన్ని బ్యాంక్‌లు లోన్లు & డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు పెంచాయి/తగ్గించాయి. MPC మీటింగ్‌కు ముందు వడ్డీ రేట్లను రివైజ్ చేయడం సాధారణంగా జరిగే ప్రక్రియే.
ఇండియన్ బ్యాంక్ వడ్డీ రేట్లు
ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ (Indian Bank), తన MCLRను (Marginal Cost of Funds based Lending Rate) 0.05% లేదా 5 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో, ఒక నెల MCLR ప్రస్తుతమున్న 8.10 శాతం నుంచి 8.15 శాతానికి చేరింది. 3 నెలల వడ్డీ రేటు 8.20 శాతం నుంచి 8.25 శాతానికి ఆరు నెలల MCLR 8.45 శాతం నుంచి 8.50 శాతానికి, ఏడాది కాల వ్యవధి రుణాలపై MCLR 8.60 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది. కొత్త రేట్లు ఈ నెల నిన్నటి (శనివారం, 03 జూన్ 2023) నుంచి అమల్లోకి వచ్చాయి.
యెస్ బ్యాంక్ వడ్డీ రేట్లు
యెస్ బ్యాంక్ (Yes Bank) కూడా తన సైతం MCLRను 5 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేట్ల ప్రకారం, నెల కాల వ్యవధితో ఇచ్చే రుణలపై వడ్డీ రేటు 8.80 శాతానికి, 3 నెలల MCLR 9.45 శాతానికి, 6 నెలల రుణాలపై 9.75 శాతానికి, ఏడాది కాల వ్యవధి లోన్లపై MCLR 10.05 శాతానికి చేరింది.
ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీ రేట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) మాత్రం లోన్ రేట్లు తగ్గించింది. ఇప్పుడు, ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు హౌసింగ్ లోన్ సహా చాలా లోన్లను తక్కువ వడ్డీకే పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, తన ఓవర్‌నైట్ (ఒక రోజు రుణం) MCLRను 8.35 శాతానికి కుదించింది. ఒక నెల కాల పరిమితి లోన్లపై MCLRను 8.50 శాతం నుంచి 8.35 శాతానికి, 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మూడు నెలల కాలానికి MCLR 8.55 శాతం నుంచి 8.40 శాతానికి 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆరు నెలలు కాల వ్యవధి రుణాలపై 8.75 శాతానికి, ఒక సంవత్సరం కాల వ్యవధి రుణాలపై 8.85 శాతానికి తగ్గించింది. ఈ రేట్లన్నీ 2023 జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.
RBL బ్యాంక్ ACE FD స్కీమ్
పెద్ద అమౌంట్‌ను FD చేయాలనుకునేవాళ్ల కోసం ఆర్‌బీఎల్ బ్యాంక్ ప్రత్యేకంగా ‘ఏస్’ పేరిట ఫిక్స్‌డ్ పాజిజిట్ స్కీమ్ ప్రారంభించింది. ఇందులో, కనీసం రూ. 50 లక్షల నుంచి గరిష్టంగా రూ. 2 కోట్ల వరకు డిపాజిట్ చేయొచ్చు. 12 నెలల నుంచి 240 నెలల మధ్య, వివిధ కాల వ్యవధులకు వివిధ వడ్డీ రేట్లను బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. సాధారణ డిపాజిటర్లకు (60 ఏళ్ల వయస్సు లోపు వ్యక్తులు) 12-15 నెలలకు 7.20 శాతం, 453 రోజుల నుంచి 24 నెలల వరకు 8 శాతం, 24-36 నెలల కాలానికి 7.70 శాతం, 36-60 నెలల కాలానికి 7.30 శాతం, 60-240 నెలల కాలానికి 7.20 శాతం చొప్పున వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది. సాధారణ డిపాజిటర్ల కంటే సీనియర్ సిటిజన్లకు 0.50% లైదా 50 bps; సూపర్ సీనియర్ సిటిజన్లకు 0.75% లేదా 75 bps ఎక్కువ వడ్డీ అందుతుంది.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీలో కోత, ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్ ఉందేమో చూసుకోండి
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, 30శాతం పెరగనున్న జీతం
8th Pay Commission: 8వ వేతన సంఘం ప్రయోజనాలు ఉద్యోగులకు చేరడానికి ఎంతకాలం పడుతుందంటే ?
8th pay Commission: 8వ వేతన కమిషన్‌తో ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరిగే ఛాన్స్ ఉంది! గణాంకాలు స్టెప్ బై స్టెప్ చూడండి
Rupee At Life Time Low: రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది - అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?
Gold-Silver Prices Today 12 Jan: ఈ రోజు గోల్డ్, సిల్వర్ నగల రేట్లు ఇవీ - మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయంటే!
Manchu Family Issue: మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
ICC Champions Trophy: బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
Crime News: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
Ram Charan: ఇదీ రామ్ చరణ్ గోల్డెన్ హార్ట్... అభిమాని భార్యకు 17 రోజుల పాటు హాస్పిటల్‌లో వీఐపీ ట్రీట్మెంట్