By: ABP Desam | Updated at : 04 Jun 2023 03:20 PM (IST)
ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్ అవుతుంది?
Post Office Small Saving Schemes: పోస్టాఫీసు ద్వారా, భారత ప్రభుత్వం చాలా పొదుపు, పెట్టుబడి పథకాలను అందిస్తోంది. వీటిలో కొన్ని స్కీమ్స్‌లో TDS కట్ అవుతుంది, కొన్ని స్కీమ్స్‌లో పన్ను మినహాయింపు లభిస్తుంది. కొన్ని పోస్టాఫీస్ పథకాలు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఆదాయ పన్ను మినహాయింపు పరిధిలోకి రావు.
పోస్టాఫీస్ స్కీమ్‌ల ద్వారా జరిగే లావాదేవీ మొత్తం నిర్ణీత పరిధిని మించితే TDS (Tax Deducted at Source) వర్తిస్తుంది. పరిమితి లోపు ఉంటే TDS కట్ కాదు. ఆదాయ మూలం వద్ద పన్ను తగ్గింపును TDS అంటారు. ఇది, ఒక వ్యక్తి సంపాదించిన ఆదాయంపై ముందుస్తుగానే ఆదాయ పన్నును వసూలు చేసే విధానం. తద్వారా పన్ను ఎగవేతను నిరోధించవచ్చు. ఇలా ముందస్తుగానే కట్ అయిన TDSను ఇన్‌కం టాక్స్ ఫైలింగ్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏయే పోస్టాఫీస్ పథకాలపై TDS కట్ అవుతుంది, వేటిపై కట్ కాదో ఇప్పుడు చూద్దాం. దీనికి అనుగుణంగా మీరు పెట్టుబడి నిర్ణయం తీసుకోవచ్చు.
TDS కట్ అయ్యే, కట్ కాని పోస్టాఫీస్ పథకాలు:
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ (Post Office Recurring Deposit)
పోస్టాఫీసు RD పథకం కింద, TDS కట్ అయ్యే పరిమితి సాధారణ పౌరులకు (60 ఏళ్ల వయస్సు లోపు వాళ్లు) పరిమితి రూ. 40,000. సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్ల వయస్సున్న లేదా దాటిన వాళ్లు) పరిమితి రూ. 50,000.
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (Post Office Time Deposit)
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద (Section 80C of Income Tax Act 1961), ఐదేళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లపై రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఒక ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాల వ్యవధి కలిగిన టైమ్ డిపాజిట్లకు పన్ను వర్తిస్తుంది. ఈ కాల గడువుల్లో సంపాదించే వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (Post Office Monthly Income Scheme)
ఈ పథకం కింద వచ్చే వడ్డీ రూ. 40 వేలను దాటితే పన్ను వర్తిస్తుంది. ఈ పథకంలో పెట్టే పెట్టుబడికి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు రాదు.
మహిళ సమ్మాన్ బచత్ పత్ర యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్
మహిళ సమ్మాన్ సేవింగ్స్ లెటర్ స్కీమ్ కింద TDS కట్ అవుతుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కింద సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు దక్కుతుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), పబ్లిక్ ప్రావిండెట్ ఫండ్ (PPF)
NSC పథకం కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ అకౌంట్‌పై వచ్చే వడ్డీపై కూడా TDS వర్తించదు. PPF పథకం కూడా సంపూర్ణ పన్ను మినహాయింపు కిందకు వస్తుంది.
కిసాన్ వికాస్ పత్ర (KVP)
ఈ పథకం పన్ను మినహాయింపు కిందకు రాదు. అయితే, ఈ స్కీమ్ మెచ్యూరిటీ సమయంలో చేతికి వచ్చే మొత్తంపై TDS కట్ కాదు.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: ఇంకా ఫామ్-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్ కూడా ఉంది
Gold-Silver Prices Today 23 Nov: మళ్లీ రూ.80,000లకు చేరిన స్వర్ణం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
Bank Locker Rules: బ్యాంక్ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ
Safe Investment: రిస్క్ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్ ఆప్షన్ దొరకవు!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Pamkuntla Sai Reddy: 'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?