అన్వేషించండి

Top Headlines Today: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టు దిమ్మతిరిగే షాక్; సాగును నట్టేట ముంచారని చంద్రబాబు ఫైర్- నేటి టాప్ న్యూస్

నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

ఎమ్మెల్యే వనమా ఎన్నిక చెల్లదు- హైకోర్టు సంచలన తీర్పు

ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తేల్చేసింది. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్‌ వేసినందుకు ఈ తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్‌ తరపున 2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు పోటీ చేశారు. అప్పటి టీఆర్‌ఎస్‌ తరఫున జలగం వెంకట్రావు పోటీ చేశారు. ఇంకా చదవండి

శ్రీనివాస్ గౌడ్‌కూ హైకోర్టు షాక్ - ఎమ్మెల్యే పదవి ఉంటుందా?

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు హైకోర్టులో వ్యతిరేక తీర్పు వచ్చింది.  తన ఎన్నికల చెల్లదంటూ దాఖలైన పిటిషన్ నుకొట్టి వేయాలంటూ ఆయన దాఖలు చేసిన  పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.   మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారని  శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే, మంత్రి గా కొనసాగే అర్హత లేదని పిటిషన్ దాఖలయింది. మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు ఈ పిటిషన్ దాఖలు చేశారు.  పిటిషన్ కు అర్హత లేదని పిటిషన్ కు కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్  పై గతంలోనే వాదనలు పూర్తయ్యాయి. తాజాగా  శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. రాఘవేంద్ర రాజు వేసిన పిటిషన్ ను అనుమతించింది హైకోర్టు. ఇంకా చదవండి

నాలుగేళ్లలో 3 వేల మంది రైతుల ఆత్మహత్య - చంద్రబాబు ఫైర్!

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేల్లలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని 93 శాతం మంది రైతులు అప్పుల పాలయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై నిప్పలు చెరిగారు.   జగన్ కు సీఎంగా ఉండే అర్హతలేదంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారని విమర్శించారు. ప్రభుత్వం విధానాలతో రాష్ట్రంలో సాగును చంపేశారని..రైతులను నిండా అప్పుల్లో ముంచేశారని ఇటువంటి దారుణ పరిస్థితులకు కారణమైన జగన్ సీఎంగా ఉండటానికి అర్హతలేదు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇంకా చదవండి

హైదరాబాద్‌ సహా ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్- మూడు రోజుల పాటు భారీ వర్షాలు

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలమైన తెలంగాణకు భారత వాతావరణ శాఖ (హైదరాబాద్) మరోసారి రెడ్ అలెర్ట్ ప్రకటించంది. జూలై 25 నుంచి తెలంగాణ తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మెహబూబ్‌నగర్, నాగర్‌కర్నోల్, సిద్దిపేట, జనగాం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌లలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకా చదవండి

పిల్లి సుభాష్‌తో టీడీపీ నేతల భేటీ - పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా?

వైఎస్ఆర్‌సీపీలో అంతర్గత పంచాయతీలు  కాక రేపుతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో టిక్కెట్‌ను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఖరారు చేయడంతో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫైర్ అవుతున్నారు. అక్కడ్నుంచి తాను కానీ.. తన కుమారుడు కానీ పోటీ చేసి తీరుతామని ఆయన ప్రకటించారు. సీఎం జగన్ కు కూడా అదే చెప్పానని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఇంటికి తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్లి భేటీ కావడం చర్చనీయాంశమయింది. రెడ్డి సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కొంత మంది నేతలు పిల్లి సుభాష్ ఇంటికి వెళ్లి  మాట్లాడారు. పలు రాజకీయఅ అంమశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తమ భేటీ రాజకీయాల కోసం కాదని.. .బోస్ పెద్ద కమారుడిని పరామర్శించడానికి వచ్చామని వారు చెబుతున్నారు. ఇంకా చదవండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Embed widget