Top Headlines Today: టీడీపీ-జనసేన కలిసే ఎన్నికలకు; కవితకు ఈడీ నోటీసులు - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
టీడీపీ - జనసేన పొత్తు ఖరారు
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ తర్వాత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. జగన్ రెడ్డి యుద్ధానికి సిద్ధమంటే.. తాము కూడా సిద్ధమేనని ప్రకటించారు. గత నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన చూస్తున్నామని.. అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకే వచ్చానని సగటు మనిషి వేదన జనసేన ఆవిర్భావ సభలోనే మాట్లాడానన్నారు. ఇంకా చదవండి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్ గా మారి ఈడీకి స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ ఆరుణ్ రామచంద్ర పిళ్లైను కవిత బినామీగా ఈడీ చెబుతోంది. గతంలో కవితను ఢిల్లీలో పలుమార్లు విచారించారు. సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంకా చదవండి
విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం
ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ చెప్పేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. సుమారు నెల రోజులకుపైగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించారు. దీంతో ఇకపై తెలంగాణ ఆర్టీసీ మొత్తం ప్రభుత్వంలో భాగం కానుంది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన బిల్లును ఆగస్టు ఆరున తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఆ తర్వాత దీన్ని గవర్నర్‌కు పంపించారు. దీనిపై ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న గవర్నర్ ఇవాళ ఆమోదించినట్టు ప్రకటించారు. ఇంకా చదవండి
చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఎందుకు వేయడం లేదు
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కాం జరిగిందని అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో జైల్లో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. క్వాష్ పిటిషన్ వేశారు. వాదనలు వినిపించడానికి.. కౌంటర్ వేయడానికి ప్రభుత్వం రెండు వారాల సమయం అడిగింది.. దీంతో జడ్జి వారం రోజుల సమయం ఇచ్చారు. బెయిల్ పిటిషన్ వేసే విషయంలోనూ చంద్రబాబు ఆసక్తిగా లేరు. దీంతో క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగి నిర్ణయం వచ్చే వరకూ రాజమండ్రి సెంట్రల్ జైలు కేంద్రంగానే రాజకీయాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా చదవండి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను పూర్తిగా టార్గెట్ చేశారా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు తిరుగుతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు అప్రూవర్లుగా మారుతున్నారు. ముఖ్యంగా సౌత్ లాబీలో సీబీఐ, ఈడీ గుర్తించిన నిందితుల్లో ఒక్క కల్వకుంట్ల కవిత తప్ప దాదాపుగా అందరూ అప్రూవర్లు అయ్యారు. అంటే.. ఒక్క కవిత మాత్రమే నిందితురాలిగా మిగిలారు. ఈ మొత్తం వ్యవహారంలో కవిత పూర్తిగా ఇబ్బందుల్లో పడబోతున్నారా లేకపోతే.. కీలకమైన మార్పులు ఏమైనా జరగబోతున్నాయా అన్నది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇంకా చదవండి