అన్వేషించండి

Top Headlines Today: కదంతొక్కిన గంగవరం పోర్టు కార్మికులు - తెలంగాణలో కాంగ్రెస్‌కు షాక్ - నేటి టాప్ న్యూస్

నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

గంగవరం పోర్టు యాజమాన్యం దిద్దుబాటు చర్యలు

విశాఖలోని గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీయడంతో యాజమాన్యం చర్చలు పిలిచింది. జిల్లా అధికారుల సమక్షంలో జరిగిన చర్చల్లో కొన్ని కీలకమైన డిమాండ్లకు అంగీకరించారు. వాటి వివరాలను కార్మికులకు ఆర్డీవో వివరించారు. కార్మికులు మొదటి నుంచి చేస్తున్న డిమాండ్‌ తమకు 24 వేల నుంచి 36 వేల రూపాయల వరకుజీతాలు ఇవ్వాలని. దీనికి యాజమాన్యం ఒప్పుకో లేదు. అయితే దీనికి బదులు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద ప్రతి కార్మికుడికి పదివేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించింది. దీనికి తోడు ఇంక్రిమెంట్‌ ఇచ్చేటప్పుడు ‌అదనంగా వెయ్యి రూపాయలు ఇవ్వడానికి అంగీకరించింది. గతంలోనే ఈ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ ప్రస్తావించారు. అయితే కార్మికులు దీనికి ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్లీ అదే ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. ఇంకా చదవండి

తెలంగాణ కాంగ్రెస్‌కు పెద్ద షాక్- పార్టీ మారేందుకు సిద్ధమైన సీనియర్ ఎమ్మెల్యే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాల చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎటువైపు జంప్ చేస్తారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన ఊపుతో తెలంగాణలో కూడా అధికారంలో వస్తున్నామని జోష్ మీద ఉన్న కాంగ్రెస్‌కు పెద్ద జలక్ తగలనుందని తెలుస్తోంది. ఇంకా చదవండి

ఆంధ్ర ప్రజలు అప్పుడు తప్పు చేశారు, ఇప్పుడు అనుభవిసున్నారు - కోటా శ్రీనివాసరావు కామెంట్స్!

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో వందలాది పాత్రలు పోషించిన ఆయన అటు రాజకీయాల్లోనూ బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక గత కొంతకాలంగా ఆయనకు వయసు పైబడటం, ఆరోగ్యం సహకరించకపోవడంతో సినిమాల్లో కనిపించడం లేదు. కానీ ఈ మధ్య కొన్ని మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలో కనిపిస్తూ సినీ పరిశ్రమ గురించి, ఈతరం హీరోల గురించి ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి హీరోలపై కోటా శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలు ఎంతలా హాట్ టాపిక్ అయ్యాయో చెప్పనవసరం లేదు. ఇంకా చదవండి

ఓరుగల్లు నుంచే బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం- భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

బీఆర్ఎస్ అధికార యంత్రాంగం గెలుపే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేస్తోంది. వీలయినన్ని సభలు నిర్వహిస్తూ.. ముందుకెళ్తోంది. అక్టోబర్ 16వ తేదీన 10 లక్షల మందితో వరంగల్ జిల్లా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సభ ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలకు సీఎం కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందే ఇప్పటికే బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాలు మొదలు పెట్టింది. పార్టీ నేతలు కేటీఆర్, కవిత, హరీష్ రావుతోపాటు ముఖ్య నేతలంతా తమ తమ ప్రాంతాల్లో ప్రజల్లోకి వెళ్లి జోరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తూ... అక్టోబర్ 16వ తేదీన భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. మలిదశ ఉద్యమం ప్రారంభం నుంచి కేసీఆర్ కు వరంగల్ బాగా అచ్చొచ్చింది. అందుకే ఇక్కడి నుంచే వచ్చే ఎన్నికల కోసం ప్రచార శంఖారావం పూరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇంకా చదవండి

కర్రలపై ట్రోలింగ్స్ ఆపండి- వారి సూచనలతోనే ఆ చర్య - టీటీడీ

తిరుమల తిరుపతిలో చిరుత నాలుగేళ్ల చిన్నారి లక్షితను చంపేసిన ఘటన తరువాత అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే నడక మార్గంలో వచ్చే భక్తులందరికీ అధికారులు చేతి కర్రలు ఇస్తున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ నడుస్తుంది. ఇంకా చదవండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Pawan Kalyan: 'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan: వాలంటీర్లు వద్దు కార్యకర్తలే ముద్దు - జగన్ తేల్చేసుకున్నారు - కానీ వాళ్లు రెడీగా ఉంటారా ?
వాలంటీర్లు వద్దు కార్యకర్తలే ముద్దు - జగన్ తేల్చేసుకున్నారు - కానీ వాళ్లు రెడీగా ఉంటారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Pawan Kalyan: 'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan: వాలంటీర్లు వద్దు కార్యకర్తలే ముద్దు - జగన్ తేల్చేసుకున్నారు - కానీ వాళ్లు రెడీగా ఉంటారా ?
వాలంటీర్లు వద్దు కార్యకర్తలే ముద్దు - జగన్ తేల్చేసుకున్నారు - కానీ వాళ్లు రెడీగా ఉంటారా ?
Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామాలు ఏ సమయంలో పఠించాలి - పారాయణం వల్ల ఉపయోగం ఏంటి!
విష్ణు సహస్రనామాలు ఏ సమయంలో పఠించాలి - పారాయణం వల్ల ఉపయోగం ఏంటి!
Tirupati Stampede Issue: తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారుల బదిలీ, సస్పెన్షన్లు -  జ్యూడీషియల్ ఎంక్వైరీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు
తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారుల బదిలీ, సస్పెన్షన్లు - జ్యూడీషియల్ ఎంక్వైరీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు
Indiramm Indlu Scheme: ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
Pawan Apologizes : తిరుమల ఘటనపై దేశానికి  క్షమాపణ చెప్పిన పవన్- జగన్ కాన్వాయ్ రాకతో స్విమ్స్‌ వద్ద హైడ్రామా- డీసీఎం ఆగ్రహం
తిరుమల ఘటనపై దేశానికి క్షమాపణ చెప్పిన పవన్- జగన్ కాన్వాయ్ రాకతో స్విమ్స్‌ వద్ద హైడ్రామా- డీసీఎం ఆగ్రహం
Embed widget